Yashoda Hospitals > News > ఇప్పుడు హైటెక్ సిటీ యశోద హాస్పిటల్స్‌లో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో బోన్ మ్యారో & స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంట్ సెంటర్
ఇప్పుడు హైటెక్ సిటీ యశోద హాస్పిటల్స్‌లో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో బోన్ మ్యారో & స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంట్ సెంటర్
‘రక్త’ సంబంధిత క్యాన్సర్ల కు, రక్త రుగ్మతలకు అందుబాటులో అత్యాధునిక వైద్య చికిత్సలు
క్యాన్సర్ చికిత్స చర్రితలో ఇప్పటికే ఎన్నో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చిన యశోద హాస్పిటల్స్-హైటెక్ సిటీ, ఇప్పుడు భారతదేశంలో ఒక అతిపెద్ద మరియు అత్యంత అధునాతన ప్రపంచస్థాయి బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంట్ (ఎముక మజ్జ మార్పిడి) సెంటర్ ను హైదరాబాద్ లో ప్రారంబించింది. రక్త క్యాన్సర్ (హెమటోలాజిక్ క్యాన్సర్) రక్తం, ఎముక మజ్జ లేదా శోషరస వ్యవస్థను ప్రభావితం చేసే ఒక రకమైన క్యాన్సర్. ఇందులో లుకేమియా, లింఫోమా మరియు మల్టిపుల్ మైలోమా వంటి వివిధ రకాల రక్త క్యాన్సర్లను మాత్రమే కాకుండా, అప్లాస్టిక్ అనీమియా, ఇమ్యునో డెఫిషియెన్సీ డిజార్డర్స్, జెనెటిక్ మరియు మెటబాలిక్ డిజార్డర్స్ మరియు ఆటో ఇమ్యూన్ డయోడర్స్ వంటి క్యాన్సర్ కాని రక్త రుగ్మతలకు కూడా ఒకే దగ్గర చికిత్స అందించగల ప్రపంచస్థాయి వైద్య సదుపాయాలతో అత్యాధునిక బోన్ మ్యారో & స్టెమ్ సెల్ ట్రాన్స్ ప్లాంట్ సెంటర్ ను పద్మశ్రీ, ప్రొఫెసర్ డాక్టర్. మమెన్ చాందీ, కలకత్తా టాటా మెడికల్ సెంటర్ డైరెక్టర్ మరియు ప్రొఫెసర్ డాక్టర్. నవీన్ ఖత్రీ, నవీ ముంబై అట్రెక్ట్ హాస్పిటల్ డిప్యూటీ డైరెక్టర్ ఈ రోజు ముఖ్య అతిధులుగా పాల్గొని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ముఖ్యఅతిధి పద్మశ్రీ, ప్రొఫెసర్ డాక్టర్. మమెన్ చాందీ, మాట్లాడుతూ, “మానవాళిని పట్టి పీడిస్తున్న అనారోగ్య సమస్యలలో రక్త సంబందిత క్యాన్సర్లు ప్రదనమైనవి. నానాటికి పెరిగిపోతున్న రక్త సంబందిత క్యాన్సర్లు, రక్త రుగ్మతలు భారతదేశంలో సంవత్సరానికి 80,000 కొత్త రక్త క్యాన్సర్లు నిర్ధారణ అవుతున్నాయని గణాంకాలు చెప్తున్నాయి. క్యాన్సర్ చికిత్సలో భవిష్యత్ తరాల అవసరాలకు అనుగుణంగా రూపొందించిన ఈ ప్రపంచస్థాయి బోన్ మ్యారో & స్టెమ్ సెల్ ట్రాన్స్ ప్లాంట్ సెంటర్ తెలుగు రాష్టాల ప్రజలకు ఎంతో గర్వకారణం” అని యశోద హాస్పిటల్స్ యాజమాన్యాన్ని ఆయన అభినందించారు.
