పల్మోనరీ ఎంబోలిజం: లక్షణాలు, కారణాలు మరియు చికిత్స విధానాలు

పల్మోనరీ ఎంబోలిజం అనేది చికిత్స మీద ఆధారపడిన ఒక తీవ్రమైన పరిస్థితి, ఇది సాధారణంగా ఊపిరితిత్తులకు ప్రయాణించే రక్తంలో గడ్డకట్టడం వల్ల సంభవిస్తుంది, ఇది రక్త ప్రవాహాన్ని మరియు ఆక్సిజన్ సరఫరాను గణనీయంగా అడ్డుకుంటుంది. ఈ పరిస్థితితో ఆక్సిజన్ సరిగ్గా లేకపోవడం వల్ల గుండె మరియు ఇతర అవయవాలకు హాని ఏర్పడవచ్చు. పల్మోనరీ ఎంబోలిజం యొక్క లక్షణాలు మరియు ప్రమాద కారకాలు తక్షణమే గుర్తించడంతో తీవ్రమైన సమస్యలకు దారితీయకుండా నివారించవచ్చు.

పల్మోనరీ ఎంబోలిజం అంటే ఏమిటి?

పల్మోనరీ ఎంబోలిజం అనేది రక్తం గడ్డకట్టడం వల్ల కలిగే ప్రాణాంతక పరిస్థితి, ఇది చాలా తరచుగా కాళ్ళ లోతైన సిరలలో ఉద్భవించి (డీప్ వెయిన్ థ్రాంబోసిస్ లేదా DVT అనబడే స్థితి ద్వారా) రక్తం రక్తప్రవాహంలోకి గడ్డ ప్రవేశించి ఊపిరితిత్తులలోని ధమనులలో చేరినప్పుడు ఇది సంభవిస్తుంది, ఈ ధమనులు అనేవి గుండె నుండి ఊపిరితిత్తులకు ఆక్సిజన్‌ను రవాణా చేస్తాయి. ఈ పల్మోనరీ ఎంబోలిజం పరిస్థితి ముఖ్యంగా ఊపిరితిత్తుల ఆక్సిజనేషన్‌కు అంతరాయం కలిగిస్తుంది మరియు గుండె యొక్క పనితీరును కష్టతరం చేస్తుంది.

గడ్డ పరిమాణం మరియు కేంద్రీకృతమైన స్థానాన్ని బట్టి పల్మోనరీ ఎంబోలిజం యొక్క తీవ్రత మారవచ్చు. ఉదాహరణకు, చిన్న గడ్డలు చిన్న లక్షణాలను కలిగిస్తాయి, అయితే పెద్ద గడ్డలు శ్వాస సమస్యలు, ఛాతీ నొప్పి మరియు కొన్ని సందర్భాలలో ఆకస్మిక మరణానికి కూడా కారణమవుతాయి. ఈ పల్మోనరీ ఎంబోలిజం అనేది రక్తం యొక్క ఆక్సిజన్ స్థాయిని తగ్గించడమే కాకుండా పల్మోనరీ ధమనుల లోపల ఒత్తిడిని కలిగిస్తుంది, తద్వారా పల్మోనరీ హైపర్‌టెన్షన్‌కు దారితీస్తుంది-ఊపిరితిత్తులలో రక్తపోటు చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ఈ పరిస్థితి వస్తుంది. అందువల్ల, ఈ  పల్మోనరీ ఎంబోలిజం యొక్క ప్రారంభ రోగ నిర్ధారణ మరియు చికిత్స అనేవి చాలా ముఖ్యమైనవి.

పల్మోనరీ ఎంబోలిజం లక్షణాలు

పల్మోనరీ ఎంబోలిజం (PE) యొక్క లక్షణాలు గడ్డ పరిమాణం మరియు ప్రభావితమైన ఊపిరితిత్తుల ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటాయి. కొన్ని సాధారణ లక్షణాలు ఇక్కడ ఉన్నాయి:

