గర్భసంచి క్యాన్సర్: లక్షణాలు, కారణాలు మరియు చికిత్సల గురించి పూర్తి వివరణ

గర్భసంచి క్యాన్సర్, దీనిని ఎండోమెట్రియల్ క్యాన్సర్ అని కూడా పిలుస్తారు, ఇది గర్భసంచిలోని శ్లేష్మ పొరలో ప్రారంభమయ్యే క్యాన్సర్. ఈ గర్భసంచి క్యాన్సర్ అన్నది అత్యంత సాధారణంగా వచ్చే స్త్రీ జననేంద్రియ క్యాన్సర్లలో ఒకటి, ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది మహిళలు దీనితో బాధపడుతున్నారు. గర్భసంచి క్యాన్సర్ తీవ్రంగా ఉన్నప్పటికీ, సత్వర గుర్తింపు మరియు నిర్వహణతో సానుకూల ఫలితాలను పొందవచ్చు.

గర్భసంచి క్యాన్సర్ గురించి క్లుప్త వివరణ

గర్భసంచి క్యాన్సర్ అనేది ముఖ్యంగా రెండు రూపాలుగా అభివృద్ధి చెందవచ్చు: ఒకటి ఎండోమెట్రియంలో (గర్భకోశపు పొరలో) వచ్చే ఎండోమెట్రియల్ క్యాన్సర్ గాను లేదా గర్భసంచిలోని మయోమెట్రియంలో (గర్భకోశ కండరములో) ఏర్పడే గర్భసంచి సార్కోమా (ప్రాణాంతక కణితి) గాను అభివృద్ధి చెందుతుంది. స్త్రీ జననేంద్రియ క్యాన్సర్ లకు సంబంధించిన వాటిలో  ఈ రెండూ తరుచుగా కనిపిస్తాయి.

గర్భసంచి క్యాన్సర్ అనేది గర్భసంచిలోని కణాలలో అనియంత్రిత DNA మ్యుటేషన్ కారణంగా సంభవించే ఒక రకమైన క్యాన్సర్. ఇది సాధారణంగా గర్భసంచి యొక్క అంతర్గత పొరలో లేదా కండరాలలో అభివృద్ధి చెందుతుంది. దీన్ని ముందుగానే గుర్తించి, తగిన చికిత్స అందించినట్లయితే, గర్భసంచి క్యాన్సర్‌ను నయం చేయవచ్చు. చాలా సందర్భాలలో, గర్భసంచి క్యాన్సర్‌తో బాధపడుతున్న పేషెంటులకు గర్భసంచి తొలగింపు శస్త్రచికిత్స అనేది సూచించబడుతుంది.

గర్భసంచి క్యాన్సర్‌ అనేది ప్రపంచవ్యాప్తంగా మహిళలను ప్రభావితం చేసే వివిధ క్యాన్సర్‌లలో ఆరవ స్థానంలో ఉంది. భారతదేశంలో, గర్భసంచి క్యాన్సర్ అనేది మొత్తం నివేదించబడిన కేసులలో 2.5 శాతంగా ఉంది, అయితే దీని యొక్క సంభవం రేటు వేగంగా పెరుగుతోంది.

మీ ఆరోగ్య సమస్య గురించి ఆందోళన లో ఉన్నారా?

గర్భసంచి క్యాన్సర్ యొక్క లక్షణాలు

గర్భసంచి క్యాన్సర్ యొక్క సంకేతాలు మరియు లక్షణాలు ఈ క్రింది విధంగా ఉంటాయి:

  • రుతువిరతి ముందు యోని నుండి రక్తస్రావం అవడం
  • దిగువ పొత్తికడుపు నొప్పి లేదా పెల్విస్ (కటి) వద్ద తిమ్మిరి రావడం
  • రుతువిరతి తరువాత యోని నుండి రక్తస్రావం అవడం
  • ఋతుక్రమం ఆగిపోయిన తర్వాత సన్నని తెలుపు లేదా స్పష్టమైన యోని ఉత్సర్గ కలగడం
  • వయోజన మహిళల్లో సుదీర్ఘంగాను మరియు తరుచూ యోని నుండి పెద్ద మొత్తంలో రక్తస్రావం అవడం
  • మూత్ర విసర్జన చేయడంలో ఇబ్బంది  పడడం
  • అనుకోకుండా బరువు తగ్గడం మొదలైనవి

Uterine cancer telugu

గర్భసంచి క్యాన్సర్ యొక్క కారణాలు

గర్భసంచి క్యాన్సర్‌కు ఖచ్చితమైన కారణం పరిశోధకులకు తెలియదు. గర్భసంచిలోని కణాలలో మార్పుల వల్ల ఇది సంభవిస్తుంది. పరివర్తన చెందిన కణాలు అనియంత్రితంగా విస్తరించడంతో కణితి లేదా గడ్డ ఏర్పడుతుంది, ఆ తదుపరి దీనినే క్యాన్సర్ అని పిలుస్తారు. మహిళల్లో గర్భసంచి క్యాన్సర్‌ను అభివృద్ధి చేసే కొన్ని సాధారణ ప్రమాద కారకాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:

  • వయసు రీత్యా వచ్చే అసాధారణతలు
  • రొమ్ము లేదా గర్భసంచి క్యాన్సర్లను కలిగిన కుటుంబ చరిత్ర
  • 50 ఏండ్లు పైబడిన తరువాత రుతువిరతి రావడం
  • సుదీర్ఘ సమయం ఋతుస్రావం కలగడం
  • అధిక కొవ్వు ఆహారాలను తీసుకోవడం
  • ఊబకాయం
  • లించ్ సిండ్రోమ్ లేదా వంశపారంపర్య నాన్‌పోలిపోసిస్ కొలొరెక్టల్ క్యాన్సర్ (HNPCC) కలిగిన చరిత్ర
  • సంతానలేమి
  • 12 ఏళ్లలోపే ఋతుస్రావం మొదలవడం
  • కటి భాగానికి రేడియేషన్ థెరపీ ఇవ్వడంతో  DNA దెబ్బతింటుంది, తద్వారా క్యాన్సర్‌ అభివృద్ధి చెందే ప్రమాదం పెరుగుతుంది 
  • ప్రొజెస్టెరాన్ లేకుండా ఈస్ట్రోజెన్ రీప్లేస్‌మెంట్ థెరపీని (ERT) తీసుకోవడం
  • మధుమేహం మరియు కొన్ని అండాశయ వ్యాధులు
మీ ఆరోగ్య సమస్య గురించి ఆందోళన లో ఉన్నారా?

గర్భసంచి క్యాన్సర్ యొక్క సమస్యలు

చికిత్స చేయకుండా వదిలివేసినా లేదా ముందుగా రోగనిర్ధారణ చేయకపోయినా, గర్భసంచి క్యాన్సర్ కొన్ని సమస్యలను అభివృద్ధి చేయవచ్చు, అవి:

  • మెటాస్టాసిస్ (కణితి వ్యాప్తి)
  • ఇన్ఫెక్షన్
  • బాధాకరమైన సెక్స్ అనుభూతి
  • అధిక రక్తస్రావం
  • తీవ్రమైన కటి నొప్పి
  • మరణం (చికిత్స చేయకుండా వదిలేసినా లేదా తీవ్రతరమైన సందర్భాలలో పేషెంట్ మరణించవచ్చు)

Uterine cancer telugu

గర్భసంచి క్యాన్సర్ యొక్క దశలు

గర్భసంచి క్యాన్సర్లు I నుండి IV వరకు దశలను కలిగి ఉంటాయి:

  • 1వ దశ గర్భాశయ క్యాన్సర్: ఈ దశలో క్యాన్సర్ అనేది  గర్భసంచిలో స్థానీకరించబడిద్ధి.
  • 2వ దశ గర్భాశయ క్యాన్సర్  ఈ దశలో క్యాన్సర్ గర్భసంచికి మెటాస్టాసైజ్ (కణితి వ్యాప్తి) అవుతుంది.
  • 3వ దశ గర్భాశయ క్యాన్సర్: ఈ దశలో క్యాన్సర్ అనేది యోని, అండాశయాలు మరియు/లేదా శోషరస కణుపులకు వ్యాప్తి చెందుతుంది.
  • 4వ దశ గర్భాశయ క్యాన్సర్: ఈ దశలో క్యాన్సర్ అనేది మూత్రాశయం లేదా గర్భసంచికి దూరంగా ఉన్న ఇతర అవయవాలకు వ్యాప్తి చెందుతుంది.

గమనిక: కొన్ని సందర్భాల్లో, స్త్రీ జననేంద్రియ నిపుణులు శస్త్రచికిత్స చేసే వరకు కూడా క్యాన్సర్ యొక్క నిర్దిష్ట దశను తెలుసుకునే అవకాశం లేకపోవచ్చు.

మీ ఆరోగ్య సమస్య గురించి ఆందోళన లో ఉన్నారా?

గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణ

గర్భసంచి క్యాన్సర్‌ను నిర్ధారించడానికి కొన్ని రోగనిర్ధారణ పరీక్షలు ఉన్నాయి, అవి:

  • శారీరక మరియు కటి పరీక్షలు: ఉదరం మరియు పొత్తికడుపులో వాపులను గుర్తించడానికి శారీరక పరీక్ష జరుగుతుంది.
  • CA-125 పరీక్ష: ఇవి సాధారణ ఆరోగ్యాన్ని అంచనా వేయడానికి మరియు చికిత్స నిర్ణయాలను తెలియజేయడానికి సూచించబడతాయి.
  • అల్ట్రాసౌండ్‌లు, CT స్కాన్‌లు మరియు MRI స్కాన్‌లు: ఈ ఇమేజింగ్ పరీక్షలు గర్భసంచి మరియు పెల్విక్ (కటి) ప్రాంతానికి సంబంధించి ఖచ్చితమైన ఫలితాలను అందిస్తాయి.
  • గర్భసంచి చిత్రాల కోసం ట్రాన్స్‌వెజైనల్ అల్ట్రాసౌండ్: వివరణాత్మక సమాచారం కోసం ట్రాన్స్‌డ్యూసర్ యోనిలోకి పంపబడుతుంది.
  • ఎండోమెట్రియల్ బయాప్సీ: ఇది గర్భసంచి కణజాలాన్ని పరీక్షించడానికి చేయబడుతుంది.
  • హిస్టెరోస్కోపీ: ఇది వివరణాత్మక గర్భసంచి చిత్రాలను అందిస్తుంది.
  • డైలేషన్ మరియు క్యురేట్టేజ్: ఇది  గర్భసంచి కణజాలాన్ని పొందేందుకు చేయబడుతుంది.

Uterine cancer telugu

గమనిక: వైద్యులు ఎండోమెట్రియల్ క్యాన్సర్‌ని నిర్ధారించినప్పుడు దాని యొక్క రకాన్ని నిర్ధారించడం కూడా అవసరం. దీన్ని అర్థం చేసుకోవడం ద్వారా ఉత్తమంగా ఎలా చికిత్స చేయాలనే దానిపై ఒక అవగాహన వస్తుంది:

  • టైప్ 1 ఎండోమెట్రియల్ క్యాన్సర్లు తక్కువ తీవ్రతను కలిగి ఉంటాయి మరియు వేగంగా ఇతర భాగాలకు వ్యాప్తి చెందవు
  • టైప్ 2 ఎండోమెట్రియల్ క్యాన్సర్లు మరింత తీవ్రతను కలిగి ఉంటాయి, ఇవి గర్భసంచి దాటి వ్యాపిస్తాయి, దీనికి సత్వర చికిత్స అవసరం.

గర్భసంచి క్యాన్సర్ చికిత్స

సాధారణంగా, కణితిని శస్త్రచికిత్స ద్వారా తొలగించడం అనేది ఎండోమెట్రియల్ క్యాన్సర్‌కు ముఖ్యంగా చేసే చికిత్స. ఇది కాక గర్భసంచి, ఫెలోపియన్ ట్యూబ్‌లు మరియు అండాశయ తొలగింపు లాంటి ఎంపికలు కూడా చేయవచ్చు. కీమోథెరపీ లేదా రేడియేషన్ థెరపీ క్యాన్సర్ కణాల నిర్వహణకు కొన్నిసార్లు ప్రత్యామ్నాయాలు. గర్భసంచి క్యాన్సర్‌కు చికిత్స ఎంపిక అనేది దాని యొక్క దశ, సాధారణ ఆరోగ్య స్థితి మరియు వ్యక్తిగత ప్రాధాన్యతలపై ఆధారపడి ఉంటుంది. గర్భసంచి క్యాన్సర్ చికిత్సా పద్ధతులలో ఇవి ఉన్నాయి:

  • శస్త్రచికిత్స: గర్భసంచి క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే అత్యంత సాధారణ ప్రక్రియ హిస్టరెక్టమి (గర్భసంచి శస్త్రచికిత్స). ఈ ప్రక్రియలో గర్భసంచి మరియు ఫెలోపియన్ నాళాలు రెండింటినీ తీసివేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇది కాక కొన్ని సార్లు సల్పింగో-ఓఫోరెక్టమీ ప్రక్రియ సూచించడం జరుగుతుంది, ఇది అండాశయాలను తీసివేసే ప్రక్రియ, ఈ ప్రక్రియ గర్భం దాల్చే అవకాశాలను నిలిపివేస్తుంది. కొన్ని పరిస్థితులలో, సర్జన్ అనేవారు క్యాన్సర్ వ్యాప్తి చెందిన ప్రాంతాలలో విస్తరణను అంచనా వేయడానికి మరియు విశ్లేషణ కోసం శోషరస కణుపు బదిలీ చేయడం జరుగుతుంది.

సాధారణంగా, గర్భసంచి ఆపరేషన్ (హిస్టెరెక్టమీ) నాలుగు రకాలుగా ఉంటుంది: పొత్తికడుపు-సంబంధిత, యోని-సంబంధిత, రాడికల్ మరియు కనిష్ట కోతతో కూడిన ప్రక్రియలు. సర్జన్ అనేవారు ఉదరం లేదా  యోని భాగాలలో కోతలు చేసి ప్రక్రియ చేయడం జరుగుతుంది.

