Select Page

గ్యాస్ట్రో వ్యాధుల వివరాలు మరియు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెపటైటిస్‌-సి ఎందుకు వస్తుంది

తరచూ జ్వరం రావటం మరియు కడుపు ఫై భాగంలో కొద్దిపాటి నొప్పి ఉండటం అనే లక్షణాలు హెపటైటిస్‌-సి ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న వారిలో కనిపిస్తాయి . హెపటైటిస్‌-సి వైరస్‌ కారణంగా ఈ కాలేయ వ్యాధి వస్తుంటుంది. రక్తమార్పిడి లేదా ఈ వైరస్‌ ఉన్న ఇంజెక్షన్‌ సూదుల వల్ల రక్తం కలుషితం కావడం వల్ల ఈ వ్యాధి వస్తుంటుంది. గర్భవతులో తల్లి నుంచి బిడ్డకు, దంపతుల్లో ఎవరికైనా ఉంటే మరో పార్ట్‌నర్‌కు ఇది సోకుతుంది .

హెపటైటిస్‌-సి నిర్ధారించటం ఎలా

ఈ వ్యాధి నిర్ధారణ కోసం మొదట హెపటైటిస్‌-సి యాంటీబాడీ టెస్ట్‌ అనే రక్తపరీక్ష చేస్తారు. ఆ తర్వాత వ్యాధి తీవ్రత (వైరల్‌ లోడ్‌) తెలుసుకునేందుకు జాహెచ్‌సీవీ ఆర్‌ఎన్‌ఏ పరీక్ష చేస్తారు.ఈ పరీక్షలతో పాటు జీనోటైప్‌ పరీక్షల వల్ల రోగికి చికిత్స  అందించాల్సిన వ్యవధి, దానికి రోగి ప్రతిస్పందించే తీరు తెన్నులు తెలుస్తాయి. ఇందులోనే కొన్ని ‘జీనోటైప్స్‌’కు చెందిన వ్యాధుల్లో కాలేయం నుంచి ముక్క తీసి పరీక్షించాల్సిన అవసరం ఉంటుంది. దాని వల్ల నిర్దిష్టంగా ఏ చికిత్స అందించాలో తెలుస్తుంది. వ్యాధి మరింత ముదరకుండా ఉన్న వారికీ చికిత్స బాగానే పనిచేస్తుంది. ఒకవేళ వ్యాధి బాగా ముదిరితే కనిపించే దుష్ప్రభావాలు… అంటే రక్తస్రావం, పొట్టలో నీరు చేరడం (అసైటిస్‌), వ్యాధి మెదడుకు చేరడం వంటివి కనిపిస్తే మాత్రం అది కాలేయ క్యాన్సర్‌కు దారితీసే అవకాశాలు ఉంటాయి. అందుకే ఈ వ్యాధి సోకిస వారు ఎంత త్వరగా పరీక్షలు చేయించుకొని, దానికి అనుగుణం చికిత్స చేయించుకుంటే అంత మంచిది.

