Yashoda Hospitals > News > భారతదేశంలో మొట్టమొదటిగా విషం (పురుగు మందు) తాగిన వ్యక్తికి విజయవంతంగా ఊపిరితిత్తుల మార్పిడి చేసిన యశోద హాస్పిటల్స్
భారతదేశంలో మొట్టమొదటిగా విషం (పురుగు మందు) తాగిన వ్యక్తికి విజయవంతంగా ఊపిరితిత్తుల మార్పిడి చేసిన యశోద హాస్పిటల్స్
తీవ్ర ప్రాణాపాయంలో ఉన్న 23 ఏళ్ల తెలంగాణా యువకుడు రోహిత్ కు “సంయుక్త ఊపిరితిత్తుల మార్పిడి” తో సరికొత్త జీవితాన్ని అందించి, ప్రపంచంలోనే 4వ అరుదైన డబుల్ లంగ్ ట్రాన్స్ ప్లాంటేషన్తో చరిత్ర సృష్టించిన యశోద హాస్పిటల్స్
హైదరాబాద్, 12 అక్టోబర్, 2023: భారతదేశ ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంట్ వైద్య చరిత్రలో యశోద హాస్పిటల్స్ కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. ఇప్పటికే పెద్ద సంఖ్యలో అవయవమార్పిడి ఆపరేషన్ లతో (ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంటేషన్స్)తో దేశంలోనే ముందున్న యశోద హాస్పిటల్స్ ఇపుడు విషం తాగిన యువకునికి ఒకేసారి రెండు ఊపిరితిత్తుల మార్పిడి (కంబైన్డ్ లంగ్ ట్లాన్స్ ప్లాంటేషన్) సర్జరీని విజయవంతంగా నిర్వహించి సరికొత్త చరిత్ర నృష్టించింది. విషం (పురుగు మందు) తాగి గత నెల రోజులపైగా ప్రాణాలతో పోరాడుతున్న మహబూబాబాద్ జిల్లా, ముర్రాయిగూడెంకు చెందిన 23 ఏళ్ల రోహిత్ కు ఊపిరితిత్తుల మార్పిడిని యశోద హాస్పిటల్స్ విజయవంతంగా నిర్వహించింది. ఇది భారతదేశంలోనే విషం (పురుగు మందు) తాగిన వ్యక్తికి విజయవంతంగా సంయుక్త ఊపిరితిత్తుల మార్పిడి చేసిన మెట్టమొదటి కేస్. ఇది తెలుగు రాష్టాల వైద్యరంగానికే గర్వకారణం.
ఈ సందర్బంగా యశోద హాస్పిటల్స్ డైరెక్టర్, డాక్టర్. పవన్ గోరుకంటి, మాట్లాడుతూ.. మహబూబాబాద్ జిల్లా, ముర్రాయిగూడెంకు చెందిన 23 ఏళ్ల రోహిత్ గత నెల వ్యక్తిగత కారణాల వల్ల విషం(పురుగు మందు) సేవించి ప్రాణాపాయస్థితిలో యశోద హాస్పిటల్ సికింద్రాబాద్ రావడం జరిగింది. కలుపు మరియు గడ్డి నియంత్రణకు ఉపయోగించే “పారాక్వాట్” అనే ఒక విష రసాయనం తాగడం వల్ల రోహిత్ ఊపిరితిత్తులు, మూత్రపిండాలు మరియు కాలేయనికి బారి నష్టం జరిగింది. పారాక్వాట్ విషకణాలు చురుకుగా ఊపిరితిత్తులను చేరడం ద్వారా ఫలితంగా కోలుకోలేని పల్మనరీ ఫైబ్రోసిస్ ఏర్పడింది.శ్వాసకోశ వైఫల్యం పారాక్వాట్ మత్తు చివరి దశలో మరణానికి దారితీస్తుంది. ఇప్పటి వరకు ఇలాంటి పరిస్థితులలో ఒక పేషెంట్ కు ఊపిరితిత్తుల మార్పిడి ప్రపంచంలోని కొన్ని కేంద్రాలలో మాత్రమే జరిగింది. ఇలాంటి పరిస్థితులలో ఊపిరితిత్తుల మార్పిడి భారతదేశంలో ఇదే మొట్టమొదటిదన్నారు. అలాగే ఇలాంటి సందర్భంలో ఊపిరితిత్తుల మార్పిడి జరిగిన కేసులు ప్రపంచవ్యాప్తంగా 4 మాత్రమే ఉన్నాయని, అందులో ఎక్కువ కాలం జీవించి ఉన్న కేసు కూడా ఇదే మొట్టమొదటిది. తీవ్ర ప్రాణాపాయంలో ఉన్న ఈ 23 ఏళ్ల తెలంగాణా యువకుడికి “డబుల్ లంగ్ ట్రాన్స్ ప్లాంటేషన్” ద్వారా సరికొత్త జీవితాన్ని అందించడంద్వారా ప్రపంచంలోనే అరుదైన ఈ 4వ విజయవంతమైన సర్జరీతో భారత వైద్యరంగం-ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంట్ రంగంలో చరిత్ర సృష్టించడం మన తెలుగు రాష్టాలకు ఎంతో గర్వకారణంఅని, యశోద హాస్పిటల్స్ డైరెక్టర్, డాక్టర్. పవన్ గోరుకంటి, తెలిపారు.
