కరోనా కొత్త వేరియంట్ (JN.1): లక్షణాలు, తీవ్రత & నివారణ చర్యలు
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మళ్లీ వ్యాపిస్తుంది. 2019 నుంచి ఆల్ఫా, డెల్టా అంటూ పలు రకాల వేరియంట్లుగా కరోనా వైరస్ వ్యాప్తిస్తునే ఉంది. 2021లో కరోనా వైరస్ తగ్గుముఖం పడుతుందనే లోపే మరో వేరియంట్ ఓమిక్రాన్ రూపంలో సెకండ్ కరోనా వేవ్‌తో ప్రజలను భయానికి గురిచేసింది. కాల క్రమేణ ప్రజలు కరోనాకు తగు జాగ్రత్తలు తీసుకోవడం మానేశారు. ఇప్పుడు మరో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఉపరకం JN.1 భారతదేశంతో సహా ప్రపంచ దేశాలను హడలెత్తిస్తోంది. ఈ JN.1 అనేది పిరోల అనబడే BA.2.86 యొక్క సబ్-వేరియంట్. ఈ కొత్త కరోనా వేరియంట్ స్పైక్ ప్రోటీన్ లో మ్యుటేషన్ కలిగి ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని తగ్గించడమే కాకుండా కరోనా ఒకరి నుంచి మరొకరికి సోకడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
కరోనా న్యూ వేరియంట్ (JN.1) లక్షణాలు
- ముక్కు కారడం
- తీవ్రమైన జలుబు
- విపరీతమైన పొడి దగ్గు
- గొంతు మంట మరియు నొప్పి
- అధిక జ్వరం
- శ్వాస ఆడకపోవడం
- వాసన, రుచిని కోల్పోవడం
- వాంతులు మరియు విరేచనాలు కావడం
- విపరీతమైన అలసట
- వృద్ధులు, పిల్లలు మరియు రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో కార్డియోవాస్కులర్ లక్షణాలు కూడా కనిపిస్తాయి
- కొన్ని సార్లున్యుమోనియా, తీవ్రమైన అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (SARS), మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (MERS) వంటి తీవ్రమైన వ్యాధులకు గురై మరణం సైతం సంభవించే అవకాశాలు ఉంటాయి
పై లక్షణాలు ఉన్న వారు వెంటనే వైద్యులను ను సంప్రదించి తగు రకాలైన పరీక్షలు చేయించుకుని సరైన చికిత్స తీసుకోవడం అవసరం. అయితే కరోనా లక్షణాలు పూర్తిగా తగ్గడానికి 2-3 వారాలు సమయం పట్టే అవకాశం ఉంటుంది.
కరోనా న్యూ వేరియంట్ (JN.1) నివారణ చర్యలు
- ప్రతి ఒక్కరు కచ్చితంగా మాస్కులు ధరించడం
- మనిషికి మనిషికి కనీసం 2 అడగులు భౌతిక దూరం పాటించడం
- సబ్బు మరియు గోరువెచ్చని నీటితో చేతులు శుభ్రపరుచుకోవడం
- ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్‌ని ఉపయోగించడం
- కళ్ళు, నోరు మరియు ముక్కు నుంచి మీ చేతులను దూరంగా ఉంచడం
- సిగరెట్లు, మద్యపానంకు దూరంగా ఉండడం
- దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు చేతి రుమాలును ముక్కు మరియు నోటికి అడ్డంగా పెట్టుకోవడం
- చల్లటి పదార్థాలు తినడం మానుకోవాలి
- తగినంత విశ్రాంతి తీసుకోవడం
- పూర్తిగా ఉడికించిన ఆహారాన్నే తినడం
- జలుబు, విపరీతమైన దగ్గు లక్షణాలు ఉన్న వ్యక్తులకు దూరంగా ఉండడం
- బయట నుంచి ఇంటికి వచ్చిన తరువాత చేతులను శుభ్రంగా కడుక్కోవడం, వీలైతే స్నానం చేయడం ఉత్తమం
- శీతల వాతావరణం, కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో గర్భిణులు, బాలింతలు, పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారు మరియు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారు జనసముహంలోకి మరియు వేడుకలకు దూరంగా ఉండాలి
- కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే హోం ఐసోలేషన్‌లో ఉంచడం వంటివి చేయాలి
60 ఏళ్ల పైబడిన వృద్ధులు, డయాబెటిస్, రక్తపోటు, దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి, గుండె జబ్బులు, కాలేయ వ్యాధి ఉన్నవారు ఈ వేరియంట్ పట్ల మరింత అప్రమత్తంగా ఉండడం అవసరం. అంటువ్యాధులు ఉన్నవాళ్లు మరింత జాగ్రత్తలు పాటించాలి. అలాగే వ్యాక్సిన్‌తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ రద్దీగా ఉండే ప్రదేశాల్లో మాస్క్‌లు ధరించాలి. కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఈ ఓమిక్రాన్ ఉపరకం JN.1 లక్షణాలు కనిపిస్తే మాత్రం హోం ఐసోలేషన్‌లో ఉండడం మంచిది.
పెద్దవారితో పాటు నెలల చిన్నారులు కూడా వైరస్ బారిన పడుతున్నారు. ఆర్టీపీసీఆర్ (RT PCR) పరీక్షల ద్వారా దీనిని గుర్తించవచ్చు. నిర్ధారణ పరీక్షల్లో JN.1 బారిన పడినట్లు తెలిస్తే మాత్రం మొదట 4-5 రోజులు తప్పకుండా వైద్యులు సూచించిన మందులు వాడుతూ విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. వ్యాధినిరోధకతను పెంచుకునేలా మంచి ఆహారం తీసుకుని వ్యక్తిగత జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. ఇప్పటి వరకు వ్యాక్సిన్ వేసుకోకపోయినా లేదా ఒక్కటే వ్యాక్సిన్ తీసుకున్న వారు వీలైతే బూస్టర్‌డోస్ లను తీసుకోవాలి. ఈ ఓమిక్రాన్ ఉపరకం JN.1ను వెంటనే గుర్తించి సరైన నివారణ చర్యలు పాటించకపోతే గతంలో లాగే ఈ వైరస్ ఎక్కువ మందికి వ్యాపించి ప్రాణప్రాయం జరిగే అవకాశం కూడా ఉంటుంది. చలికాలంలో వైరస్ వ్యాప్తికి అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నందున వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారు, గతంలో కోవిడ్ బారిన పడినవారు జాగ్రత్తగా ఉండడం మంచిది.
About Author –
Dr. Ranga Santhosh Kumar, Consultant General Physician & Diabetologist , Yashoda Hospital, Hyderabad
MBBS, MD (General Medicine), PGDC (Diabetology)