Select Page

ట్రాపికల్ ఫీవర్ యొక్క రకాలు, కారణాలు మరియు నివారణ చిట్కాలు

ఉష్ణమండల జ్వరాలు ఉష్ణమండల, ఉప ఉష్ణమండలంలో మాత్రమే కనిపించే అంటువ్యాధులు. ఇందులో కొన్ని జ్వరాలు ఏడాది పొడవునా వస్తూనే ఉంటాయి, మరికొన్ని వర్షాకాలం మరియు వర్షానంతర కాలంలో మాత్రమే సంభవిస్తాయి. అందులో డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్, రికెట్సియాల్ ఫీవర్, మలేరియా, టైఫాయిడ్, లేప్టోస్పిరోసిస్ బాక్టీరియల్ సెప్సిస్ మరియు ఇన్ ఫ్లూయెంజా వంటి సాధారణ వైరల్ ఇన్ఫెక్షన్లు. ఉష్ణమండల వ్యాధులకు ముఖ్య కారణమయ్యే జీవులు బాక్టీరియా మరియు వైరస్ లు. కొద్దిపాటి అనారోగ్యానికి కారణమమైన ప్రతి ఒక్కరికి బాక్టీరియా, వైరస్‌ల గురించి తెలిసి ఉంటుంది. ఉష్ణమండల జ్వరం లక్షణాలలో అకస్మాత్తుగా జ్వరం, చలి, తలనొప్పి, మైయాల్జియా, పొత్తికడుపు నొప్పి, కండ్లకలక సఫ్యూజన్ మరియు తాత్కాలిక చర్మపు దద్దుర్లు కనిపిస్తాయి.

అంతే కాకుండా సమశీతోష్ణ, శీతోష్ణస్థితి మండలాల్లో అనేక సాధారణ వైరల్, బాక్టీరియా వ్యాధులు గాలిలో ప్రసార మార్గాల ద్వారా (లేదా) లైంగిక సంపర్కం ద్వారా నేరుగా ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి వ్యాపిస్తాయి. అందులో శ్వాసకోశ వ్యాధులు (మీజిల్స్, రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్, క్షయ వంటివి) ఇవే కాకుండా  లైంగికంగా సంక్రమించే వ్యాధులు కూడా ఉష్ణమండలంలో సంభవిస్తుంటాయి.

ఇప్పటికీ అభివృద్ధి చెందుతున్న దేశాలలో స్వచ్ఛమైన నీరు, పారిశుద్ధ్య పరిస్థితులు అంతంత మాత్రమే కాబట్టి అనేక వ్యాధులు కలుషితమైన నీరు మరియు ఆహార వనరుల ద్వారా వ్యాపిస్తున్నాయి. అంతే కాకుండా ఈ దేశాల్లో ఒకే వ్యక్తికి అనేక వ్యాధులు సంక్రమించడంతో ఈ రోగులలో పెద్ద సంఖ్యలో మెకానికల్ వెంటిలేషన్, మూత్రపిండ పునఃస్థాపన చికిత్స, వాసోప్రెసర్ మద్దతు, రక్తం మరియు రక్త భాగాల చికిత్స మొదలైన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU) సంరక్షణ అవసరమవుతుంది అని చెప్పవచ్చు.

ఉష్ణమండల జ్వరాలు యొక్క రకాలు, అవి మానవ శరీరంపై ఏ విధంగా ప్రభావితం చేస్తాయో తెలుసుకుందాం:

డెంగ్యూ జ్వరం

డెంగ్యూ జ్వరం ఉష్ణమండల, ఉపఉష్ణమండల ప్రాంతాలలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తుంది. ఇది దోమల వల్ల కలిగే వ్యాధి. ఈ వ్యాధి మొదటగా తేలికపాటి జ్వరంతో మొదలై.. అధిక జ్వరం. ఫ్లూ లాంటి లక్షణాలను కల్గిస్తుంది. అయితే డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్ అని పిలిచే ప్రమాదకర డెంగ్యూ జ్వరం మనిషికి సంభవించిందంటే తీవ్రమైన డెంగ్యూ జ్వరం, రక్తస్రావం, రక్తపోటు అకస్మాత్తుగా పడిపోవడంతో మనిషి షాక్ గురవుతారు. అంతే కాకుండా అప్పుడప్పుడు మరణానికి కూడా దారి తీసే ప్రమాదం ఉంటుంది.