సికింద్రాబాద్ యశోద హాస్పిటల్, సీనియర్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ వైద్య నిపుణులు డాక్టర్. హరికిషన్ గోనుగుంట్ల, మాట్లాడుతూ.. ప్రాణాపాయస్థితిలో మా దగ్గరకు వచ్చిన రోహిత్ ను మెకానికల్ వెంటిలేటర్‌పై వైద్యం అందించి, ఆ తర్వాత అదనపు కార్పోరల్ సపోర్ట్ (ECMO)కి మార్చడం జరిగింది. అతను 15 రోజులకు పైగా ఎక్మో సపోర్ట్ పొందినప్పటికీ అతనిలో ఎటువంటి మెరుగుదల లేకపోవడంతో ఊపిరితిత్తుల మార్పిడి కోసం పరిగణించబడ్డాడు. భారతదేశంలోనే ఇటువంటి పరిస్థితి నుంచి ఇంతవరకు ఎవరు బయటపడలేదు కాబట్టి నిర్దిష్ట పరీక్ష ద్వారా అతని శరీరంలో ఎటువంటి విషం మిగిలి లేదని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే ఊపిరితిత్తుల మార్పిడికి మా వైద్యబృందం ప్రణాళిక చేసింది.
భారతదేశంలో ఇలాంటి సందర్బాల్లో అవయవ మార్పిడికి ముందు శరీరంలో మిగిలి ఉన్న విష అవశేషం మొత్తాన్ని తెలుసుకోవడానికి పరీక్ష లభ్యతలో పరిమితి ఉన్నందున ఈ కేసు అనేక విధాలుగా ప్రత్యేకమైనది. తెలంగాణ స్టేట్ “జీవన్ దాన్” సంస్థ అవయవ దానం చొరవలో భాగంగా బ్రెయిన్ డెడ్ అయిన రోగి (దాత) నుండి సేకరించిన ఊపిరితిత్తులను, సీనియర్ ఇంటర్వెన్షనల్ పల్మోనాలజిస్ట్ డాక్టర్ హరి కిషన్ గోనుగుంట్లతో పాటు థొరాసిక్ సర్జన్లు డాక్టర్. కె. ఆర్. బాల సుబ్రహ్మణ్యం, డాక్టర్. మంజునాథ్ బాలే, డాక్టర్. చేతన్, డాక్టర్. శ్రీచరణ్, డాక్టర్. విమి వర్గీస్తో కూడిన వైద్య బృందం ఆరు గంటల ఆపరేషన్ తరువాత రోహిత్కు విజయవంతంగా “లంగ్ ట్రాన్స్ ప్లాంటేషన్” సర్జరీ పూర్తయ్యింది. స్థిరమైన పరిస్థితిలో రోహిత్ ను ఐ.సి.యు.కు తరలించారు. శస్త్రచికిత్స పూర్తయ్యే సరికే ఊపిరితిత్తులు పనిచేయటం ప్రారంభించినప్పటికీ మరో 24 గంటల పాటు వెంటిలేటర్ సాయం అందించి, తరువాత కోలుకుంటున్న స్థితిలో రెండు వారాల పాటు ఐ.సి.యు లో వైద్యుల పర్యవేక్షణలో ఉంచి ఆపైన ఆస్పత్రిలోని గదికి మార్చాం. యశోద హాస్పిటల్స్ లో ఉన్న అత్యాధునిక వైద్య సదుపాయాలు మరియు నిపుణులైన వైద్య బృందం 24 గంటల పర్యవేక్షణతో చాలా తక్కువ సమయంలో అద్భుతమైన రికవరీ సాదించి రోహిత్ ను హాస్పిటల్ నుండి విజయవంతంగా డిశ్చార్జ్ చేయగలిగామని యశోద హాస్పిటల్స్- సికింద్రాబాద్ కు చెందిన సీనియర్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ వైద్య నిపుణులు డాక్టర్. హరికిషన్ గోనుగుంట్ల తెలియజేశారు.