  • ఊపిరి ఆడకపోవడం: ఇది అత్యంత సాధారణ లక్షణాలలో ఒకటి. ఇది అకస్మాత్తుగా సంభవించవచ్చు మరియు శ్రమతో పెరుగుతుంది.
  • ఛాతీ నొప్పి: తరచుగా తీవ్రమైన మరియు పదునైన నొప్పి రావచ్చు, ముఖ్యంగా శ్వాస తీసుకునే అప్పుడు దగ్గు లేదా తినడంతో ఈ నొప్పి మరింత తీవ్రమవుతుంది, కొన్ని అరుదైన సందర్భాల్లో గుండెపోటును అనుకరిస్తుంది.
  • దగ్గు: పొడిగా లేదా రక్తంతో కలిసిన శ్లేష్మం ఉత్పత్తి చేస్తుంది.
  • వేగంగా గుండె కొట్టుకోవడం (టాకీకార్డియా): తక్కువ స్థాయిలో ఆక్సిజన్‌కు ప్రతిఫలంగా గుండె వేగంగా కొట్టుకుంటుంది.
  • తల తిరగడం లేదా మైకము: ఇది మెదడులో రక్తం మరియు ఆక్సిజన్ ప్రవాహం తగ్గడం వల్ల సంభవించవచ్చు. తీవ్రమైన సందర్భాల్లో మూర్ఛ పోయే ప్రమాదం ఉంది.
  • కాలు నొప్పి లేదా వాపు: ఎక్కువ భాగం PE కేసులు కాలులోని DVT తో ప్రారంభమవుతాయనే వాస్తవం వల్ల ప్రభావితమైన కాలులో నొప్పి, వాపు, ఎరుపు లేదా వెచ్చదనం ఉండవచ్చు.
  • ఇతర లక్షణాలు: కొన్ని సందర్భాల్లో చెమటలు పట్టడం, ఆందోళన, జ్వరం మరియు చల్లగా లేదా నీలిరంగు చర్మం (సయనోసిస్) కూడా సంభవించవచ్చు.

పల్మొనరీ ఎంబోలిజం (PE) యొక్క సంకేతాలలో వేగవంతమైన శ్వాస, వేగవంతమైన హృదయ స్పందన రేటు, తక్కువ రక్త ఆక్సిజన్ స్థాయిలు, అసాధారణ ఊపిరితిత్తుల శబ్దాలు, లోతైన సిర త్రాంబోసిస్ సంకేతాలు, పెరిగిన జుగులార్ సిర ఒత్తిడి, తక్కువ రక్తపోటు మరియు కొన్ని ECG నమూనాలు ఉన్నాయి. ఈ సంకేతాలు PE యొక్క తీవ్రమైన కేసులను సూచిస్తాయి.

శ్వాస సరిగ్గా ఆడకపోవడం లేదా ఛాతీ నొప్పిని ఎదుర్కొంటున్నారా?

పల్మోనరీ ఎంబోలిజం కారణాలు

పల్మోనరీ ఎంబాలిజంకు గల గణనీయమైన కారణాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:

  • శరీరంలోని కొన్ని భాగాలలో రక్తం పేరుకుపోవడం, తరచుగా ఎక్కువ సేపు కదలకుండా ఉండటం.
  • తుంటి, మోకాలు లేదా కాలుతో సంబంధం కలిగిన సిరల చీలికలు లేదా శస్త్రచికిత్సలకు సంబంధించి సిరలకు గాయం కావడం.
  • హృదయనాళ వ్యాధులు వంటి ఇతర వైద్య పరిస్థితులు.
  • క్యాన్సర్, హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ, మౌఖిక గర్భనిరోధక మాత్రలు లేదా గడ్డకట్టే రుగ్మతల కారణంగా రక్తం గడ్డకట్టే కారకాలలో పెరుగుదల లేదా తగ్గుదల.

పల్మోనరీ ఎంబోలిజం ప్రమాద కారకాలను అర్థం చేసుకోవడం అనేది నివారణ చర్యలను అమలు చేయడంలో మరియు అవసరమైనప్పుడు తక్షణ వైద్య శ్రద్ధ పొందడంలో సహాయపడుతుంది. కొన్ని సందర్భాల్లో పల్మోనరీ ఎంబాలిజాన్ని  అభివృద్ధి చేసే కారకాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:

