బ్రెయిన్ స్ట్రోక్ గుర్తింపు & నిర్వహణ ఎలా !
స్ట్రోక్ కు గురైన రోగులను సకాలంలో గురిస్తే వారిని F. A. S.T అనే చర్య ద్వారా తగు చికిత్సలు చేసి వారిని ప్రాణప్రాయం నుంచి కాపాడవచ్చు. స్ట్రోక్ లక్షణాలు వచ్చిన 3 గంటలలోపు దానిని స్ట్రోక్‌గా నిర్ధారణ చేసుకుని వెంటనే చికిత్సను అందించినట్లు అయితే మంచి ఫలితం ఉంటుంది.
మనిషికి స్ట్రోక్ వచ్చిన సమయంలో ప్రతి నిమిషం అత్యంత కీలకం. స్ట్రోక్‌కు త్వరగా చికిత్స చేయకపోతే మొదటగా మెదడు దెబ్బతింటుంది. స్ట్రోక్ యొక్క సంకేతాలను మరియు లక్షణాలను అర్దం చేసుకోవడం వలన ఇతరులను ప్రాణప్రాయం నుంచి రక్షించడమే కాక మిమ్మల్ని మీరు కూడా కాపాడుకోవచ్చు.
మెదడులోని ఒక భాగానికి రక్త ప్రసరణ నిరోధించబడినప్పుడు లేదా తగ్గిపోయినప్పుడు మెదడు కణజాలం ఆక్సిజన్ మరియు పోషకాలను కోల్పోవడం వల్ల ఇస్కీమిక్ స్ట్రోక్ వస్తుంది. దీనివల్ల నిమిషాల వ్యవధిలోనే మెదడు కణాలు చనిపోవడం ప్రారంభిస్తాయి.
ధమని నుంచి రక్తం అకస్మాత్తుగా మెదడులోకి రక్తస్రావం జరిగినప్పుడు హెమరేజిక్ స్ట్రోక్ సంభవిస్తుంది. దీని ఫలితంగా దెబ్బతిన్న మెదడు ప్రాంతంచే నియంత్రించబడే శరీర భాగంలోని కొన్ని అవయవాలు సరిగ్గా పనిచేయవు.
హెమరేజిక్ స్ట్రోక్‌లు రెండు రకాలు:
- మెదడులో రక్తస్రావం జరిగితే దానిని ఇంట్రాక్రానియల్ హెమరేజ్ అంటారు.
- మెదడు మరియు దాని చుట్టూ ఉన్న పొరల మధ్య రక్తస్రావం జరిగితే దానిని సబ్‌అరాక్నోయిడ్ హెమరేజ్ అంటారు.
పురుషులు మరియు స్త్రీలలో స్ట్రోక్ లక్షణాలు గుర్తించడం ఎలా !
- ఒక్క సారిగా ఎక్కువ తలనొప్పి రావటం జరుగుతుంది.
- శరీరం కొన్ని బాగాలు అనగా ముఖం, చేయి లేదా కాలులోని ఒక వైపు తిమ్మిరి లేదా బలహీనంగా అనిపిస్తుంది.
- అకస్మాత్తుగా స్ట్రోక్ సంభవించిన వ్యక్తులు మాటలను అర్దం చేసుకోలేరు, అలాగే మాట్లాడేటప్పుడు గందరగోళానికి గురవుతారు.
- ఒక కన్ను లేదా రెండు కళ్ళలో ఆకస్మికంగా చూపు మందగిస్తుంది.
- మైకము వచ్చి మనిషి సమతుల్యత సమన్వయం కోల్పోవడం, నడవడానికి కూడా ఇబ్బంది పడడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
స్ట్రోక్ వచ్చిన రోగులకు F. A. S. T అనే చర్యను ఉపయోగించి వారికి చికిత్సను అందించవచ్చు.
స్ట్రోక్ లక్షణాలు వచ్చిన 3 గంటలలోపు దానిని స్ట్రోక్‌గా నిర్ధారణ చేసుకుని వెంటనే చికిత్సను అందించినట్లు అయితే మంచి ఫలితం ఉంటుంది. స్ట్రోక్ లక్షణాలు కనిపించినప్పటికీ వారికీ సకాలంలో హాస్పిటల్‌కు తీసుకువెళ్లకపోతే వారికి ఎంత అత్యవసర చికిత్స చేసిన ప్రాణప్రాయం నుంచి బయటపడతారని హామీ ఇవ్వలేము.