News Coverage:
- https://telanganatoday.com/successful-double-lung-transplant-on-paraquat-poisoning-patient-at-yashoda-hospitals
- https://tv9telugu.com/telangana/hyderabad/successful-double-lung-transplant-on-paraquat-poisoning-patient-at-secunderabad-yashoda-hospitals-1087894.html
- https://www.newstap.in/health/yashoda-hospitals-completes-first-ever-double-lung-transplant-in-india-1499416
- https://www.deccanchronicle.com/lifestyle/health-and-wellbeing/141023/indias-first-successful-double-lung-transplantation-conducted-at-ya.html
- https://www.sakshi.com/telugu-news/telangana/successfully-transplanted-two-lungs-1812494
- https://www.ntnews.com/telangana/the-doctors-of-secunderabad-yashoda-hospital-have-set-a-world-record-in-lung-transplant-surgery-1289137
- https://www.eenadu.net/telugu-news/ts-top-news/general/2601/123190372
- https://india.postsen.com/trends/1185307.html
- https://navatelangana.com/successful-lung-transplant-in-yashoda/
- https://www.siasat.com/hyderabad-doctors-successfully-conduct-rare-double-lung-transplantation-2721060/
- https://www.thehindu.com/news/national/telangana/rare-double-lung-transplant-saves-23-year-old-patient/article67417605.ece
- https://www.etvbharat.com/english/state/telangana/telangana-man-undergoes-indias-first-double-lung-transplant-at-yashoda-hospital/na20231014131625671671041
- https://jantaserishta.com/telangana/indias-first-successful-double-lung-transplant-in-yashoda-hospital-366434
- https://vidhaatha.com/telangana/first-successful-lung-transplant-in-india-74163
- https://telugu.hindustantimes.com/telangana/secunderabad-yashoda-hospital-doctors-transplant-both-lungs-first-time-in-india-121697277376505.html
- https://www.etvbharat.com/telugu/telangana/gallery/news/lung-transplantation-in-secunderabad-yashoda-hospital-double-lung-transplatation-in-hyderabad/ts20231014123249780780135
- https://epaper.thehindu.com/ccidist-ws/th/th_hyderabad/issues/55698/OPS/GM8BSO6D6.1.png?cropFromPage=true
- https://newsmeter.in/science-health/hyderabad-yashoda-docs-perform-india-first-successful-bilateral-double-lung-transplantation-719312
Youtube Coverage:
- https://youtu.be/xwfjHnCjsIs?si=lhCmvfte5w0zzuds
- https://youtu.be/quCt5XT_YG4?si=VliJwizIiwHCTWoG
- https://youtu.be/wavB2yiSXpw
- https://youtu.be/4HC4ZE7KX_U?si=xL7OnU6rZp03-BFp
- https://youtu.be/4HC4ZE7KX_U?si=6Dfvy88QAivWiWwq
- https://youtu.be/KDHzcPUlHBQ?si=vvnvkkemIUXUnp5H
- https://youtu.be/1w_xPHXaZPc?si=LDVNegZANeBBKu2W
- https://youtu.be/KDHzcPUlHBQ?si=VMGQhCgVrtOIUqMA
- https://youtu.be/ZUO8NW8LKBE?si=9LoFxwa7aRQEm3uu
- https://youtu.be/XFlC3wN_GJk?si=6b1qJSGyzWhRjSD6
- https://youtu.be/UccemyqfZ34?si=-skMFnBZei982se_
- https://youtu.be/p2VFrRMTlf8
- https://youtu.be/rtQJC3Ei3b4
- https://www.youtube.com/live/bTaZ_BVscRc?si=GugeZNfnwp4QCduB