సయాటికా నొప్పి: లక్షణాలు, కారణాలు, సర్జరీ విధానాలు & నివారణ చర్యలు

సయాటికా నొప్పి: లక్షణాలు, కారణాలు, సర్జరీ విధానాలు & నివారణ చర్యలు

ప్రస్తుత సమాజంలో అనారోగ్యకరమైన జీవనశైలి మరియు విపరీతమైన పని ఒత్తిడి కారణంగా  చాలా మంది సయాటికా నొప్పితో బాధపడుతున్నారు. ఈ ఆధునిక యుగంలో యుక్త, మధ్యవయస్సు వారిలో సయాటికా అనే పదం వినని వారుండరు. సయాటికా (Sciatica) అనేది నడుము నుంచి కాళ్ల వరకు వ్యాపించే నాడీ నొప్పిగా కూడా చెప్పవచ్చు. మన శరీరంలో అత్యంత పొడవైన నరం  సయాటికా నరమే. ఇది వెన్నుపాము నుంచి మొదలై, పిరుదుల గుండా తొడ వెనుక భాగంలోకి, అక్కడి నుంచి వెన్నుముక పక్కలకు మరియు పాదాల దాకా వెళుతుంది. ఇది 5 ఇతర నరాల సముహంతో (L-4, L-5, S-1, S-2, S-3) ఏర్పడుతుంది. ఈ సయాటికా నరం మీద ఒత్తిడి పడినప్పుడు కలిగే నొప్పినే సయాటికా నొప్పి అంటారు. తొడలు, పిక్కలు, పాదాల్లో స్పర్శను గ్రహించడానికి ఇది తోడ్పడుతుంది. సయాటికా నొప్పి అనేది సయాటికా నరం వెళ్లే మార్గంలో ఎక్కడైనా కలగవచ్చు. తుంటి ఎముక నుంచి పాదం దాకా ఉండే ఈ సయాటికా నొప్పి భరింపరానిదిగా ఉండటమే కాకుండా వారి దైనందిన జీవితాన్ని ఆటంకం కలిగిస్తుంది. ఈ సమస్య ఎక్కువగా 30 నుంచి 50 ఏళ్ల మద్య వయస్సుల్లో కనిపిస్తుంది.

సయాటికా నొప్పి యొక్క లక్షణాలు

Sciatica Pain Symptoms image

సయాటికా లక్షణాలు అందరిలో ఒకే విధంగా ఉండకపోవచ్చు :

  • వెన్నముక నొప్పి
  • దిగువ వెనుక భాగంలో నొప్పి
  • కాలులో స్పర్శ తగ్గిపోవడం
  • తుంటి నొప్పి
  • కాలులో మంట లేదా జలదరింపు
  • నడకలో మార్పు 
  • నిలబడడం మరియు నడవడం కష్టమవ్వడం
  • సయాటికా నరం ఒత్తుకుపోవడం వల్ల కాలులో తిమ్మిరి
  • సయాటికా నరం ప్రయాణించే మార్గం మొత్తం (కాళ్లు మరియు పాదాలు) నొప్పి మరియు మొద్దు బారినట్లు అనిపించడం.
ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా?

