వర్షాకాలంలోచిన్నపిల్లల సంరక్షణకు తీసుకోవలసిన జాగ్రత్త చర్యలు
వర్షాకాలంలో ప్రకృతి ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది , మరియు వర్షాకాలాన్ని మనం ఎంతో ఆస్వాదిస్తాము , అది కొన్ని సవాళ్లను కూడా తీసుకు వస్తుంది. ప్రత్యేకించి మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నప్పుడు చాలా జాగ్రతలు తీసుకోవాలి. వర్షాకాలంలో పిల్లలను జాగ్రత్తగా చూసుకోవడంలో సహాయపడే కొన్ని చిట్కాలు…
వస్త్రధారణ
వర్షాకాలంలో వాతావరణం తీవ్రంగా మారుతుంది. పగటిపూట వేడిగా మరియు తేమగా ఉండవచ్చు, అయితే ఇది రాత్రిపూట ఆహ్లాదకరంగా లేదా చల్లగా ఉండవచ్చు. పగటిపూట మృదువైన మరియు తేలికపాటి దుస్తులు ఇష్టపడతారు . మరియు పూర్తి స్లీవ్ లతో కూడిన మందపాటి దుస్తులు రాత్రుల్లో పిల్లలను వెచ్చగా ఉంచుతాయి.
వర్షం నుండి రక్షణ
(వెచ్చగా మరియు పొడిగా ఉంచండి)
తడి మరియు తేమ అంటువ్యాధులు వచ్చే అవకాశాలను పెంచుతాయి. అందువల్ల, పిల్లలు బయటకు వెళ్ళేటప్పుడు రెయిన్ కోట్లు మరియు గొడుగులు తీసుకెళ్లమని ప్రోత్సహించడం సముచితం. ఒకవేళ పిల్లలు వర్షం లో తడిసిపోయినప్పుడు, ఇంటికి చేరుకున్న వెంటనే శుభ్రమైన మరియు పొడి దుస్తులు ధరించమని చెప్పాలి .
డైపర్ కేర్
వర్షాకాలంలో తరచుగా మూత్రవిసర్జన చేయడం అనేది ఒక సాధారణ విషయం . మీకు పసిపిల్లలు ఉంటే తడి మరియు ఫంగల్ ఇన్ఫెక్షన్లను నివారించడానికి డైపర్లను తరచుగా మార్చాలి.ఎప్పుడు శుభ్రమైన ,పొడి దుస్తులు ఉండేలా చూడాలి .
దోమల నుంచి రక్షణ
వర్షాకాలంలో దోమలు సంతానోత్పత్తి చేస్తాయి, ఇది దోమకాటు నుండి పిల్లలు డెంగ్యూ మరియు మలేరియా వంటి ప్రమాదకరమైన అంటువ్యాధులకు గురయ్యేలా చేస్తుంది. పిల్లలను దోమలు ఎక్కువగా కూడతాయి , కాబట్టి పిల్లలను వదులుగా, పూర్తి స్లీవ్స్ దుస్తులతో ఉండేలా చూడండి. ఇది శరీరాన్ని తక్కువగా బహిర్గతం చేస్తుంది. చిన్న పిల్లలకు దోమకాటును నివారించడానికి మీరు దోమతెరలను కూడా ఉపయోగించవచ్చు. దోమ వికర్షక క్రీములను పెద్ద పిల్లలకు ఉపయోగించవచ్చు.
డయేరియా
వర్షాలు మరియు వరదలు త్రాగునీరు కలుషితం కావడానికి కారణమవుతాయి. అపరిశుభ్రమైన నీటిని తీసుకోవడం వల్ల డయేరియా ఇన్ఫెక్షన్లు పెరుగుతాయి. ఎల్లప్పుడూ ఫిల్టర్ చేయబడ్డ RO వాటర్ లేదా మరిగించి,చల్లార్చిన పరిశుభ్రమైన నీటిని తగటానికి ఉపయోగించండి. డయేరియాకు దూరంగా ఉండటానికి తరచుగా చేతులు కడుక్కోవడం కీలకం. బయటి ఆహారాన్ని పరిహరించండి మరియు తాజాగా ఇంట్లో వండిన భోజనం తీసుకోవటం మంచిది .