  • కాలులో రక్తం గడ్డకట్టడం లేదా సిరలలో రక్తం గడ్డకట్టడం (DVT): పల్మోనరీ ఎంబోలిజం కు అత్యంత సాధారణ కారణం కాలి లోతైన సిరలలో ఏర్పడే రక్తం గడ్డ వల్ల మరియు అది ఊపిరితిత్తులకు ప్రయాణించడం ద్వారా పల్మోనరీ ఎంబాలిజంకు దారి తీసే అవకాశం ఉంది.
  • రక్తం గడ్డకట్టే రుగ్మత: వారసత్వంగా వచ్చే మరియు కలిగి ఉన్న రుగ్మతలు రక్తం సులభంగా గడ్డకట్టేలా చేస్తాయి, ఇది పల్మోనరీ ఎంబోలిజం ప్రమాదాన్ని పెంచుతుంది.
  • కుటుంబ చరిత్ర: ముఖ్యంగా దగ్గరి బంధువులలో రక్తం గడ్డకట్టే కుటుంబ చరిత్ర గనుక ఉంటే అది మీకు వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది.
  • ప్రయాణ సమయంలో దీర్ఘకాలిక నిష్క్రియత: దీర్ఘకాలిక విమాన ప్రయాణాలు లేదా కారు ప్రయాణాల వంటివి నిశ్చలతను కలుగజేసి కాలులో రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని పెంచుతుంది.
  • సిరలకు గాయం కావడం: గాయం లేదా శస్త్రచికిత్స వల్ల సిరలకు కలిగే నష్టం కూడా గడ్డలు ఏర్పడే ప్రమాదాన్ని పెంచుతాయి.
  • ధూమపానం: సిగరెట్లు తాగడం మరియు పొగాకు రక్త నాళాలకు హాని కలిగిస్తాయి మరియు గడ్డకట్టే అవకాశాన్ని పెంచుతాయి.
  • హార్మోన్-ఆధారిత గర్భ నిరోధక లేదా హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ: గర్భ నిరోధక లేదా హార్మోన్ రీప్లేస్‌మెంట్ కోసం మందులను ఉపయోగించేటప్పుడు కొంతమంది వ్యక్తులకు గడ్డలు ఏర్పడే ప్రమాదం ఉంది.
  • డయాబెటిస్ (మధుమేహం): మధుమేహం రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని మరియు నాళాల వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుంది.
  • హృదయ స్పందన లోపం, గుండెపోటు లేదా స్ట్రోక్ చరిత్ర: ఈ పరిస్థితులు రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని పెంచుతాయి.
  • క్యాన్సర్: కొన్ని రకాల క్యాన్సర్లు మరియు క్యాన్సర్ చికిత్సలు రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని పెంచుతాయి.
  • 60 సంవత్సరాలకు పైబడిన వయస్సు: వయస్సు పెరిగేకొద్దీ PE ప్రమాదం పెరుగుతుంది.
  • అధిక బరువు లేదా ఊబకాయం: అధిక బరువు లేదా ఊబకాయం ఉన్న పరిస్థితి రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని పెంచుతుంది.
  • సెంట్రల్ వీనస్ క్యాథెటర్ ఉన్నవారు: మందులు లేదా ద్రవాలను అందించడానికి సెంట్రల్ వీనస్ క్యాథెటర్‌లు ఉపయోగించబడతాయి, ఈ క్యాథెటెర్లు రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని పెంచడంతో అనుబంధించబడవచ్చు.
  • గర్భధారణ లేదా గత ఆరు వారాల్లో జన్మనివ్వడం: గర్భధారణ మరియు ప్రసవానంతర కాలాలు కొన్ని సందర్భాలలో రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని పెంచుతాయి.

పల్మోనరీ ఎంబోలిజం సమస్యలు

చికిత్స గనుక సకాలంలో చేయకపోతే, పల్మోనరీ ఎంబోలిజం కొన్ని సందర్భాలలో ఈ క్రింది సమస్యలకు దారితీస్తుంది:

  • సయనోసిస్: ఈ స్థితిలో చర్మం, ముఖ్యంగా పెదవులు మరియు వేళ్ల చుట్టూ నీలి రంగుగా మారుతుంది. ఊపిరితిత్తులకు రక్త ప్రవాహాన్ని పల్మోనరీ ఎంబోలిజం అడ్డుకున్నప్పుడు రక్తంలో ఆక్సిజన్ లేకపోవడం వల్ల ఇది సంభవిస్తుంది.
  • పల్మోనరీ హైపర్‌టెన్షన్: ఇది ఊపిరితిత్తుల ధమనులలో అధిక రక్తపోటు పరిస్థితి. ఊపిరితిత్తులకు రక్త ప్రవాహాన్ని పల్మోనరీ ఎంబోలిజం (PE) అడ్డుకుని ఆ ధమనులలో ఒత్తిడిని పెంచడం వల్ల ఇది సంభవించవచ్చు. ఇది గుండె మరియు ఊపిరితిత్తులలో కొన్నిసార్లు శాశ్వత నష్టానికి దారితీస్తుంది.
  • స్ట్రోక్: PE నేరుగా సాధారణ స్ట్రోక్‌కు (మెదడు యొక్క రక్త సరఫరాలో అడ్డంకి వల్ల వచ్చే స్థితి) కారణం కాదు. అయినప్పటికీ, అరుదైన సందర్భాల్లో, రక్తం గడ్డ గుండె యొక్క కుడి వైపు నుండి ఎడమ వైపుకు (పేటెంట్ ఫోరామెన్ ఓవల్ ద్వారా) ప్రయాణించి, ఆపై మెదడుకు చేరుకొని, స్ట్రోక్‌కు కారణం కావచ్చు. దీనిని పారాడాక్సికల్ ఎంబాలిజం అంటారు.
  • గుండె సంబంధిత వ్యాధులు: PE గుండెపై ఒత్తిడిని తెస్తుంది. మరి ముఖ్యంగా పేషెంటుకి ఏదైనా గుండె జబ్బు ఉంటే అలాంటి పరిస్థితులలో, ఈ ఒత్తిడి అరిథ్మియాలు (రక్త ప్రసరణ లోపము వలన ఏర్పడే స్థితి) లేదా గుండె వైఫల్యం వంటి సమస్యలకు దారితీస్తుంది.
  • కార్డియాక్ షాక్: PE అనేది కొన్ని సార్లు ప్రాణాంతక పరిస్థితిగా మారుతుంది, అవయవాలకు ఆక్సిజన్ అధికంగా ఉండే రక్తం లేకపోవడం, గుండె నుండి ఊపిరితిత్తులకు రక్త ప్రవాహాన్ని భారీ మొత్తంలో తగ్గడంతో షాక్‌కు దారితీస్తుంది.
  • పల్మోనరీ ఇన్ఫార్క్షన్ (ఊపిరితిత్తుల కణజాలం దెబ్బతినడం): PE ఊపిరితిత్తుల ప్రాంతానికి రక్త ప్రవాహాన్ని పూర్తిగా అడ్డుకుంటే, ఆ ప్రాంతంలోని ఊపిరితిత్తుల కణజాలం చనిపోవచ్చు. దీనిని పల్మోనరీ ఇన్ఫార్క్షన్ అంటారు. ఇది చాలా బాధాకరంగా ఉండటమే కాక దగ్గు మరియు జ్వరంతో కూడి ఉంటుంది.

పల్మోనరీ ఎంబోలిజం రోగ నిర్ధారణ

పల్మోనరీ ఎంబోలిజం (PE) కోసం రోగనిర్ధారణ పరీక్షలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:

పల్మోనరీ ఎంబోలిజం (PE) కోసం అంచనా మరియు స్క్రీనింగ్ 

  • పల్స్ ఆక్సిమెట్రీ: ఇది రక్తంలోని ఆక్సిజన్ శాతాన్ని కొలిచే ఒక పరీక్ష, సంభావ్యంగా ఇది PE ను సూచిస్తుంది, కాకపోతే ఇది నిర్దిష్టమైనది కాదు, కొన్ని సందర్భాలలో ఇతర పరిస్థితులను కూడా సూచించవచ్చు.
  • డి-డైమర్ టెస్ట్‌లను కలిగి ఉన్న రక్త పరీక్షలు: డి-డైమర్ టెస్ట్‌లు రక్తం గడ్డకట్టేటప్పుడు విచ్ఛిన్నమయ్యే పదార్థాన్ని కొలుస్తాయి, అధిక స్థాయిలలో ఉన్న రక్తం గడ్డ ఉనికిని సూచిస్తాయి.

