Select Page

టీ తాగడం ఎసిడిటీకి కారణమా?

Tea  తాగటం చాలా సాధారణమైన అలవాటు . అనేకమంది  రోజువారీ జీవితంలో అంతర్భాగం. కానీ ఈ అలవాటు మీ ఎసిడిటీకి కారణం కావచ్చని మీకు తెలుసా? ఎలా అని తెలుసుకోవడానికి చదవండి.

Tea ఎసిడిటీని కలిగిస్తుందా?

అవును, టీ (Tea) ని సరిగ్గా తయారు చేయనట్లయితే లేదా నిల్వ చేయనట్లయితే ఆమ్లంగా ఉండవచ్చు.WebMD, ప్రకారం,కార్బోనేటెడ్ పానీయాలు, కాఫీ మరియు టీ వంటి పానీయాలు  సాధారణంగా ఆసిడ్ reflux వ్యాధికి కారణము అవుతున్నాయి . అయినప్పటికీ, టీ స్వభావంలో స్వల్పంగా ఆమ్లంగా ఉంటుంది.

Tea ని ఆమ్లంగా మార్చేది ఏమిటి?

టీ సహజంగా ph scale లో  ఆమ్ల వైపు ఉంటుంది. Ph స్కేలు ద్రావణం యొక్క ఎసిడిటీ స్థాయి గురించి అవగాహన కల్పిస్తుంది. అంటే Tea సహజం గానే ఆమ్ల గుణాన్ని కలిగి ఉంటుంది .

హెర్బల్ Tea లు కూడా ఎసిడిటీని కలిగిస్తాయా?

హెర్బల్  టీలు అనేక విభిన్న మొక్కలతో /మూలికలతో తయారు చేయబడతాయి.  అన్ని హెర్బల్  టీలు ఎసిడిటీ లేనివి అని చెప్పలేము . మూలికా టీలు జీర్ణక్రియకు సహాయపడినప్పటికీ, స్పియర్ మింట్ మరియు పెప్పర్ మింట్ టీలు వంటి కొన్ని మూలికా టీ లు ఆసిడ్  ను ప్రేరేపించవచ్చు. ఒకవేళ మీరు ఏదైనా ఔషధం తీసుకుంటున్నట్లయితే, మూలికలు కొన్ని ప్రిస్క్రిప్షన్ లకు అంతరాయం కలిగించవచ్చు. కాబట్టి  ఏదైనా హెర్బల్ టీని ప్రయత్నించడానికి ముందు మీ వైద్యుడితో మాట్లాడటం సలహా తీసుకోవటం   మంచిది.

బ్లాక్ టీ ఎసిడిటీని కలిగించగలదా?

ఇతర టీలతో పోలిస్తే, బ్లాక్ టీ తక్కువ ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది . ఏదైనా టీ యొక్క ఎసిడిటీ స్థాయి దాని రకం మరియు మీరు దానిని ఎక్కడ నుండి పొందారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది.

ఒక కప్పు టీ తయారిలో ఎసిడిటీకి కారణమయ్యే అంశాలను ఎలా పరిహరించాలి?

టీ తయారు చేసేటప్పుడు చక్కెర, పుదీనా, నిమ్మ వంటి ఉత్పత్తులను జోడించడం వల్ల ఎసిడిటీ కి కారణమవుతుందని తెలుసుకోవడం ముఖ్యం. ఎసిడిటీని పరిహరించడం కొరకు అటువంటి పదార్థాలను ఎక్కువగా ఉపయోగించరాదు.

చాలా సాధారణ ఎసిడిటీ సమస్యలు, జీవనశైలి మరియు ఆహార కారకాలతో సంబంధం కలిగి ఉంటాయి. మీరు  రోజు మొత్తం ఉల్లాసంగా , శక్తివంతంగా ఉండటానికి సహాయపడుతుందని  ప్రతి  ఉదయం మీరు కప్పు టీని ఇష్టపడవచ్చు, కానీ ఇది చాలా ఆమ్లంగా(highly acidic) మారుతుంది. ఒకవేళ మీరు తీవ్రమైన ఎసిడిటీ/అజీర్ణం లక్షణాలను ఎదుర్కొంటున్నట్లయితే, దయచేసి మీ వైద్యుడిని సంప్రదించండి.

Reference:
  • “What is acid reflux disease”, WebMD https://www.webmd.com/heartburn-gerd/guide/what-is-acid-reflux-disease#1. Accessed on 26th February 2020.
  • “Acidity in tea: Ph levels, effects and more”, Healthline https://www.healthline.com/health/food-nutrition/is-tea-acidic. Accessed on 26th February 2020.
  • “What to drink for acid reflux”, Healthline https://www.healthline.com/health/food-nutrition/is-tea-acidic. Accessed on 26th February 2020.
  • Should people with GERD avoid caffeine?” MedicalNewsToday, https://www.webmd.com/heartburn-gerd/guide/what-is-acid-reflux-disease#1 . Accessed on 26th February 2020.