స్ట్రోక్ వచ్చినట్లు తెలిపే ప్రధాన లక్షణాలు
- F (Facial weakness)- ముఖంలో అనారోగ్య లక్షణాలు కనిపించడం
- A (Arm swing) – చేయి దానంతట అదే ఉగడం
- S (Speech disturbances) – మాట తడబడడం
- T (Time to call an ambulance) – త్వరగా అంబులెన్స్‌కు కాల్ చేసి హాస్పిటల్‌కు తరలించడం
పైన ఉన్న లక్షణాలే కాక, నడవలేకపోవడం కూడా స్ట్రోక్ యొక్క లక్షణంగా చెబుతున్నప్పటికీ, నడవకపోవడం అనేది స్ట్రోక్ కాకుండా వివిధ కారణాల వల్ల కూడా వస్తుందని గమనించాలి.
పైన ఉన్న లక్షణాలు మనిషిలో గుర్తించినప్పుడు వీలైనంత త్వరగా, అనగా గంటలోపు (గోల్డెన్ అవర్) లేదా 4.5-6 గంటల లోపు స్ట్రోక్ కు చికిత్సను అందించే కేంద్రానికి రోగిని తీసుకెళ్లాలి. అలా చేస్తే వారికి ఆల్టెప్లేస్ లేదా టెనెక్టెప్లేస్‌తో థ్రోంబోలిసిస్ అనే స్ట్రోక్ చికిత్స చేసి ప్రాణప్రాయం నుంచి కాపాడవచ్చు. అలాగే మరికొంత మంది స్ట్రోక్ వచ్చిన వారిలో మెకానికల్ థ్రోంబెక్టమీ చికిత్సను అందించి వారిని ప్రాణాప్రాయం నుంచి రక్షించవచ్చు.
స్ట్రోక్ లక్షణాలు ప్రారంభమైన తర్వాత రోగికి ప్రతి నిమిషం అత్యంత కీలకం. ఎందుకంటే స్ట్రోక్ కు గురైన సాధారణ రోగి 1.9 మిలియన్ న్యూరాన్‌లను కోల్పోతాడు. ఈ పరిస్దితుల్లో రోగికి త్వరగా స్ట్రోక్ చికిత్సను ఇవ్వగలగితే సమయానికి మెదడు కూడా స్పందించి కోలుకోలేని గాయం నుంచి రక్షించడమే కాక, రోగి కోలుకోవడంలో మెదడు కణజాలం సహాయపడి రాబోయే వైకల్యాన్ని కూడా తగ్గిస్తుంది.
థ్రోంబోలిసిస్ మరియు థ్రోంబెక్టమీ వంటి చికిత్సలు స్ట్రోక్ వచ్చిన వారికి చేస్తారు. అయితే ఈ చికిత్సలను చేసిన అనంతరం రోగి తగినంత పోషకాహారం, సమర్థవంతమైన రక్తపోటు నిర్వహణ మరియు రక్తంలో చక్కెర స్దాయిలపై నియంత్రణలను కలిగి ఉండాలి. వీటన్నంటితో పాటుగా ఫిజియోథెరపీ ద్వారా చేసే చికిత్స స్ట్రోక్ ను నయం చేయడంలో ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఈ విధంగా, స్ట్రోక్ రోగులలో ఏర్పడే వైకల్యాన్ని తగ్గించవచ్చు మరియు వారు కోలుకున్న తర్వాత మెరుగైన జీవన నాణ్యతను కలిగి ఉంటారు. స్ట్రోక్ లక్షణాలను ముందస్తుగా గుర్తించడం, స్ట్రోక్ రోగులకు లక్షణాలు కనిపించిన వెంటనే స్ట్రోక్ కు చికిత్స చేసేందుకు సిద్ధంగా ఉన్న కేంద్రానికి సకాలంలో తరలించి థ్రోంబెక్టమీ, థ్రోంబోలిసిస్ చికిత్సలు అందిస్తే వారిని ప్రాణప్రాయం నుంచి కాపాడవచ్చు. స్ట్రోక్ లక్షణాలు కనిపించిన అనేక మందిలో ఈ తరహా చికిత్సలు చేసినచో తమ వారిని బ్రతికించుకుని అనేక కుటుంబాలు తీవ్ర వ్యధకు గురికాకుండా చూడవచ్చు.
About Author –