‘బ్రెయిన్ స్ట్రోక్’ పై యశోద హాస్పిటల్స్‌ అవగాహన కార్యక్రమం

బ్రెయిన్ స్ట్రోక్ పేషెంట్లకు వరం-అత్యాధునిక “మెకానికల్ థ్రోంబెక్టమీ” చికిత్స

పక్షవాతం (బ్రెయిన్ స్ట్రోక్) ముప్పునుంచి ప్రాణాలను కాపాడే ప్రపంచస్థాయి DTAS-డైరెక్ట్ టు ఆంజియో సూట్ & ‘న్యూరో-ఆంజియో’ టెక్నాలజీని యశోదా హాస్పిటల్స్ అందుబాటులోకి తెచ్చింది 

వరల్డ్ స్ట్రోక్ డే సందర్భంగా యశోద హాస్పిటల్స్ సికింద్రాబాద్ వారి ఆధ్వర్యంలో బ్రెయిన్ స్ట్రోక్ పేషెంట్లలో కొత్త చికిత్సలు మరియు సాంకేతికతలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ అడిషనల్ పోలీస్ కమీషనర్ శ్రీ. జి. సుధీర్ బాబు మాట్లాడుతూ.. పక్షవాతం (బ్రెయిన్ స్ట్రోక్) అనేది మనిషిని తెలియకుండానే కుంగదీసే ప్రమాదకరమైన వ్యాధి. అప్పటి వరకు ఆరోగ్యంగా కనిపించే వ్యక్తిని అకస్మాత్తుగా వికలాంగుడిగా మార్చటమే కాక కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. మహిళలతో పోలిస్తే పురుషుల్లో పక్షవాతం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మద్యం తాగడం, పొగతాగడం వంటి చెడు అలవాట్లు మరియు దీర్ఘకాలిక వ్యాధులు, మధుమేహం, అధిక రక్తపోటు, స్థూలకాయం వంటి సమస్యల వల్ల పక్షవాతం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వయసు పెరిగే కొద్దీ క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం మంచిది. ముఖ్యంగా బ్రెయిన్ స్ట్రోక్ పట్ల అందరిలో మరింత అవగహన రావడం ఎంతో అవసరమని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా యశోద హాస్పిటల్స్ గ్రూప్, డైరెక్టర్, డా.పవన్ గోరుకంటి మాట్లాడుతూ.. బ్రెయిన్ స్ట్రోక్ అనేది తెలియకుండానే ఒక వ్యక్తిని కుంగదీసే ప్రమాదకరమైనది. ‘బ్రెయిన్ స్ట్రోక్’ అప్పటివరకు ఆరోగ్యంగా ఉన్న వ్యక్తిని ఒక్కసారిగా వికలాంగుడిగా మారుస్తుంది. కొన్ని సందర్భాల్లో మరణానికి కూడా దారితీస్తుంది. యశోద హాస్పిటల్స్ మొట్టమొదటి సారిగా  “మెకానికల్ థ్రోంబెక్టమీ” అని పిలువబడే అత్యాధునిక చికిత్స మరియు సాంకేతిక విధానం అందుబాటులోకి తెచ్చింది. బ్రెయిన్ స్ట్రోక్ చికిత్సలో ఈ కొత్త సాంకేతికతో చాలా మంది రోగులను వైకల్యం మరియు ప్రాణాపాయం నుంచి కాపాడుతోంది. మెదడుకు రక్త సరఫరా నిలిచిపోయినప్పుడు స్ట్రోక్ సంభవిస్తుంది, ఫలితంగా మీ మెదడు కణాలకు తాత్కాలిక లేదా శాశ్వత నష్టం జరుగుతుంది. మెకానికల్ థ్రోంబెక్టమీ ప్రక్రియ రక్త నాళాలలో గడ్డలను క్లియర్ చేయడంలో సహాయపడటయే కాక మెదడుకు రక్త ప్రసరణను అందిస్తుంది. యశోద హాస్పిటల్స్ ఈ చికిత్సను అందించడంలో ముందంజలో ఉంది, ఇప్పటివరకు 250 మందికి పైగా బ్రెయిన్ స్ట్రోక్ పేషెంట్లు ఈ చికిత్సను పొందారు, 80% మంది పేషెంట్లు ఈ అత్యాధునిక “మెకానికల్ థ్రోంబెక్టమీ” చికిత్స విధానం ద్వారా బ్రెయిన్ స్ట్రోక్ తరువాత కూడా తిరిగి మాములు జీవితం గడపగలుగుతున్నారు. ఈ చికిత్స బ్రెయిన్ స్ట్రోక్ ప్రారంభ లక్షణాల తర్వాత 24 గంటల వరకు చేయవచ్చన్నారు.

