వెన్నునొప్పి: రకాలు, కారణాలు, లక్షణాలు, రోగ నిర్ధారణ & చికిత్సలు

వెన్నునొప్పి: రకాలు, కారణాలు, లక్షణాలు, రోగ నిర్ధారణ & చికిత్సలు

ప్రస్తుత కాలంలో వెన్నునొప్పి సర్వ సాధారణం అయిపోయింది. వెన్నుపాము (Spinal cord) అనేది నాడీ వ్యవస్థలోని నరాలు, కీళ్ళు, కండరాలు, స్నాయువు, అస్థిపంజరాలతో కూడిన కేంద్ర నాడీమండలానికి చెందిన సంక్లిష్టమైన అంతఃసంధాయక యంత్రాంగం. ఇది సన్నగా, పొడవుగా, ఒక గొట్టం మాదిరిగా ఉండి మెదడు నుంచి సందేశాల్ని శరీరమంతటికి మరియు బాహ్య శరీరం నుంచి మెదడుకు తీసుకొనిపోతుంది. శరీరం వెనుకభాగంలో వీపు వైపు వచ్చే నొప్పిని వెన్ను లేదా వెన్ను లేదా వెన్నెముక నొప్పి అంటారు. ఈ నొప్పులు అనునవి చర్మం కింద ఉన్న కండరాల వల్ల కానీ, కండరాల మధ్యలో ఉన్న నరముల వల్ల కానీ రావొచ్చు. కొన్ని సార్లు వెన్నుపాము నుంచి ఉద్భవించిన నరాలు కాళ్ళలోకి, మోచేతులలోకి ప్రయాణించి నొప్పిని శరీరంలోని సుదూర ప్రాంతాలకు వ్యాపింపచేస్తాయి. పిల్లలు మరియు యుక్తవయస్సులో ఉన్న వారు ఎవరైనా ఈ నొప్పి బారిన పడవచ్చు. ఈ నొప్పి ఆకస్మాతుగా గానీ, అప్పుడప్పుడు గానీ స్థిరంగా కానీ లేదా విడతలు విడతలుగా వస్తూ పోతూ ఉంటుంది. కొన్ని సార్లు ఈ నొప్పి మోచేతి లోకి, వెన్ను పై భాగానికి, వెన్ను దిగువ భాగానికి కూడా వ్యాపించవచ్చు. జీవితంలో ప్రతి 10 మందిలో 9 మంది పెద్దవాళ్ళకీ అలాగే ప్రతి 10 మంది శ్రామికులలో 5 మంది ప్రతి సంవత్సరమూ ఈ వెన్ను నొప్పితో బాధపడుతుంటారు.

వెన్నునొప్పి యొక్క లక్షణాలు

  • నడిచేటప్పుడు ఇబ్బంది
  • కాళ్లు, భుజాలు కదపలేకపోవడం
  • చేతులు లేదా కాళ్ళలో తిమ్మిరి లేదా జలదరింపు
  • మెడ కింది భాగం నుంచి వెన్ను చివర వరకు బిగుసుకు పోయినట్లు అనిపించడం
  • మెడలో వీపు పై భాగంలో మరియు క్రింది భాగంలో నొప్పి
  • ఏధైనా బరువులు ఎత్తినప్పుడు మరియు శ్రమతో కూడిన పనులు చేసినప్పుడు వీపు భాగంలో నొప్పి
  • ఎక్కువ సేపు కూర్చున్నా మరియు నిల్చున్న వీపు, మధ్య క్రింది భాగాల్లో నొప్పి రావడం
ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా?

వెన్నునొప్పికి గల కారణాలు

Spinal Pain Reasons

వెన్ను నొప్పిలో ఎక్కువ భాగం గుర్తించదగిన కారణాలు లేనప్పటికీ సాధారణంగా చెప్పుకోదగిన కారణాలు: 

వయస్సు పై బడడం: సాదారణంగా 30 లేదా 40 సంవత్సరాల వయస్సులో వెన్నునొప్పి సర్వసాధారణం.