ఇమేజింగ్ టెస్ట్‌లు (PE యొక్క ప్రత్యక్ష దృశ్యీకరణ లేదా పరోక్ష సాక్ష్యాల కోసం)

  • కంప్యూటెడ్ టోమోగ్రఫీ (CT) పల్మోనరీ యాంజియోగ్రామ్: ఈ పరీక్ష ఊపిరితిత్తులలోని పల్మోనరీ ధమనులను చూడటానికి ప్రత్యేకమైన రంగును ఉపయోగించి స్థితిని నిర్థారిస్తుంది.
  • కాలు యొక్క అల్ట్రాసౌండ్ (వీనస్ డాప్లర్ అల్ట్రాసౌండ్): ఈ పరీక్ష కాలిలోని సిరల చిత్రాలను రూపొందించడానికి శబ్ద తరంగాలను ఉపయోగిస్తుంది.
  • వెంటిలేషన్/పర్ఫ్యూషన్ (V/Q) స్కాన్: ఇది ఊపిరితిత్తులలో గాలి ప్రవాహం మరియు ఊపిరితిత్తులలో రక్త ప్రవాహం మధ్య పోలికను అంచనా వేస్తుంది.

ఇతర పరీక్షలు (ఇవి నిర్దిష్ట పరిస్థితులలో ఉపయోగించబడతాయి)

  • ఎకోకార్డియోగ్రామ్: ఇది గుండె యొక్క కుడి వైపున ఒత్తిడి సంకేతాలను ప్రదర్శించడానికి చేసే అల్ట్రాసౌండ్.
  • పల్మోనరీ యాంజియోగ్రామ్: ఊపిరితిత్తుల ఆంజియోగ్రామ్ అనేది ఊపిరితిత్తులలోని రక్తనాళాలను దృశ్యమానం చేయడానికి ఉపయోగించే ప్రక్రియ. ఇది రక్తప్రవాహంలోకి ఒక ప్రత్యేక రంగును (కాంట్రాస్ట్ మెటీరియల్) లోపలికి పంపిస్తుంది, అది ఊపిరితిత్తులకు వెళుతుంది. పల్మోనరీ ధమనులలో ఆ రంగు కదులుతున్నప్పుడు X- కిరణాలు తీసుకోబడతాయి, తద్వారా రక్తం గడ్డకట్టడం వల్ల ఏర్పడే ఏవైనా అడ్డంకులను గుర్తించడానికి ఈ రంగు వైద్యులను అనుమతిస్తుంది.
  • ఛాతీ ఎక్స్-రే: పల్మోనరీ ఎంబోలిజం సందర్భాలలో దీనిని సిఫారసు చేయడం సాధారణం, తరచుగా ఛాతీ నొప్పి లేదా ఊపిరి ఆడకపోవడానికి గల ఇతర కారణాలను కూడా గుర్తించడానికి ఇది ఉపయోగించబడుతుంది.

గమనిక: పల్మోనరీ ఎంబోలిజం పరీక్షల ఎంపిక అనేవి రోగి యొక్క లక్షణాలు, వ్యాధి కారకాలు మరియు వనరుల లభ్యతను బట్టి మారుతుంది, అత్యంత అనుకూలమైన రోగనిర్ధారణ వ్యూహాన్ని వైద్యుడు నిర్ణయిస్తాడు.

మీరు పల్మొనరీ ఎంబాలిజం గురించి ఆందోళన చెందుతున్నారా?

పల్మోనరీ ఎంబోలిజం చికిత్స

రక్తం గడ్డ పెరగకుండా మరియు కొత్త గడ్డలు ఏర్పడకుండా నిరోధించడంపై పల్మోనరీ ఎంబోలిజం చికిత్స నిర్వహణ దృష్టి పెడుతుంది. తక్షణ చికిత్స తీవ్రమైన సమస్యలు లేదా మరణాన్ని నివారించడంలో సహాయపడుతుంది. చికిత్స విధానాలు ఈ క్రింది విధంగా ఉంటాయి:

మందులు

  • బ్లడ్ థిన్నర్లు: యాంటీకోయాగ్యులెంట్ మందులు గడ్డ ఏర్పడటం మరియు పెరుగుదలను నిరోధిస్తాయి, ఈ విభాగంలో హెపారిన్ సాధారణ ఎంపిక. కొత్తగా అభివృద్ధి చేయబడిన మౌఖిక యాంటీకోయాగ్యులెంట్లు చక్కటి పరిష్కారాన్ని ఇస్తాయి మరియు ఇతర మందులతో తక్కువ పరస్పర చర్యలు కలిగి ఉంటాయి.
  • క్లాట్ డిసాల్వర్స్: థ్రోంబోలిటిక్స్ అని పిలువబడే ఈ మందులు గడ్డలను త్వరగా కరిగించడానికి ఉపయోగిస్తారు.

కంప్రెషన్ స్టాకింగ్స్

  • కంప్రెషన్ స్టాకింగ్స్: ఇవి కాళ్ళలో రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తాయి. లోతైన సిరల్లో రక్తం గడ్డ కట్టబడి ఉన్న వ్యక్తులు తరచుగా వీటిని ఉపయోగిస్తారు మరియు వాటిని వారి వైద్యులు సూచించినట్లుగా ఉపయోగించాలి. ఇవి సాధారణంగా మోకాలి వరకు ఉంటాయి. కంప్రెషన్ స్టాకింగ్స్ యొక్క ఉద్దేశ్యం కాళ్ళలో రక్తం గడ్డ కట్టబడకుండా నిరోధించడం.

చికిత్స విధానాలు

  • ఇన్ఫీరియర్ వీనా కావా (IVC) ఫిల్టర్: ఈ విధానంలో ఊపిరితిత్తులకు చేరే రక్తం గడ్డలను అరికట్టడానికి ఉదరంలోని పెద్ద సిర అయిన ఇన్ఫీరియర్ వీనా కావాలో చిన్న ఫిల్టర్ చొప్పించబడుతుంది. యాంటీకోయాగ్యులెంట్లతో చికిత్స చేయలేని వ్యక్తులు లేదా యాంటీకోయాగ్యులెంట్ థెరపీ ఉన్నప్పటికీ పునరావృతమయ్యే PEs ఉన్న వ్యక్తులకు ఈ విధానాన్ని సాధారణంగా సూచిస్తారు.
  • పల్మోనరీ థ్రోంబెక్టమీ: పల్మోనరీ థ్రోంబెక్టమీ అనేది ఊపిరితిత్తుల ధమనుల నుండి రక్తం గడ్డ (థ్రోంబస్) తొలగించడం. థ్రోంబోలిటిక్స్ లేదా గడ్డలను కరిగించే మందులతో చికిత్సకు స్పందించని వారికి ఈ శస్త్రచికిత్సను సాధారణంగా పరిగణిస్తారు. ఈ విధానం రెండు వర్గాలకు చెందుతుంది:
    • థ్రోంబెక్టమీ: శస్త్రవైద్యుడు ఛాతీలో ఒక చీలిక చేసి, రక్తం గడ్డను తొలగించడానికి నేరుగా పల్మోనరీ ధమనులను చేరుకొని చేసే ఓపెన్ సర్జరీ విధానం.
    • క్యాథెటర్-డైరెక్టెడ్ థ్రోంబెక్టమీ: క్యాథెటర్-డైరెక్టెడ్ థ్రోంబోలిసిస్ అనేది క్యాథెటర్‌ను పల్మోనరీ ధమనిలోకి ఉంచడం మరియు రక్తం గడ్డపై నేరుగా థ్రోంబోలిటిక్ మందులను పంపించడం. పెద్ద గడ్డలు ఉన్న కొంతమంది రోగులకు ఇది ఒక ఎంపిక కావచ్చు. ఈ సందర్భంలో, చాలా సన్నని గొట్టాన్ని గజ్జల ద్వారా పంపి జాగ్రత్తగా పల్మోనరీ ధమనులలోకి ప్రవేశపెడతారు, ఈ  క్యాథెటర్ పరికరాలు యాంత్రిక పద్ధతుల ద్వారా గడ్డలను విచ్ఛిన్నం చేస్తాయి లేదా తీసుకువెళతాయి, మందులను నేరుగా గడ్డపై విడుదల చేస్తాయి.
  • సర్జికల్ ఎంబోలెక్టమీ: చాలా అరుదైన, ప్రాణాపాయకరమైన పరిస్థితుల్లో మందులు అందుబాటులో లేని లేదా నిర్వహించలేని పరిస్థితుల్లో, ఈ సర్జరీ ద్వారా పల్మోనరీ ధమనుల నుంచి రక్తం గడ్డ కట్టడాన్ని తొలగించవచ్చు.
  • సహాయక సంరక్షణ: సాధారణంగా, రక్తంలో ఆక్సిజన్ స్థాయిలను పెంచడానికి ఆక్సిజన్ థెరపీని సూచిస్తారు. నొప్పి నివారణ మందులు కూడా అవసరం కావచ్చు.