పాంక్రియాటైటిస్ అంటే ఏమిటి, ఎలా వస్తుంది

శరీరంలోని అవయవాలలో అతి చిన్నదైన ‘ప్యాంక్రియాస్‌’ (క్లోమ గ్రంథి) చిన్న పేగుకు పక్కనే ఉండి జీర్ణ ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది. ఇందులో ఉండే కణజాలాలు గ్లూకగాన్‌, ఇన్సులిన్‌, సామటోస్టాటిన్‌ అనే హార్మోనులను రక్తంలోకి విడుదల చేసి దానిని శక్తిగా మారుస్తుంటాయి. డయాబెటిస్‌ సమస్య నుండి ఈ గ్రంధి  కాపాడుతుంది.  అయితే ప్యాంక్రియాస్‌ స్రావాలు ఒక గొట్టం ద్వారా వచ్చి చిన్న పేగులో కలుస్తాయి. ఈ గొట్టంలో ఏదైనా ఆటంకం ఏర్పడితే అక్కడ వాపు వస్తుంది. దీనినే ప్యాంక్రియాటైటిస్‌ వ్యాధి అంటారు. మరికొన్ని సందర్భాలలో క్లోమరసంలో ప్రోటీన్ల పరిమాణం ఎక్కువై ఉండలుగా ఏర్పడి, అవి గొట్టంలో అడ్డుపడటం వల్ల కూడా ఈ సమస్య వచ్చే అవకాశాలున్నాయి. అలాగే మితిమీరిన మద్యపానం కూడా ఈ జబ్బుకు ఒక కారణం కావచ్చు. దీన్ని తొలి దశలోనే కనిపెట్టలేకపోతే వ్యాధి ముదిరి రోగికి ప్రమాదకరంగా మారుతుంది. మీకు రక్తపరీక్షలు, సీరమ్‌ లైపేజ్‌ పరీక్షలు అలాగే సీటీ స్కాన్‌ లేద ఎమ్మారై స్కాన్‌ లాంటివి ప్యాంక్రియాస్‌ రక్తనాళం ఏ స్థాయిలో ఉబ్బి ఉందో అలాగే క్లోమం ఏ మేరకు దెబ్బతిన్నదో నిర్ధారణ చేసి మీకు చికిత్స ప్రారంభించాల్సి ఉంటుంది.

కొన్ని సందర్భాల్లో మందులతో కూడా ఈ వ్యాధి తగ్గే అవకాశం ఉంటుంది. లేకపోతే మాత్రం ఆధునిక “శస్త్రచికిత్స ప్రక్రియ అయిన లాప్రోస్కోపిక్‌ సర్జరీ లేదా కీ హోల్‌ సర్జరీ ద్వారా విధానం ద్వారా చెడిపోయిన మేరకు క్లోమగ్రంథి భాగాన్ని తొలగించవచ్చు. కీహోల్‌ సర్జరీ వల్ల హాస్పిటల్‌లో రోగిని ఉండాల్సిన వ్యవధి. కూడా బాగా తగ్గుతుంది. సర్జరీ తర్వాత కొద్దికాలంలోనే కోలుకొని మీ వృత్తి జీవితాన్ని కొనసాగించవచ్చు. 

పిత్తాశయంలో రాళ్లు ఎలా వస్తాయి, చికిత్స

లివర్‌కు అనుసంధానమై సంచి మాదిరిగా ఉండే నిర్మాణమే గాల్‌బ్లాడర్‌. ఇది పైత్యరసాన్ని నిల్వ చేస్తుంది. రకరకాల కారణాల వల్ల గాల్‌బ్లాడర్‌లో రాళ్లు ఏర్పడతాయి. పిత్తాశయంలో రాళ్లు ఏర్పడిన జబ్బుతో బాధపడే కొందరు పేషెంట్లకు ఉదరం కుడివైపు ఎగువ భాగాన తీవ్రమైన నొప్పివస్తుంది. అలాగే కామెర్లు, తీవ్రమైన పాక్రియాటిక్‌ సమస్యలు ఉత్పన్నమవుతాయి.అలాంటి సందర్భాల్లో కీహోల్‌ సర్జరీ ద్వారా మొత్తం గాల్‌బ్లాడర్‌ను తీసివేయాలని డాక్టర్స్ సూచిస్తారు తీవ్రమైన కడుపునొప్పి లేదా కామెర్లు వంటి పరిణామాలకు గురైతే అప్పుడు సర్జరీ కోసం స్పెషలిస్టు డాక్టర్‌ను సంప్రదించవచ్చు. పిత్తాశయంలో రాళ్లకు సంబంధించి ఎలాంటి లక్షణాలు కనిపించని పేషెంట్లలో కేవలం మూడింట ఒక వంతు మందికి మాత్రమే తర్వాతికాలంలో సర్దరీ అవసరమవుతుంది.

About Author –

Dr. B. Ravi Shankar, Consultant Medical Gastroenterologist, Yashoda Hospital, Hyderabad
MD, DNB, DM (Gastroenterology)

About Author

Yashoda Doctors

Dr. B. Ravi Shankar

MD, DNB, DM (Gastroenterology)

Consultant Medical Gastroenterologist