ఈ హిస్టెరెక్టమీ అనేది సాధారణంగా రెండు అదనపు విధానాలను కలిగి ఉంటుంది: ద్వైపాక్షిక సల్పింగో-ఓఫోరెక్టమీ (BSO), ఇది అండాశయాలు మరియు ఫెలోపియన్ ట్యూబ్‌లను తొలగిస్తుంది మరియు రెండవది శోషరస కణుపు విభజన, ఇది శోషరస కణుపులను తొలగిస్తుంది.

గర్భసంచి క్యాన్సర్‌కు కొన్ని సందర్భాల్లో ఈ కింది శస్త్రచికిత్స కానటువంటి విధానాల ద్వారా కూడా చికిత్స చేయవచ్చు:

  • కీమోథెరపీ: సమర్థవంతమైన మందులను ఉపయోగించడం ద్వారా క్యాన్సర్ కణాలను చంపడం సాధ్యమవుతుంది. 
  • రేడియేషన్ థెరపీ: అన్ని గర్భసంచి క్యాన్సర్ కణాలను నాశనం చేయడానికి బలమైన రేడియేషన్ కిరణాలు ఇక్కడ ఉపయోగించబడతాయి. 
  • హార్మోన్ థెరపీ: ఇది క్యాన్సర్ కణాలతో హార్మోన్లకు ఉన్న సంబంధాన్ని తీవ్రతరం చేసి, తద్వారా వ్యాధి అభివృద్ధి యొక్క కొనసాగింపును నిరోధించడం చేస్తుంది. 
  • టార్గెటెడ్ థెరపీ: ఇది సమర్థవంతమైన మందులతో DNA ఉత్పరివర్తనాలను నిరోధించడానికి  సహాయపడుతుంది.
  • ఇమ్యునోథెరపీ: ఇది శరీరం యొక్క రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరిచి క్యాన్సర్ ను అడ్డుకుంటుంది.

సాధారణంగా గర్భసంచి క్యాన్సర్ అనేది తీవ్రమైనది, అయితే విషయం ఏమిటంటే, ముందుగానే రోగనిర్ధారణ చేస్తే దానిని నయం చేయవచ్చు. సాధారణ చెక్-అప్‌లతో, ముఖ్యంగా అధిక-ప్రమాద కారకాలు ఉన్న లేదా బహిర్గతానికి అవకాశం ఉన్న మహిళలకు ప్రారంభ దశలో రోగనిర్ధారణ మరియు చికిత్స చేయడంతో విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏదైనా అసాధారణ రక్తస్రావం, కటి భాగంలో నొప్పి లేదా ఋతు మార్పులు ఉంటె వెంటనే స్త్రీ జననేంద్రియ నిపుణులను సంప్రదించాలి. ఎంత త్వరగా దాని గురించి తెలుసుకుని, కనుగొని వాటిపై చర్య తీసుకుంటే, గర్భసంచి క్యాన్సర్ నుండి బయటపడే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి.

యశోద క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ భారతదేశంలోని అత్యుత్తమ కేంద్రాలలో ఒకటిగా పేరుగాంచడమే కాక, సమగ్రంగా గర్భసంచి క్యాన్సర్ ను నిర్దారించడం, చికిత్స చేయడం మరియు మెరుగైన నివారణను అందించడంలో ప్రాముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈ సంస్థ నైపుణ్యం కలిగిన గైనకాలజిస్ట్‌లు, ఆంకాలజిస్టులు, హెమటో-ఆంకాలజిస్టులు, రేడియాలజిస్ట్‌లు, జన్యు సలహాదారులు మరియు పోషకాహార నిపుణులను కలిగి ఉంది. హైటెక్ సిటీ, సోమాజిగూడ, సికింద్రాబాద్ మరియు మలక్‌పేటలోని నాలుగు స్వతంత్ర ఆసుపత్రులలో నైపుణ్యం కలిగిన వైద్య నిపుణులచే క్యాన్సర్ కు సమగ్రవంతంగా వైద్య  చికిత్సలను అందిస్తుంది.

మీ ఆరోగ్య సంరక్షణ గురించి ఏవైనా సందేహాలు ఉన్నాయా? సహాయం చేయడానికి మేము సిద్దంగా ఉన్నాము! మా అనుభవంతులైన నిపుణుల సలహా కొరకు +919513262681 కి కాల్ చేయగలరు.

 

 

About Author –

About Author

Dr. Sachin Marda | yashoda hospitals

Dr. Sachin Marda

MS (General Surgery), DNB (MNAMS), Fellowship in GI and Laparoscopic Surgery, MRCS (Edinburgh, UK), MCh (Surgical Oncology), DNB (MNAMS), Fellowship in Robotic Surgery

Senior Consultant Oncologist & Robotic Surgeon (Cancer Specialist)