పల్మోనరీ ఎంబోలిజం నివారణ

రక్తం గడ్డకట్టడం మరియు పల్మోనరీ ఎంబాలిజంను నివారించే ప్రణాళిక ఈ క్రింది చర్యలను కలిగి ఉంటుంది:

  • సాధారణ కదలికలు చేయడం: ఎక్కువ సేపు కూర్చోవడం లేదా నిలబడటం మానుకోండి మరియు నడవడానికి తగిన విరామాలు తీసుకోండి.
  • కాలు వ్యాయామాలు: కీళ్ల వంపులు, పాదాలను వంచడం మరియు కాళ్ళను పైకి లేపడం వంటి సరళమైన కాలు వ్యాయామాలు చేయండి.
  • కంప్రెషన్ స్టాకింగ్స్ ధరించడం: దీర్ఘకాలిక నిష్క్రియత సమయంలో ఇవి ధరించడంతో కాళ్ళలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.
  • ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం: డైట్ మరియు వ్యాయామం ద్వారా ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం ద్వారా రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని తగ్గించండి.
  • హైడ్రేటెడ్‌గా (ఆర్ద్రీకరణగా) ఉండండి: ఎక్కువ నీరు త్రాగడం ద్వారా డీహైడ్రేషన్‌ను (నిర్జలీకరణను) నివారించండి.
  • ధూమపానం మానివేయడం: చక్కటి ఆరోగ్యం మరియు PE నివారణ కోసం ధూమపానం మానివేయడం చాలా ముఖ్యం.
  • అంతర్లీన పరిస్థితులను నిర్వహించడం: మధుమేహం, గుండె జబ్బులు మరియు క్యాన్సర్ వంటి పరిస్థితులను ప్రభావవంతంగా నిర్వహించడంతో PE ప్రమాదాన్ని తగ్గించవచ్చు.
  • యాంటీకోయాగ్యులెంట్ల సిఫారసు: వైద్యులు రక్తం గడ్డకట్టకుండా నిరోధించడానికి వీటిని సూచించవచ్చు.
  • కుటుంబ చరిత్రను తెలుసుకోవడం: రక్తం గడ్డకట్టడం లేదా గడ్డకట్టే రుగ్మతల యొక్క కుటుంబ చరిత్ర గురించి వైద్యుడికి తెలియజేయండి.
  • శస్త్రచికిత్స తర్వాత సంరక్షణ: చికిత్స జరిగిన తరువాత నివారణ చర్యల కోసం వైద్యుడి సూచనలను పాటించండి.

వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి?

  • క్రమంగా మరియు అర్ధం కాకుండా ప్రారంభమయ్యే ఊపిరియాడని స్థితి.
  • ఛాతీ నొప్పి.
  • కాళ్ళలో నొప్పి, వాపు, ఎరుపు లేదా వెచ్చదనం DVT లక్షణాలు కావచ్చు, ఇది PE అత్యంత సాధారణ కారణాలలో ఒకటి.
  • PE ప్రమాద కారకాలు ఉండటం మరియు ఏదైనా ఆందోళన కలిగించే లక్షణాలు ఉండటం.

పై లక్షణాలు గనుక కనిపిస్తే వైద్యులను సంప్రదించి తగు పరిష్కారాలు మరియు సూచనలు తీసుకోవడం ఉత్తమం.