అధిక శరీర బరువు: అధిక శరీర బరువు వెనుక భాగంలో అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది కావున వెన్నెముక నొప్పికి దారితీస్తుంది.

ఒకే భంగిమలో ఎక్కువసేపు ఉండడం: ఎల్లప్పుడూ ఒకే భంగిమలో కుర్చున్నట్లయితే మీ వెన్నుముక అదుపు తప్పి తుంటిపై భారం పడుతుంది. ఎక్కువసేపు కూర్చునేవారికి వారికి మెడ, వెనుక కండరాలు, వెన్నెముకపై ఒత్తిడి పెరిగి వెన్నెముక సమస్యలు వస్తాయి.

మొబైల్ ఫోన్ ఎక్కువగా వాడడం: ఎక్కువ సేపు తలను ఒకవైపే ఆన్చడం, మెడను పక్కకు వాల్చి ఫోన్ మాట్లాడటం, అతిగా గేమ్స్ ఆడటం వంటివి వెన్నుకు భారమవుతుంది దీంతో వెన్నెముక సమస్యలు తలెత్తవచ్చు.

గంటల తరబడి వాహనాలు నడపడం: నేటి కాలంలో వెన్నునొప్పికి దారి తీసే అతి పెద్ద కారణం వాహనాలను గంటల తరబడి నడపడం వలన వెన్నెముకపై బారం పడి త్వరగా వెన్నెముక సమస్యలు వస్తాయి. 

అధిక బరువులను లేపడం: సాధ్యమైనంత వరకూ అధిక బరువులను లేపకూడదు. ఒకవేళ లేపాల్సి వస్తే బరువును శరీరానికి దగ్గరగా ఉంచుకుని మోకాళ్లు వంచి లేపాలి..

ముందుకు వంగి పని చేయడం: బట్టలు ఉతకడం, అంట్లు తోమడం, కుట్టు మిషన్‌పై పని చేయడం, మట్టి తవ్వడం వంటివి చేయాల్సి వచ్చినప్పుడు తప్పనిసరిగా ముందుకు వంగాల్సి వస్తుంది. ఇలా ముందుకు వంగి పని చేసే వారిలో చాలామందికి వెన్నునొప్పి వస్తుంది.

పడుకొనే భంగిమ సరిగా లేకపోవడం: నిద్రలో పడుకొనే భంగిమ కూడా సక్రమంగా లేకపోతే న్నుముకపై ఒత్తిడి పెరిగి పెరిగి వెన్ను మరియు మెడ నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. 

స్ట్రెయినింగ్: కండరాలను ఎక్కువగా ఉపయోగించినప్పుడు మరియు బరువు శిక్షణ వ్యాయామాలు లేదా కార్యకలాపాల సమయంలో కూడా వెన్ను నొప్పి రావొచ్చు. 

గాయం: వీపు భాగంలో ప్రమాదాలు, జారిపడి పడిపోవడం లేదా ఒత్తిడి వంటి సమస్యలు తీవ్రమైన వెన్నునొప్పికి కారణం కావచ్చు.

ఆర్థరైటిస్: కొన్నిసార్లు  కీళ్లలో సమస్యల వల్ల కూడా వెన్నునొప్పి వస్తుంటుంది.

మానసిక పరిస్థితులు: ఒత్తిడి మరియు ఆందోళన కండరాల ఒత్తిడికి కారణమవుతుంది కావున ఈ రకమైన మానసిక పరిస్థితులకు గురయ్యే వ్యక్తులకు వెన్నునొప్పి వచ్చే ప్రమాదం ఎక్కువగా కనిపిస్తుంది.

