మహిళలు తమ కుటుంబాన్ని చూసుకుంటూ తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు మరియు ప్రతి సంవత్సరం అనేకమంది క్యాన్సర్ తో జీవిత యుద్ధంలో ఓడిపోతున్నారు. అతిపెద్ద సవాలు ఏమిటంటే, చాలా మంది ఆలస్యంగా గుర్తిస్తారు మరియు వారు చికిత్స చేయలేని లేదా చికిత్స చేయడం కష్టంగా మారే దశకు చేరుకుంటారు. భారతదేశంలో, రొమ్ము క్యాన్సర్ అనేది అత్యంత సాధారణ క్యాన్సర్ మరియు మహిళల్లో వచ్చేవాటిలో 1/4వ వంతుఈ వ్యాధి బారిన పడుతున్నారు . పశ్చిమ దేశాలతో పోలిస్తే భారతదేశంలో మహిళలకు చిన్న వయస్సులోనే ఈ వ్యాధి బారిన పడుతున్నారని డాటా చూపిస్తుంది. రొమ్ము క్యాన్సర్ తో బాధపడుతున్న మహిళల్లో 90% మందికి క్యాన్సర్ కుటుంబ చరిత్ర లేదని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. అవగాహన లేకపోవడం, భయం, సామాజిక అపోహలు, ఆర్థిక పరిస్థితులు ,రొమ్ము క్యాన్సర్ యొక్క ప్రాబల్యాన్ని ప్రభావితం చేసే వివిధ కారణాలు గా చెప్పవచ్చు.
“నాకే ఏ౦దుకు? తరువాత ఏమిటి?” బయాప్సీ తరువాత మార్చి2018 లో అంజలిని ఇబ్బంది పెట్టిన ప్రశ్నలు ఆమె ఎడమ రొమ్ములో ప్రాణాంతక కణితిని వెల్లడించాయి. “ఈ వార్త కణితి లాగా కష్ట౦గా ఉ౦డేది” అని ఆమె గుర్తుచేసుకు౦ది. ఆమె ప్రతి సంవత్సరం మామోగ్రామ్ లు చేయించుకున్నారు. అందువలన కణితిని ముందుగానే గుర్తించడం అదృష్టం. రొమ్మును తొలగించకుండానే కణితిని తొలగించారు. శస్త్రచికిత్స తర్వాత, ఆమె స్పృహలోకి వచ్చిన తర్వాత, ఆమె రొమ్ము చెక్కుచెదరకుండా ఉండటం చూసి చాలా సంతోషించింది. ఆమె విషయంలో, కణితి వ్యాప్తి చెందలేదు మరియు మాస్టెక్టమీ (రొమ్మును శస్త్రచికిత్స ద్వారా తొలగించడం) నివారించబడింది.
నిజామాబాదుకు చెందిన సునీతకు 4 నెలల క్రితం రొమ్ము క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారించారు. గృహిణి కావడంతో, ఇంట్లో వ్యక్తిగత కట్టుబాట్ల కారణంగా తన చికిత్సను ఆలస్యం చేయాల్సిన అవసరం ఉందని భావించినప్పటి నుండి ఆమె తన ఇద్దరు పాఠశాలకు వెళ్ళే పిల్లల కోసం తన చికిత్సను వాయిదా వేసింది.
హైదరాబాద్ కు చెందిన దుర్గమ్మ తన కుమారుడి వివాహం కోసం తన చికిత్సను 6 నెలలు వాయిదా వేసింది. పై రెండు సందర్భాల్లో క్యాన్సర్
తీవ్ర దశకు పురోగమించింది మరియు ఆంకాలజిస్ట్ కి చికిత్స చేయడం కష్టంగా మారింది .క్యాన్సర్ ఎవరి కొరకు వేచి ఉండదు, అందువల్ల సకాలంలో సంరక్షణ మరియు చికిత్స అత్యవసరం.