ముగింపు

పల్మోనరీ ఎంబోలిజం (PE) అనేది ఊపిరితిత్తులలో రక్త ప్రవాహాన్ని అడ్డుకునే తీవ్రమైన పరిస్థితి. ఇది అకస్మాత్తుగా ఊపిరి ఆడకపోవడం, ఛాతీ నొప్పి మరియు రక్తం గడ్డకట్టడం వంటి తీవ్రమైన లక్షణాలకు కారణమవుతుంది మరియు తీవ్రమైన పరిస్థితులలో, ఇది ప్రాణాంతకం కావచ్చు. కాబట్టి, తగిన రోగ నిర్ధారణ మరియు చికిత్స అనేది నివారించడానికి అవసరం.

యశోద హాస్పిటల్స్ వారు పల్మోనరీ ఎంబోలిజం కోసం సమగ్రమైన సంరక్షణను అందించడానికి ముందు వరుసలో ఉన్నారు. వారి అంతర్శాఖల బృందంలో అనుభవజ్ఞులైన పల్మనాలజిస్టులు, కార్డియాలజిస్టులు, హెమటాలజిస్టులు మరియు వాస్కులర్ నిపుణులు ఉన్నారు. వీరు పేషెంటుకి తక్షణ చికిత్స అందించడానికి సమగ్రంగా పనిచేస్తారు. వాస్తవానికి, యశోద హాస్పిటల్స్ PE ను త్వరగా గుర్తించడానికి అత్యాధునిక డయాగ్నోస్టిక్స్‌ని కలిగి ఉంది. అంతేకాకుండా, హాస్పిటల్లో అవసరమైనప్పుడు యాంటీకోయాగ్యులేషన్ థెరపీ, థ్రోంబోలిటిక్స్ మరియు కనిష్ట చికిత్స పద్ధతులతో సహా PE కోసం మొత్తం చికిత్స స్పెక్ట్రమ్‌ను అందించడంలో ప్రసిద్ధి చెందింది.

మీ ఆరోగ్య సంరక్షణ గురించి ఏవైనా సందేహాలు ఉన్నాయా? సహాయం చేయడానికి మేము సిద్దంగా ఉన్నాము! మా అనుభవంతులైన నిపుణుల సలహా కొరకు +919513262681 మాకు కాల్ చేయగలరు.

About Author –

Dr. P Navanith Sagar Reddy

MD, DTCD, MNAMS (Med), FCCP

About Author

Dr. P Navanith Sagar Reddy

MD, DTCD, MNAMS (Med), FCCP

Consultant Pulmonologist

Yashoda Hopsitals

Recent Posts

రక్తదానం: అర్హులు, ప్రయోజనాలు మరియు అపోహల గురించి సంక్షిప్త సమాచారం

మనిషి బ్రతకడానికి ప్రాణవాయువు ఆక్సిజన్ ఎంత అవసరమో రక్తం కూడా అంతే అవసరం. రక్తం, శరీరంలోని ప్రతి కణంతో అనుక్షణం…

1 month ago

నరాల సంబంధిత వ్యాధుల రకాలు, కారణాలు, లక్షణాలు & నిర్ధారణ పరీక్షలు

నరాల సంబంధిత రుగ్మతలు అంటే నాడీ వ్యవస్థ మొత్తం మీద ప్రభావం చూపే వ్యాధులు. నాడీ సంబంధిత పరిస్థితులు ఇప్పుడు…

1 month ago

Endovascular Surgery: Minimally Invasive Solution to Vascular Disease

Endovascular surgery is a revolutionary advancement in medical technology wherein doctors can treat almost any…

1 month ago

Rhinoplasty: Understanding the Nose Surgery Procedure and Its Benefits

Rhinoplasty is commonly known as a nose job that is usually designed to reshape a…

1 month ago

Is Spine Surgery Safe? Exploring Minimally Invasive Techniques and Recovery

Spine surgery is a source of fear for most people, yet it has undergone significant…

1 month ago

కిడ్నీ వ్యాధి రకాలు, లక్షణాలు మరియు ముఖ్యమైన అంశాల గురించి వివరణ

శరీరంలో ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీలు (మూత్రపిండాలు) ప్రధానమైనవి. ఇవి సక్రమంగా పనిచేస్తే శరీర అవయవాలు కూడా చక్కగా పనిచేస్తాయి. కిడ్నీలకు…

1 month ago