Dengue fever

రికెట్సియల్ ఫీవర్‌

పురుగులు, కీటకాలు లేదా  పేలు వంటి జీవుల యొక్క కాటు (అవి కొరకడం వలన) ద్వారా మానవులకు వ్యాపించగల రికెట్సియా అని పిలవబడే బ్యాక్టీరియా సమూహం కారణంగా ఈ ఇన్ఫెక్షన్ సంభవిస్తుంది. ఇవి గతంలో వ్యాధిని కల్గించిన జంతువుపై ఆధారపడి జీవిస్తుంది. కాక్సియెల్లా బర్నెటి వల్ల కలిగే Q జ్వరం, గాలి ద్వారా లేదా కలుషితమైన ఆహారం మరియు నీటి ద్వారా వ్యాపిస్తుంది. ఇవే కాకుండా సంబంధిత అంటువ్యాధులైన అనాప్లాస్మోసిస్, ఎర్లిచియోసిస్ మరియు క్యూ జ్వరం వంటివి కూడా ఈ వ్యాధిలో బాగంగానే అగుపిస్తాయి.

మలేరియా

ఇది ఓ దోమ కాటు వల్ల వచ్చే వ్యాధి. మలేరియా దోమ కుట్టినప్పుడు రక్తంలో ఓ హానికరమైన పరాన్న జీవిని వదిలేస్తుంది. దీంతో మన శరీరంలోకి ప్రవేశించి రోగ నిరోధక శక్తిని దెబ్బతీస్తుంది. మలేరియా సమశీతోష్ణ వాతావరణంలో అరుదుగా ఉన్నప్పటికీ, ఉష్ణమండల, ఉపఉష్ణమండల దేశాలలో ఇప్పటికీ ఈ వ్యాధి సాధారణంగా సంభవిస్తూనే ఉంటుంది. మలేరియా వచ్చిన వారి శరీరం తరచుగా చల్ల పడుతుంది. వారిలో అధికంగా జ్వరం రావడమే కాకుండా రోగికి విపరీతంగా చెమటలు పడతాయి. ఇవే కాకుండా తలనొప్పి, వాంతులు, రక్తహీనత, కండరాల నొప్పి వంటి అనేక సమస్యలు వస్తాయి.

Malaria

టైఫాయిడ్ జ్వరం

టైఫాయిడ్ జ్వరం అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలలో అసాధారణంగా కనిపించే వ్యాధి. ఈ వ్యాధి సాల్మొనెల్ల ఎంటేరికా సరోవర్ టైఫి అనే బాక్టీరియా వలన కలుగుతుంది. ఈ వ్యాధి ముఖ్యంగా పెద్దవారిలో కంటే పిల్లలలో తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాన్ని కలిగిస్తుంది. కలుషితమైన ఆహారం మరియు నీరు తీసుకున్నచో ఈ వ్యాధి సంభవిస్తుంది. అంతే కాకుండా టైఫాయిడ్‌ జ్వరం సోకిన వ్యక్తితో సన్నిహితంగా ఉండటం వల్ల కూడా ఈ జ్వరం వస్తుంది. ఈ వ్యాధి సోకిన వారిలో అధిక జ్వరం, తలనొప్పి, కడుపు నొప్పి, మలబద్ధకం లేదా అతిసారం విలక్షణమైన సంకేతాలు మరియు లక్షణాలు కనిపిస్తాయి.

Typhoid fever

లెప్టోస్పిరోసిస్

లెప్టోస్పిరోసిస్ అనేది కుక్కలు, ఎలుకలు మరియు వ్యవసాయ జంతువుల మూత్రం ద్వారా మానవ శరీరానికి వ్యాపించే అరుదైన బ్యాక్టీరియా సంక్రమణ వ్యాధి. ఈ వ్యాధికి గురైన వారిలో మొదటగా ఎటువంటి లక్షణాలు బయటపడవు. లెప్టోస్పిరోసిస్ అనే వ్యాధి సాధారణంగా సంభవించేదే కానీ ప్రాణాంతకమైనది కాదు. ఇది కూడా అనేక ఫ్లూ కేసు మాదిరిగా  ఒక వారం కంటే ఎక్కువ రోజులు ఉంటుంది. లెప్టోస్పిరోసిస్ అనేది ప్రాణాంతకమైన వ్యాధి కానప్పటికీ ఛాతీ నొప్పి మరియు చేతులు మరియు కాళ్ళు వాపు వంటి చాలా తీవ్రమైన సమస్యలను కలిగిస్తుంది. దీంతో ఈ వ్యాధి సోకిన వారు డాక్టర్‌ను సంప్రదించి, ఆసుపత్రిలో చేరవలసి ఉంటుంది.