అధికంగా వ్యాయామం చేయడం: వ్యాయమాలు చేసేప్పుడు కూడా ఇష్టానుసారంగా బరువులు ఎత్తకూడదు. శిక్షకుడి సూచనల మేరకే బరువులు ఎత్తడం మంచిది

ధూమపానం: ధూమపానం చేసేవారిలో వెన్నునొప్పి ఎక్కువగా ఉంటుంది. ధూమపానం కూడా వెన్నెముకకు రక్త ప్రవాహాన్ని తగ్గిస్తుంది మరియు బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్నిపెంచుతుంది.

వెన్నెముక ఇన్ఫెక్షన్: వెన్నుపాము నుంచి వచ్చే ఇన్ఫెక్షన్ కూడా వెన్నునొప్పికి కారణం కావచ్చు.

కొన్ని రకాల వ్యాధుల బారిన పడడం: పిత్తాశయం, క్లోమం, బృహద్ధమని, కిడ్నీ వ్యాధి, వాపు మొదలైన కారణాలు కూడా వెన్నముక నొప్పికి కారణం కావచ్చు. చాలా అరుదుగా ఆర్థరైటిస్ మరియు క్యాన్సర్ వల్ల కూడా వెన్నునొప్పి వచ్చే అవకాశం ఉంటుంది.

వెన్నెముక వైకల్యాలు: కైఫోసిస్ మరియు పార్శ్వగూని వంటి వెన్నెముకలో వైకల్యాల వల్ల కూడా వెన్నునొప్పి రావొచ్చు.

Spinal Pain Reasons

వెన్ను నొప్పి నిర్దారణ పరీక్షలు

వెన్నునొప్పిని చాలా మంది వైద్యులు శారీరక పరీక్ష ద్వారా మరియు పేషంట్ యొక్క వైద్య చరిత్ర గురించి తెలుసుకుని నిర్ధారించడం జరుగుతుంది.

అయితే కొన్ని సార్లు వెన్నునొప్పి దీర్ఘకాలికంగా ఉంటే మాత్రం ఈ క్రింది పరీక్షలను సూచించవచ్చు:

  • X-Ray: ఆర్థరైటిస్ లేదా విరిగిన ఎముకలు, వెన్నుపాము, కండరాలు, నరాలు లేదా డిస్క్‌లను ప్రభావితం చేసే పరిస్థితులను తెలుసుకోవడానికి X-Ray పరీక్షలు చేయడం జరుగుతుంది.
  • ఇమేజింగ్ పరీక్షలు: CT, MRI స్కాన్ వంటి ఇమేజింగ్ పరీక్షలను ఉపయోగించి హెర్నియేటెడ్ డిస్క్‌లు లేదా ఎముకలు, కండరాలు, కణజాలం, నరాలు, స్నాయువులు మరియు రక్త నాళాలతో సమస్యలను తెలుసుకోవడం జరుగుతుంది.
  • రక్త పరీక్షలు: వెన్ను నొప్పి ఇన్ఫెక్షన్ లేదా ఇతర పరిస్థితి వల్ల ఏమైనా వస్తుందోనని తెలుసుకోవడానికి ఈ రక్త పరీక్షలు సహాయపడతాయి.
  • నరాల అధ్యయనాల పరీక్షలు: ఎలక్ట్రోమియోగ్రఫీ (EMG) నరాలు ఉత్పత్తి చేసే విద్యుత్ ప్రేరణలను మరియు కండరాలు వాటికి ఎలా స్పందిస్తాయో కొలుస్తుంది. ఈ పరీక్ష హెర్నియేటెడ్ డిస్క్‌లు లేదా స్పైనల్ స్టెనోసిస్ అని పిలువబడే పృష్ఠవంశనాళిక (spinal canal) వల్ల కలిగే నరాలపై ఒత్తిడిని నిర్ధారిస్తుంది.
మీ ఆరోగ్య సమస్య గురించి ఆందోళన లో ఉన్నారా?