సయాటికా నొప్పికి గల కారణాలు

  • ఎక్కువసేపు  నిలబడి ఉండటం మరియు ఒకే భంగిమలో ఎక్కువ సేపు కూర్చోవడం
  • ఊబకాయం లేదా ఎక్కువ బరువు కలిగి ఉండడం (నాడులు మరియు వెన్నెముకపై అధిక ఒత్తిడి పెరిగి  మీద ఒత్తిడి నొప్పి వస్తుంది).
  • ఎక్కువ సేపు డ్రైవ్ చేయడం 
  • సరైన విధానంలో బరువులు ఎత్తకపోవడం మరియు వీపును పదే పదే తిప్పడం
  • నర్వ్ కంప్రెషన్: నర్వ్ రూట్స్ ప్రెస్ అవ్వటం వలన ఈ నొప్పి వస్తుంది.
  • హెర్నియేటెడ్ లేదా స్లిప్డ్ డిస్క్: వెన్నుపూసల మధ్య ఉండే డిస్క్ వెలుపలకు చొచ్చుకు వచ్చి వెన్నుపామును నొక్కటం ద్వారా ఈ సయాటికా నొప్పి వస్తుంది.
  • స్పైనల్ డిస్క్ హెర్నియోషన్: L4, L5, నరాల రూట్స్ ఒత్తిడికి గురై, సరైన పొజిషన్స్‌లో వంగక పక్కకు జరిగి సయాటికా నొప్పి వస్తుంది.
  • స్పైనల్ స్టినోసిన్: ఎముకల్లో ఏర్పడే ఒత్తిడి వల్ల వెన్నెముక కంప్రెస్ అవుతుంది. దానివలన సయాటికా నొప్పి వస్తుంది.
  • పెరిఫార్మిస్ సిండ్రోమ్: గాయాలు తగిలినప్పుడు పెరిఫార్మిస్ కండరం నర్వ్ రూట్స్‌ను ప్రెస్ చేస్తుంది. దీనివల్ల సయాటికా నొప్పి వస్తుంది.
  • సాక్రొఇలియక్ జాయింట్ డిస్క్ ఫంక్షన్: శారీరక శ్రమ, వ్యాయామం లేక కీళ్లు సరిగా పనిచేయక సయాటికా నొప్పి రావచ్చు.
  • ప్రెగ్నెన్సీ: ప్రెగ్నెన్నీ చివరి నెలలో పిండం బరువు పెరిగి నర్వ్ రూట్స్ ప్రెస్ అవటం వలన కూడా ఈ సయాటికా నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది.
  • పిరిఫార్మిస్ సిండ్రోమ్ : ఇది పిరుదులలో లోతుగా ఉన్న చిన్న పిరిఫార్మిస్ కండరం బిగుతుగా మారుతుంది. దీనితో తుంటి, తొడ వెనుక భాగంలో నరాల మీద ఒత్తిడి, చికాకు కలిగిస్తుంది.
  • స్పోండిలోలిస్థెసిస్ : వెన్నుపూస జారిపోయినప్పుడు ఇది మొదలవుతుంది.
  • రక్తంలో చక్కెర స్థాయిలను ప్రభావితం చేసే మధుమేహం వంటి పరిస్థితుల వల్ల కూడా సయాటికా నొప్పి రావొచ్చు.

సయాటికా నొప్పి నిర్ధారణ & సర్జరీ రకాలు

మీరు సయాటికా నొప్పితో డాక్టర్ ను సంప్రదించగానే అతను మీ వైద్య చరిత్ర, వృత్తి, మీ రోజువారీ కార్యకలాపాలు మరియు మీ నొప్పికి సంబంధించిన ప్రశ్నలను గురించి అడిగి తెలుసుకోవచ్చు.. అంతేకాకుండా డిస్క్ హెర్నియోషన్, డిస్క్ ప్రొలాప్స్, ఎక్స్-రే, CT స్కాన్, MRI స్కాన్, ఎలక్ట్రోమియోగ్రఫీ (EMG) వంటి ఇమేజింగ్ పరీక్షలు నిర్వహించి సయాటికా నొప్పిని నిర్థారణ చేస్తారు.