పరిసరాలు- పరిశుభ్రత
నిలువ ఉన్న నీరు , వరదలు, బురద మరియు మురికిగా ఉండే ఫ్లోర్ లను వర్షాకాలంలో శుభ్రం చేయడం సవాలుగా ఉంటుంది. పరిసరాలు శుభ్రంగా ఉండేలా చూడాలి , పరిసరాలలో నీరు నిలువ ఉండకుండా జాగ్రత తీసుకోవాలి . పిల్లలు బయట నుంచి ఇంటికి వచ్చినప్పుడల్లా చేతులు మరియు కాళ్ళు కడుక్కోవడం అనేది ఒక అలవాటుగా ఉండాలి. వర్షాకాలంలో కనీసం రెండుసార్లు ఫ్లోర్ ని శుభ్రం చేయాల్సి ఉంటుంది. ఫ్లోర్ ని శుభ్రం చేసేటప్పుడు కొన్ని ఫ్లోర్ క్లీనర్ లను యాంటీసెప్టిక్ లిక్విడ్ తో నీటికి కలపండి. పిల్లలు పరిశుభ్రమైన దుస్తులు, సాక్స్ లు మరియు పాదరక్షలు ధరించేలా జాగ్రతలు తీసుకోండి . ప్రతిరోజూ బిడ్డ యొక్క సాక్స్ ని మార్చండి . పిల్లల బొమ్మలను కనీసం వారానికి ఒకసారి కడిగి ఆరబెట్టండి.
సంతులిత ఆహారం
పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారం ఉండేలా చూసుకోండి, మరియు బయటి ఆహారాన్ని నివారించడానికి ప్రయత్నించండి. పుష్కలంగా ఆకుకూరలు మరియు అరటి, బొప్పాయి మరియు దానిమ్మ వంటి కాలానుగుణ లభించే పండ్లను చేర్చండి. బీట్ రూట్ లో యాంటీ ఆక్సిడెంట్లు నిండి ఉంటాయి కనుక, మీ పిల్లల డైట్ లో బీట్ రూట్ ని చేర్చుకోండి, ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ముందుగా కట్ చేసి పెట్టిన పండ్లు మరియు సలాడ్ లను వాడకండి . వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి డ్రై ఫ్రూట్స్ మరియు నట్స్ ఉత్తమ ఆహారాలు .
ఫ్లూ రక్షణ
మీ బిడ్డల యొక్క రెగ్యులర్ వ్యాక్సినేషన్ షాట్ లను మిస్ చేయవద్దు. ఫ్లూ నుండి మీ పిల్లలను రక్షించడానికి మీరు, వారికి ఇన్ఫ్లుఎంజాకు టీకాలు వేయించటం ఉత్తమం . అస్వస్థతగా ఉన్న వారి నుంచి బిడ్డను దూరంగా ఉంచడం చాలా ముఖ్యం.
మీరు మీపిల్లలు వర్షాకాలంలో అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మరియు శానిటైజర్ ఉపయోగిస్తూ, మాస్కులు ధరిస్తూ కోవిడ్ కు తగిన జాగ్రతలు తీసుకుంటూ వర్షాకాలాన్ని ఆస్వాదించండి. అవసరం అయినప్పుడు వైద్యనిపుణులను సంప్రదించండి.
References:
- Hot and Cold: Extreme Temperature Safety, Healthline: https://www.healthline.com/health/extreme-temperature-safety
- Children and the Flu, WebMD: https://www.webmd.com/cold-and-flu/children-and-flu-influenza
- Monsoon weather and early childhood health in India, NCBI: https://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC7147999/
About Author –
DCH, DNB (Pediatrics), Fellowship in Pediatric Critical Care (UK), PG Diploma in Pediatrics and Child Health (Imperial College, London)