వెన్ను నొప్పి సర్జరీ రకాలు

మందులు లేదా ఫీజియోథెరపీ చికిత్సతో మెరుగుపడని వెన్నెముక వ్యాధులకు  సర్జరీ  ఒక ఎంపిక కావచ్చు& మందులకు స్పందించని వెన్నునొప్పి గల వారిలో వెన్నముక్క సర్జరీ చాలా ప్రయోజనకరమైన ప్రత్యామ్నాయ చికిత్సగా చెప్పవచ్చు.

స్పైనల్ ఫ్యూజన్: దీర్ఘకాలిక వెన్నునొప్పికి అత్యంత సాధారణ చికిత్సలలో స్పైనల్ ఫ్యూజన్ ఒకటి. 

లామినెక్టమీ: లంబార్ స్పైనల్ స్టెనోసిస్‌తో బాధపడుతున్న పేషంట్ లకు ఈ తరహా సర్జరీ సిఫార్సు చేస్తారు. వెన్నెముక నరాలపై ఒత్తిడిని తగ్గించడానికి, డిస్క్ సమస్యకు చికిత్స చేయడానికి, లేదా వెన్నెముక నుంచి కణితిని తొలగించడానికి లామినెక్టమీ  చికిత్సను చేస్తారు. 

ఫోరమినోటమీ: వెన్నెముక నరాల మీద ఒత్తిడి మరియు కుదింపు కారణంగా వెన్నునొప్పిని అనుభవించే పేషంట్ లకు వెన్నెముక నొప్పిని తగ్గించడానికి లేదా నివారించడానికి వైద్యులు ఈ సర్జరీని సిపార్సు చేస్తారు.  

డిస్కెక్టమీ: స్పైనల్ డిస్క్ అనేది వెన్నుపూసను వేరుచేసే కుషన్. డిస్సెక్టమీ అనేది వెన్నెముక నరాలపై ఒత్తిడిని తగ్గించడానికి వెన్నెముక డిస్క్‌లోని హెర్నియేటెడ్(అడ్డుపడ్డ) లేదా దెబ్బతిన్న భాగాన్ని తొలగించే ప్రక్రియ.  

డిస్క్ మార్పిడి: వెన్ను ప్రమాదం లేదా నష్టం మొదలైన వాటి కారణంగా వెన్నునొప్పితో బాధపడుతున్న పేషంట్ లకు – డిస్క్ రీప్లేస్‌మెంట్ సర్జరీ అనేది సరైన చికిత్స. ఈ సర్జరీలో సర్జన్ దెబ్బతిన్న వెన్నెముక డిస్క్‌ను తీసివేసి, దానిని కృత్రిమ డిస్క్‌తో భర్తీ చేస్తారు.

ఇంటర్‌లామినార్ ఇంప్లాంట్: ఇతర ఇన్వాసివ్ సర్జరీలతో పోల్చితే ఇది తక్కు కోత విదాన సర్జరీ. ఈ ప్రక్రియలో సర్జన్ U-ఆకారపు పరికరాన్ని వెన్నుపూసల మధ్య కింది భాగంలో ఉంచుతారు. అది అతని 2 వెన్నుపూసల మధ్య ఎక్కువ ఖాళీని ఏర్పరుస్తుంది. దీంతో అక్కడ వెన్నెముక నరాల మీద ఒత్తిడి తగ్గిపోవటంతో, నొప్పి తగ్గుతుంది.

వెన్ను నొప్పి సర్జరీ అనంతరం కలిగే ప్రయోజనాలు

వెన్నెముక సర్జరీ చేసిన పేషంట్‌లలో వెన్నునొప్పి నుంచి ఉపశమనం కలగడమే కాకుండా, కొన్ని ప్రయోజనాలను కూడా పొందవచ్చు. 