యశోద హాస్పిటల్స్ సీనియర్ న్యూరాలజిస్ట్, డాక్టర్. ఆర్. ఎన్. కోమల్ కుమార్ & న్యూరో & ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్, డాక్టర్. షాహ్యాన్ మొహ్సిన్ సిద్ధిఖీ,మాట్లాడుతూ.. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన తరువాత రక్త నాళాలను తిరిగి తెరవడానికి రెండు చికిత్స విధానాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ముందుగా, థ్రోంబోలిసిస్ ఇంజెక్షన్: ఇది పక్షవాతం ప్రారంభమైన 4-5 గంటల వరకు ఉపయోగపడుతుంది. రెండవది థ్రోంబెక్టమీ – పక్షవాతం వచ్చిన 24 గంటల వరకు చేయగలిగేది, ఇది స్టెంట్ ద్వారా రక్తనాళంలో రక్తప్రసరణకు అడ్డుగా ఉన్న దానిని తొలగించే పద్ధతి. పక్షవాతం వచ్చిన వెంటనే ఆసుపత్రికి వెళ్లగలిగితే యధావిధిగా జీవించగలుగుతారు. వైద్యరంగంలో అత్యుత్తమ వైద్య సేవలను అందించడంలో ఎప్పుడూ ముందుండే యశోద హాస్పిటల్స్, DTAS (డైరెక్ట్ టు యాంజియో సూట్)తో “బై-ప్లేన్ న్యూరో యాంజియో ప్రొసీజర్ సూట్” అనే అత్యాధునిక సాంకేతికతను ప్రారంభించి ఎంతో మంది బ్రెయిన్ స్ట్రోక్ పేషెంట్లను కాపాడగలిగామరి అన్నారు. పక్షవాతం వచ్చిన వ్యక్తులు వ్యాధి లక్షణాలు కనిపించిన తర్వాత స్ట్రోక్ సెంటర్‌కు చేరుకోగానే, ఎంత త్వరగా చికిత్స అందిస్తే అంత త్వరగా మెరుగైన ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది. స్ట్రోక్ వచ్చిన తరువాత ప్రతి 1 గంట ఆలస్యం మంచి ఫలితం వచ్చే అవకాశం 30% గణనీయంగా తగ్గుతుంది. ఈ “బై-ప్లేన్ న్యూరోఆంజియో ప్రొసీజర్ సూట్”తో బ్రెయిన్ స్ట్రోక్ రోగికి చేయవలసిన స్కానింగ్ పరీక్షలు, వాటి ఫలితాలు, తదుపరి చికిత్స నిర్ణయాలు మరియు చికిత్సలు (థ్రాంబోలైసిస్, ధ్రాంబొక్టెమి) లాంటివన్నీ కూడా ఒకే గదిలో, ఒకే మెషీన్ మీద చేస్తారు, తద్వార అమూల్యమైన గోల్డెన్ అవర్ సమయంలో, రోగికి సమయం వృథా కాకుండా థ్రాంబోలైసిస్ , ధ్రాంబొక్టెమి చికిత్స సత్వరంగా అందిస్తారు. సమయానుసారం చేసే ఈ చికిత్స వల్ల పక్షవాతం నుంచి త్వరగా కోలుకొనే అవకాశం ఉంటుంది. ఈ సూట్ అధునాతన ఇమేజింగ్ సామర్థ్యాలను కలిగి ఉండి మరియు రోగి చుట్టూ 360 డిగ్రీలు కదలగలదు. బై-ప్లేన్ సిస్టమ్ అత్యంత వేగం మరియు కచ్చితత్వంతో రోగి ప్రాణాలను రక్షించే సంరక్షణను అందించడానికి మా బృందాన్ని సన్నద్ధం చేస్తుందని తెలిపారు.

Photos