Select Page

నిఫా వైరస్ గురించి అవగాహన మరియు లక్షణాల వివరాలు

నిపా వైరస్‌ అంటే ఏంటీ

నిపో వైరస్‌ అరుదైంది. దీని తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రాణాంతకమైన వైరస్‌ ఇది. ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిని ‘జూనోసిస్‌’గా గుర్తించింది. అంటే జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే వైరస్‌. “ప్రూట్‌ బ్యాట్స్‌’ అనే గబ్బిలాలు నిపా వైరస్‌కు వాహకాలుగా పనిచేస్తాయని గుర్తించారు. గతంలో మలేషియా, సింగపూర్‌లో ఈ వైరస్‌ పందుల్లో కనిపించి, వాటి ద్వారా మనుషులకు వ్యాపించింది.

నిపా వైరస్‌ లక్షణాలు:

వైరస్‌ అనగానే గాలి ద్వారా సోకుతుందనే అపోహ చాలామందికి ఉంది. కానీ ఇది గాలి ద్వారా సోకదు, నిపా గబ్బిలాల ద్వారా సోకుతుంది. దీనితో మనిషిగానీ వేరే జంతువుగానీ తాకడం వల్ల వైరస్‌ వ్యాపిస్తుంది. ఈ వైరస్‌ సోకీన వెంటనే తలనొప్పి, తల తిరుగుడు, వాంతులు, జ్వరం, మత్తు, మతిస్టిమితం తప్పినట్టు అనిపించే కన్ఫ్యూజన్‌ వంటి లక్షణాలు కనిపిస్తాయి. వైరస్‌ ఇన్ఫెక్షన్‌ ముదిరితే కోమాలోకి వెళ్లిపోతారు.

నిపా వైరస్‌ వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి?

ఈ వైరస్‌ కారణంగా మెదడు, శ్వాసకోశ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. 1998లో పశువులకు దగ్గరగా ఉండే రైతులు ఇతరుల్లో ఈ వైరస్‌ లక్షణాలను గుర్తించారు. ఆ సమయంలో 300 పందులు పాక్షికంగా ఈ వైరస్‌ బారిన పడగా… వంద మందికి వైగా మరణించారు. అప్పట్లో దీని ప్రభావానికి మొత్తం 265 మందికి ఈ వైరస్‌ సోకగా… 40 శాతం మంది వ్యాధి ముదరడంతో చనిపోయారు. అప్పట్లో వ్యాధి సోకకుండా పది లక్షల పందులను చంపేశారు. వైరస్‌ బారీ నుంచి లక్షలాది మంది ప్రాణాలను కాపాడారు.

పేరు ఎలా వచ్చింది

ఈ వైరస్‌ను మొదటగా మలేషియాలో గుర్తించారు. అక్కడి సుంగాయ్‌ నిపా అనే గ్రామంలో మొదటగా ఈ వైరస్‌ కనిపించడంతో దానికి నిపా అనే పేరు పెట్టారు. పందుల తర్వాతి కాలంలో కొన్ని జాతుల గబ్బిలాల ద్వారా ఈ వైరస్‌ సోకినట్లు గుర్తించారు. మలేషియా నుంచి 2001లో ఈ వైరస్‌ మెల్లగా బంగ్లాదేశ్‌కు పాకింది, అ తర్వాత ఇండియాలోని సిలిగురిలో గూడా నుంచి మరో వ్యక్తికి ఈ వైరస్‌ సోకుతున్నట్లు గుర్తించారు.

చికిత్స ఏంటి?

ఈ వైరస్‌ను నియంత్రించే టీకాలు ఇంకా అందుబాటులోకి రాలేదు. అయితే ఈ వైరస్‌ను సమర్థవంతంగా చంపగలిగేది ఇంటెన్సివ్‌ సపోర్టివ్‌ కేర్‌ చికిత్స ఒక్కటే, ఈ వైరస్‌ బారిన పడకుండా చూసుకోవాలి. చికిత్స చేసే వైద్యులు మాష్క్‌లు, గ్లోవ్స్‌ చేసుకోవాలి. ఆస్ట్రేలియాలో గుర్రాలకు హెండ్రా అనే వైరస్‌ సోకినప్పుడు ఇచ్చే చికిత్సనే ప్రస్తుతం ఇస్తున్నారు.

ఎలా సోకుతుంది?

ఈ నిపా వైరస్‌ ఓ జూనోటిక్‌ వైరస్‌, మనుషులకు గాలి ద్వారా లేక లాలాజలం ద్వారా సోకుతుంది. అయితే ఇది గాలి ద్వారా సోకేది కాదని డాక్టర్లు చెబుతున్నారు. గబ్చిలాలను తాకడం లేదా అవి కొరికిన పండ్లు తినడం ద్వారా ఈ వైరస్‌ సోకే ప్రమాదం ఉంది. ప్రూట్‌ బ్యాట్‌గా చెప్పుకునే పెట్రో పొడిడే వర్గానికి చెందిన గబ్బిలాలు ఈ వ్యాది వ్యాప్తికి తొలి వాహకాలు. ఇవి కొరికి పడేసిన పండ్లు, కాయలు తింటే వైరస్‌ ఇతరులకు సోకుతుంది

 

జాగ్రత్తలు
  • గబ్బీలాలు ఆహారంగా మామిడి పండ్లు, జాక్ ఫ్రూట్ , ఆపిల్స్ ని తీసుకుంటాయి. వీటిని వినియోగించేప్పుడు తగు జాగ్రత్తలు పాటించాలి
  • పెంపుడు జంతువులకు దూరంగా ఉండాలి.
  • పళ్ళు, కూరగాయలను శుభ్రపరిచిన తర్వాతే తినాలి.
  • తినేముందు చేతులను ప్రతిసారీ సబ్బుతో కడుక్కోవాలి.

About Author –

Dr. Hari Kishan Gonuguntla, Consultant Interventional Pulmonologist, Yashoda Hospitals, Hyderabad
MD, DM (Pulmonology Medicine), Fellowship in Interventional Pulmonology (NCC, Japan)

About Author

Yashoda Doctors

Dr. Hari Kishan Gonuguntla

MD, DM (Pulmonology Medicine), Fellowship in Interventional Pulmonology (NCC, Japan)

Consultant Interventional Pulmonologist