అంతర్జాతీయ మార్గదర్శకాలు మహిళలు 45 సంవత్సరాల వయస్సులో డిజిటల్ మామోగ్రామ్ చేయించుకోవాలని మరియు వార్షిక (ప్రతి సంవత్సరం) ఆరోగ్య తనిఖీలలో భాగంగా ఈ రోగనిర్ధారణ పరిక్ష చేయించు కొవాలని సూచిస్తున్నాయి. డిజిటల్ ఇమేజింగ్ స్పష్టంగా, మెరుగైన మాగ్నిఫికేషన్ అందిస్తుంది కనుక, కొన్ని పునరావృత ప్రక్రియలు అవసరం. అయితే, పరికరాలు మాత్రమే సరిపోవు, ఎందుకంటే ఫలితాలను ఖచ్చితంగా అర్థం చేసుకోగల అనుభవజ్ఞులైన రేడియాలజిస్టులు మనకు అవసరం. ఇది రొమ్ము క్యాన్సర్ ను సాధ్యమైనంత త్వరగా గుర్తించడానికి సహాయపడుతుంది.
రొమ్ము యొక్క రూపాన్ని ఏవైనా మార్పులున్నాయా లేదా lump అనిపిస్తుందా అని చూడటం కొరకు మహిళలు తమ రొమ్ములను క్రమం తప్పకుండా స్వీయ పరీక్ష చేయించుకోవాలని సలహా ఇవ్వబడుతోంది. కుటుంబ వైద్యుడు లేదా నర్సు మార్గదర్శనంతో ఈ స్వీయ పరీక్షలను నిర్వహించవచ్చు.
పట్టణ మరియు గ్రామీణ భారతదేశంలో రొమ్ము క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. మరియు రొమ్ము క్యాన్సర్ యొక్క ఘటనలు గర్భాశయ క్యాన్సర్ ను అధిగమించాయని మరియు భారతీయ మహిళల్లో అత్యంత తరచుగా క్యాన్సర్ గా పేర్కొనబడుతోందని ఇటీవలి అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. భారతదేశంలో సగటున 28 మంది మహిళల్లో ఒకరికి వారి జీవితకాలంలో రొమ్ము క్యాన్సర్ అభివృద్ధి చెందుతుంది. డిజిటల్ యుగంలో జీవనశైలిలో వేగవంతమైన మార్పుల కారణంగా, భారతదేశంలో రొమ్ము క్యాన్సర్ ఘటనలు పెరుగుతున్నాయి. రొమ్ము క్యాన్సర్ అభివృద్ధి చెందడానికి అనేక కారణాలు దోహదపడతాయి. ఈ కారకాలలో కొన్ని వారి జీవనశైలి మరియు biological characteristics..
కొన్నిసార్లు ఇది వారి జన్యువుల్లో ఉంటుంది!
ఒకవేళ కుటుంబ సభ్యుడికి గతంలో రొమ్ము క్యాన్సర్ అభివృద్ధి చెందినట్లయితే, లేదా ప్రస్తుతం క్యాన్సర్ అభివృద్ధి చెందుతున్నట్లయితే, వారి కుటుంబ సభ్యులకు (మహిళలు) రొమ్ము క్యాన్సర్ కు ఎక్కువ ప్రమాదం ఉంటుంది.
రొమ్ము క్యాన్సర్ యొక్క లక్షణాలు
ఒకవేళ పైన పేర్కొన్న లక్షణాలు ఏవైనా రొమ్ము స్వీయ పరీక్షలో కనిపించినట్లయితే, అప్పుడు వైద్యుడిని సంప్రదించాలని సలహా ఇవ్వబడుతోంది. ముందస్తుగా గుర్తించడం వల్ల క్యాన్సర్ పూర్తిగా నయం కాగలదని గుర్తుంచుకోండి.
రొమ్ము క్యాన్సర్ నిర్ధారణలో ఉపయోగించే పరీక్షలు మరియు ప్రక్రియల్లో ఇవి ఉంటాయి:
వ్యాధి యొక్క దశ, చికిత్స అమలు యొక్క లాజిస్టిక్స్ మరియు రోగి యొక్క ఎంపిక వంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకున్న తరువాత వైద్యుడు చికిత్స విధానాలను ఎంచుకుంటాడు. కాబట్టి ఒకే దశలో ఉన్న ఇద్దరు రోగులు వేర్వేరు చికిత్సలను పొందే అవకాశం ఉంది.