సయాటికా సర్జరీ రకాలు

  • మైక్రోడిసెక్టమీ: ఈ ఇన్వాసివ్ ప్రక్రియలో హెర్నియేటెడ్ లేదా ఉబ్బిన డిస్క్‌లోని కొంత భాగాన్ని తొలగించడం, తుంటి అనగా తొడ వెనుక భాగపు నరాలను కుదించడం జరుగుతుంది. 
  • లామినెక్టమీ: ఈ చికిత్సలో సంపీడన నరాల కోసం ఎక్కువ స్థలాన్ని సృష్టించడానికి సర్జన్ లామినా (వెన్నెముక కాలువను కప్పి ఉంచే అస్థి వంపు) యొక్క చిన్న భాగాన్ని తొలగిస్తారు.
  • ఫోరమినోటమీ: ఈ సర్జరీలో తొడ వెనుక భాగపు నరములు నరాల మీద ఒత్తిడిని తగ్గించడానికి సర్జన్ ఫోరమెన్ (నరాల మూలాలు వెన్నెముక కాలువను విడిచిపెట్టే ద్వారం) వెడల్పు చేస్తాడు. ఇది తరచుగా మైక్రోడిసెక్టమీ లేదా లామినెక్టమీతో కలిసి నిర్వహిస్తారు.
  • స్పైనల్ ఫ్యూజన్: వెన్నెముక యొక్క బహుళ స్థాయిలు ప్రభావితమైనప్పుడు లేదా గణనీయమైన అస్థిరత ఉన్నప్పుడు, వెన్నెముక కలయికను సిఫార్సు చేయవచ్చు. ఈ ప్రక్రియలో వెన్నెముకను స్థిరీకరించడానికి మరియు తుంటి అనగా తొడ వెనుక భాగపు నరములు నరాల మీద ఒత్తిడిని తగ్గించడానికి ఎముక అంటుకట్టుటలు లేదా ఇంప్లాంట్లు ఉపయోగించి ప్రభావిత వెన్నుపూసలను కలపడం జరుగుతుంది.
మీ ఆరోగ్య సమస్య గురించి ఆందోళన లో ఉన్నారా?

సయాటికా నొప్పి నివారణ చర్యలు

  • సరైన జీవనశైలిని అనుసరించడం మరియు సమతుల్య పోషకాహారాలను తీసుకోవడం
  • సరిగా కూర్చోవడం, నడవడం మరియు శరీరానికి సరైన భంగిమను అనుసరించడం
  • ఆరోగ్యకరమైన శరీర బరువు కలిగి ఉండడం 
  • బరువులు ఎత్తే సమయంలో సరైన లిఫ్టింగ్ పద్ధతులను పాటించడం (వంగి బరువు చేతుల్లోకి తీసుకుని జాగ్రత్తగా శరీరాన్ని తిరిగి నిటారుగా నిలపడం)
  • సయాటికా నొప్పి కారణంగా కండరాలు, నాడులు కదలికలను కోల్పోతాయి, అందువల్ల క్రమం తప్పకుండా యోగ మరియు స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయడం
  • ఒత్తిడి నిర్వహణ పద్ధతులను పాటించడం
  • ధూమపానం మరియు మద్యపానంను మానుకోవడం
  • ముఖ్యంగా నరాలపై ఏర్పడిన ఒత్తిడిని తొలగించడానికి వార్మ్ కాంప్రెషన్ లేదా కోల్డ్ కాంప్రెషన్ లను ఉపయోగించడం 
  • నిద్ర సమయంలో సౌకర్యంగా మరియు వెన్ను భాగాన్ని సపోర్ట్ చేసే పడకలను ఉపయోగించడం 

వైద్యుల సూచనల మేరకు నొప్పిని నివారించే మందులు కూడా వాడవచ్చు. అయితే మరికొన్ని సందర్భాల్లో సూచించబడిన స్టెరాయిడ్ మందులను తీసుకోవడం ద్వారా కూడా నాడులపై ఒత్తిడి తగ్గి సయాటికా నొప్పిని కొంతమేర తగ్గించుకునేందుకు అస్కారం ఉంటుంది.

ఈ మార్గాల ద్వారా సర్జరీ అవసరం లేకుండానే సయాటికా వల్ల కలిగే నడుము నొప్పిని తగ్గించుకోవచ్చు. సయాటికా నొప్పి వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా తగిన చికిత్స తీసుకుంటూ సరైన జాగ్రత్తలు పాటిస్తే 4-8 వారాల్లో తగ్గిపోతుంది. అయితే పై జాగ్రత్తలన్నీ పాటించినా చాలా కాలం పాటు నొప్పి తగ్గకపోతే డాక్టర్ ను సంప్రదించడం మంచిది.

About Author –

About Author

Dr. BSV Raju | yashoda hospitals

Dr. BSV Raju

MS, DNB (Ortho), MCh (Neuro)-NIMS Spine Fellow, Wayne State University Spine & Peripheral Nerve Fellow, Stanford University, USA

Senior Consultant Neuro & Spine Surgeon