  • మునుపటి కంటే ముందు మెరుగైన కార్యాచరణలో పాల్గొనవచ్చు.
  • మెరుగైన శారీరక ఆరోగ్యం, వేగవంతమైన మానసిక స్థితిని పొందవచ్చు
  • పని చేయడానికి అధిక సామర్థ్యం కలిగి ఉంటారు.
  • తమ రోజు వారి కార్యకలపాల్లో మరింత ఉత్పాదకతను పెంపొదించుకోవడం.
మీ ఆరోగ్య సమస్య గురించి ఆందోళన లో ఉన్నారా?

వెన్ను నొప్పి యొక్క నివారణ చర్యలు

  • కాల్షియం, ప్రోటీన్లు ఎక్కువగా ఉండే (తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు, అవోకాడో) ఆహారాలు వెన్నుకు మేలు చేస్తాయి. కావున వాటిని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి
  • మొబైల్ ఫోన్ వినియోగం వెన్నుముకపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. కావున మొబైల్ వినియోగంను తగ్గించుకోవాలి  
  • ఆరోగ్యకరమైన శరీర బరువును ఉంచుకోవడం (అధిక బరువు వల్ల వెనుక కండరాలు మీద ఒతిడిపడి, వెన్ను నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది.)
  • సరైన భంగిమలో కూర్చోవడం & పడుకోవడం చేయాలి 
  • అతిగా వ్యాయమాలు చేయడం మానుకోవాలి( సరైన నిపుణల పర్యవేక్షణలతో బరువులు ఎత్తడం ఉత్తమం)
  • గంటల తరబడి వాహనాలు నడపడం మానుకోవాలి అలా చేయాల్సి వస్తే తగు జాగ్రత్తలు పాటించడం తప్పినిసరి.
  • సాధ్యమైనంత వరకు ముందుకు వంగి పనిచేయడం మానుకోవాలి
  • ఆర్థరైటిస్‌ లేదా కొన్ని ఎముక సంబంధ వ్యాధులకు గురికాకుండా జాగ్రతలు తీసుకోడం
  • ఒత్తిడి & మానసిక పరిస్థితులను నియంత్రించడానికి, విశ్రాంతి కలిగించే వ్యాయామాలు చెయ్యడం
  • మహిళలు ఎక్కువగా ఎత్తు మడిమల చెప్పులు వాడడం తగ్గించుకోవాలి(వెన్ను అమరిక అదుపు తప్పి భవిష్యత్తులు వెన్ను సమస్యలు తలెత్తుతాయి)
  • పిల్లల స్కూల్ బ్యాగ్గులు సైతం ఎక్కువ బరువు ఉండకుండ చూసుకోవాలి వారి శరీర బరువులో కేవలం 20 శాతం కంటే ఎక్కువ బరువు మోయకూడ చూసుకోవాలి.

మధ్యపానం, ధుమపానం ఆర్థరైటిస్‌కు కారణమయ్యే ఎముక సాంద్రతపై ప్రభావం చూపుతుంది. ధూమపానం ఎముక నష్టాన్ని పెంచుతుంది. ఇది వెన్నెముక పగుళ్లకు దారితీస్తుంది మరియు  మాన్పే ప్రక్రియను ఆలస్యం చేస్తుంది. నివారణచర్యలు పాటించడం, సరైన భంగిమ మరియు ఆరోగ్యకరమైన అలవాట్లతో  వెన్నెముక సమస్యల బారిన పడకుండా కాపాడుతుంది.

మీ ఆరోగ్య సంరక్షణ గురించి ఏవైనా సందేహాలు ఉన్నాయా? సహాయం చేయడానికి మేము సిద్దంగా ఉన్నాము! మా అనుభవంతులైన నిపుణుల సలహా కొరకు +919513262681 మాకు కాల్ చేయగలరు.

Dr. Vamsi Krishna Varma Penumatsa

About Author –

About Author

Dr. Vamsi Krishna Varma Penumatsa | yashoda hospitals

Dr. Vamsi Krishna Varma Penumatsa

MBBS, MS (Ortho), Fellowship in Spine Surgery

Sr. Consultant Spine Surgeon