ఇన్ ఫ్లూయెంజా

ఇన్ ఫ్లూయెంజా అనేది శీతాకాలంలో సంభవించే సాధారణ వైరల్ ఇన్ఫెక్షన్ వ్యాధులలో ఒకటి. ఇది సాధారణంగా ఒక వ్యక్తి  నుంచి మరొక వ్యక్తికి సోకే  అంటువ్యాధి. ఈ వ్యాధి బారినపడిన వారిలో ఈ వైరస్‌ ఊపిరితిత్తుల గాలి మార్గాలపై ప్రభావితం చూపడంతో వారు శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు పడుతారు. అంతే కాకుండా ఈ వ్యాధి సోకిన వారిలో అధిక జ్వరం, కండరాల నొప్పులు, దగ్గు మరియు ఇతర లక్షణాలు అగుపిస్తాయి. ఈ వ్యాధిగ్రస్తులు చికిత్స తీసుకోవడంలో అలసత్వం ప్రదర్శిస్తే న్యుమోనియాగా మారి మరణానికి కూడా దారితీసే ప్రమాదం ఉంది.

పై రకాల వ్యాధులు ప్రబలకుండా వాటి నివారణకు పాటించాల్సిన చిట్కాలుః

  • పై వ్యాధుల్లో కొన్ని దోమల ద్వారానే వ్యాపిస్తాయి కనుక వాటి నివారణకు ప్రత్యేక నిరోధకాలను ఉపయోగించాలి.
  • దోమల బారి నుంచి రక్షణ పొందడానికి చర్మాన్ని వీలైనంత వరకు కప్పి ఉంచే పొడవాటి స్లీవ్‌లు మరియు పొడవాటి ప్యాంటు వంటి రక్షణ దుస్తులను ధరించాలి.
  • దోమలు సంతానోత్పత్తికి అనేక రకమైన మురికి కాలువలు ఆశ్రమాన్ని కల్పిస్తాయి కావున, బ్రీడింగ్ గ్రౌండ్ నుంచి ఆవాసాలు దూరంగా ఉండేలా చూసుకోవాలి.
  • మీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి, అదే విధంగా దోమలను ఆకర్షించే పెర్ఫ్యూమ్ వాసనలను వాడకూడదు.
  • అనేక రకాల దోమలు, వైరస్‌ల వ్యాధి సోకిన ప్రాంతాల్లో క్యాంపెయిన్‌ నిర్వహించేటప్పుడు చేతులకు రక్షణ కల్పించే విధంగా పొడవాటి దుస్తులు, పొడవాటి అంచులు ఉన్న టోపీని ధరించాలి.
  • దోమల ప్రభావిత ప్రాంతాల్లో సంచరించిన అనంతరం  DEET లేదా పికారిడిన్‌ను ఉపయోగించి, చర్మాన్ని శుభ్రం చేసుకోవాలి.
  • జంతువుల మూత్రంతో కలుషితమైన నీటిని వాడకూడదు.
  • వరదలు లేదా భారీ వర్షాల తర్వాత సరస్సులు, నదులు లేదా చిత్తడి నేలల్లో నడవడం, ఈత కొట్టడం వంటివి చేయకూడదు.
  • వరదనీరు లేదా ఇతర మంచినీటిలో తడవడం తప్పదనిపిస్తే పాదరక్షలు ధరించి, కట్‌లు మరియు గాయాలను వాటర్‌ప్రూఫ్ బ్యాండేజీలు లేదా డ్రెస్సింగ్‌లతో కప్పి ఉంచాలి.
  • త్రాగడానికి సురక్షితంగా ఉన్న నీటిని తీసుకుని మరిగించిన అనంతరం దానిని రసాయన చికిత్సలో ఉపయోగించాలి.

Influenza

About Author –

Dr. Ranga Santhosh Kumar, Consultant General Physician & Diabetologist , Yashoda Hospital, Hyderabad
MBBS, MD (General Medicine), PGDC (Diabetology)

About Author

Yashoda Doctors

Dr. Ranga Santhosh Kumar

MBBS, MD (General Medicine), PGDC (Diabetology)

Consultant General Physician & Diabetologist