ఇంతకు ముందు, చాలా సందర్భాల్లో, మాస్టెక్టమీ ని మాత్రమే చికిత్సా విధానంగా ఎంపిక చేసేవారు , కానీ నేడు, దాదాపు 60% మంది రోగులకు, సుమారు ఒక సెంటీమీటర్ చుట్టూ ఉన్న ద్రవ్యరాశి, సాధారణ కణజాలం మరియు చంకలో లింఫ్ నోడ్ లతో ఉన్న కణితిని మాత్రమే సర్జన్లు తొలగిస్తారు. దీనిని “Breast Conservation Surgery ” అని అంటారు మరియు క్యాన్సర్ తిరిగి వచ్చే అవకాశాలను తగ్గించడం కొరకు ఆపరేషన్ తరువాత రోగులకు సాధారణంగా రేడియేషన్ మరియు కీమోథెరపీ ఇవ్వబడుతుంది.
జీవనశైలి మార్పులు రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడవచ్చు. రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్నితగ్గించటం కొరకు సిఫారసు చేయబడ్డ ముందు జాగ్రత్త చర్యలను అనుసరించడానికి ప్రయత్నించండి:
ఆరోగ్యకరమైన జీవనశైలి, వార్షికంగా లేదా 6 నెలలకు ఒకసారి క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు మరియు స్వీయ ఆరోగ్యతనిఖీల వలన అవగాహన వలన మెరుగైన శారీరక మరియు మానసిక ఆరోగ్య ఫలితాలను పొందగలరు. ప్రారంభ దశలో క్యాన్సర్ ను గుర్తించడం, నిపుణులైన వైద్యులను సంప్రదించడం, సరైన చికిత్స తీసుకోవడం, రోగి కౌన్సిలింగ్, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవటం , తగినంత శారీరక వ్యాయామాలు మరియు ధ్యానం క్యాన్సర్ ను అధిగమించడానికి సహాయపడే కొన్ని చర్యలు. క్యాన్సర్ రోగుల్లో డిప్రెషన్ మరియు స్వీయ-ఓటమి వైఖరి చాలా సాధారణం. సంరక్షకులు మరియు రోగులు కూడా క్లిష్టమైన దశను అధిగమించడానికి ప్రోత్సాహాన్ని అందించాలి. కుటుంబం మరియు స్నేహితుల నుంచి నైతిక మరియు సామాజిక మద్దతు కీలకం, ఇది చికిత్స సమయంలో రోగికి ఎంతో సహాయపడుతుంది మరియు మెరుగైన రికవరీకి సహాయపడుతుంది. సపోర్ట్ గ్రూపుల్లో పాల్గొనడం మరియు ఇతర దీర్ఘకాలిక లేదా స్వల్పకాలిక క్యాన్సర్ నుంచి స్ఫూర్తిని పొందడం క్యాన్సర్ ని తట్టుకోవడానికి మరియు చివరికి విజయం సాధించడానికి సహాయపడుతుంది.
References:
About Author –
Dr. Sachin Subash Marda, Consultant Oncologist (Cancer Specialist), Yashoda Hospitals, Hyderabad
Dr. Sachin Subash Marda specializes in breast cancer, head & neck cancer, gastrointestinal cancers, gynecological and urological cancers. He has a vast experience in several robotic surgeries, laparoscopic surgeries, day care oncological procedures and HIPEC.
Heart failure, also called congestive heart failure, is a condition that arises when the muscles…
Percutaneous Transluminal Coronary Angioplasty, or PTCA, is a minimally invasive surgery that opens blocked or…
Ankle ligaments are crucial cords that link foot bones to lower leg bones, ensuring stability…
Supermarkets today are flooded with a variety of cooking oils, each with different characteristics, such…
మాట్లాడటానికి, తినటానికి మరియు ముఖం అందంగా కనిపించటానికి నోరే కీలకం. శరీర పోషణకు అవసరమైన ఆహారం, పానీయాలు లోపలికి చేరేది…
అండాశయ తిత్తులు అనేవి అండాశయాల లోపల లేదా వాటి ఉపరితలంపై ద్రవంతో నిండిన సంచి లాంటి నిర్మాణాలు. ఆడవారికి రెండు…