యశోద హాస్పిటల్స్ డైరెక్టర్, డాక్టర్. పవన్ గోరుకంటి మాట్లాడుతూ, “బ్లడ్ క్యాన్సర్‌పై పూర్తి అవగాహన అవసరం, బ్లడ్ క్యాన్సర్‌లు పూర్తిగా నయం కావడమే కాకుండా బ్లడ్ క్యాన్సర్ రోగులు కూడా విజయవంతమైన చికిత్స తర్వాత పూర్తిగా సాధారణ జీవితాన్ని గడపవచ్చు అనే వాస్తవాన్ని నొక్కిచెప్పేందుకు యశోద హాస్పిటల్స్-హైటెక్ సిటీ లోని ప్రపంచస్థాయి వైద్య సదుపాయాలతో కూడిన అత్యాధునిక బోన్ మ్యారో & స్టెమ్ సెల్ ట్రాన్స్ ప్లాంట్ సెంటర్ ఒక నిజమైన ఉదాహరణ” అని తెలిపారు.
యశోద హాస్పిటల్స్-హైటెక్ సిటీ, హేమాటో-ఆంకాలజిస్ట్ మరియు BMT స్పెషలిస్ట్, డాక్టర్. గణేష్ జైషెట్వార్, మాట్లాడుతూ, “రక్త క్యాన్సర్ ఏ వయస్సు వారిలోనూ, స్త్రీ పురుషుల మధ్య కూడా ఒకేవిధంగా ప్రభావితం చేస్తుంది. రక్త క్యాన్సర్లు అన్ని క్యాన్సర్లలో 8.2% గా ఉన్నాయి. భారతదేశంలో రక్త క్యాన్సర్ల సంభవం సంవత్సరానికి 1 లక్ష జనాభాకు 5.5 కేసులు నమోదవుతున్నాయి. భారతదేశంలో ప్రతి 7 సెకన్లకు ఒక కొత్త రక్త క్యాన్సర్ నిర్ధారణ అవుతుంది మరియు ప్రతి 20 సెకన్లకు బ్లడ్ క్యాన్సర్‌తో ఎవరో ఒకరు మరణిస్తున్నారు” అని అన్నారు.
బ్లడ్ క్యాన్సర్ పరిశోధన మరియు చికిత్సలో తాజా పురోగతిని డాక్టర్. గణేష్ జైషెట్వార్ వివరిస్తూ “ఇప్పుడు వచ్చే మెజారిటీ బ్లడ్ క్యాన్సర్‌లు ఆధునిక కీమోథెరపీ, ఇమ్యునోథెరపీ, బోన్ మ్యారో & స్టెమ్ సెల్ ట్రాన్స్ ప్లాంట్ వంటి అత్యంత అధునాతన చికిత్సా ఎంపికలతో నయం చేయవచ్చు. వాస్తవానికి ఈ చికిత్సలు గత కొన్ని దశాబ్దాలుగా అందుబాటులో ఉన్నాయి, కానీ ఇప్పుడు మరింత ప్రభావవంతంగా మారాయి. దీనికి CAR-T కణాలు వంటి తాజా ఇమ్యునోథెరపీలు తోడవడమే ఇందుకు కారణం. ఈ అత్యాధునిక టార్గెటెడ్ థెరపీలు, ఇమ్యునోథెరపీలు ఆరోగ్యకరమైన కణాలను ప్రభావితం చేయకుండా కేవలం రక్త క్యాన్సర్ కణాలను ఎంపిక చేసి చంపుతాయి, తద్వారా రక్త క్యాన్సర్‌లపై మరింత విజయం సాధించడంలో సహాయపడుతున్నాయి” అని తెలియజేసారు
News Coverage:
- https://telanganatoday.com/yashoda-hospital-launches-bone-marrow-and-stem-cell-transplant-centre-in-hitec-city
- https://www.ntnews.com/telangana/yashoda-hospital-launches-bone-marrow-and-stem-cell-transplant-centre-in-hitec-city-1379627
- https://epaper.andhrajyothy.com/article/Hyderabad?OrgId=1012f273a480&imageview=0&standalone=1&device=mobile
- https://www.andhrajyothy.com/2023/telangana/stem-cell-transplant-center-at-yashoda-1179092.html
- https://www.eenadu.net/telugu-news/ts-top-news/general/2601/123228898
- https://epaper.thehindu.com/ccidist-ws/th/th_hyderabad/issues/62775/OPS/G6BC4H5FP.1.png?cropFromPage=true