మైక్రోవేవ్ లు క్యాన్సర్ కు కారణమవుతాయా? అపోహలు – వాస్తవాలు
మైక్రోవేవ్ లు( microwaves) క్యాన్సర్ కు కారణమవుతాయా? లేదా? అనే దానిపై చాలా విస్తృతమైనా చర్చలు జరిగాయి.అనేక భారతీయ కుటుంబాల్లో, మైక్రోవేవ్ లను ఉపయోగించటం వలన క్యాన్సర్ అభివృద్ధి చెందుతుందనే భయం సర్వసాధారణం.
మీ కోసం సరళమైన స్ధాయిలో దానిని గురించిన సమాచారాన్ని తెలుసుకుందాం .
పదార్థాలను విద్యుత్ పరంగా వేడి చేసే ఏదైనా పరికరం electromagnetic frequencyని విడుదల చేస్తుంది. ఉదాహరణకు, హెయిర్ డ్రయ్యర్లు, హెయిర్ స్ట్రెయిటనర్ లు, మైక్రోవేవ్ లు, సెల్ ఫోన్ లు, బ్లూటూత్, 5G టవర్ లు మొదలైనవి. ఈ పరికరాలు అసహజ విద్యుదయస్కాంత తరంగాలను విడుదల చేస్తాయి, ఇది వేడిని కలిగిస్తుంది. ఈ విద్యుదయస్కాంత శక్తి హానికరమైనదని శాస్త్రీయంగా నిరూపించబడింది.
దీని అర్థం మైక్రోవేవ్ మీ DNAకు నష్టం కలిగిస్తుంది మరియు అనారోగ్య లక్షణాలకు దారితీస్తుందా? తెలుసుకొండి.
మైక్రోవేవ్ రేడియేషన్ అంటే ఏమిటి?
మైక్రోవేవ్ లు అధిక- ఫ్రీక్వెన్సీ కలిగిన రేడియో తరంగాలు తప్ప మరేమీ కావు మరియు ఇతర కనిపించే రేడియేషన్ (కాంతి) వలె ఇది విద్యుదయస్కాంత వర్ణపటంలో ఒక భాగం. ఆహారం, ద్రవాలు లేదా కణజాలాలు వంటి కణాలు మైక్రోవేవ్ శక్తిని సులభంగా గ్రహిస్తాయి, ఇది దానిని వేడిగా మార్చడానికి మరియు చివరికి ఆహారాన్ని వండడానికి సహాయపడుతుంది.
మైక్రోవేవ్ ఓవెన్ ఉపయోగించడం హానికరమా?
కాదు , ఆహారాన్ని వేడి చేయడానికి మైక్రోవేవ్ ఓవెన్ ఉపయోగించడం హానికరం కాదు. తయారీదారుల సూచనలకు అనుగుణంగా ఉపయోగించినప్పుడు, మైక్రోవేవ్ ఓవెన్లు వివిధ రకాల ఆహారాలను వేడి చేయడానికి మరియు వండడానికి సురక్షితమైనవి మరియు సౌకర్యవంతంగా ఉంటాయి. మైక్రోవేవ్ లో వేడి చేసిన ఆహారం రేడియోధార్మికంగా మారదు మరియు అందువల్ల ఇది సురక్షితమైనది. మైక్రోవేవ్ ఓవెన్ లు ఇతర అధిక రేడియేటింగ్ రేడియో ఫ్రీక్వెన్సీల వలే కాకుండా హానికరం కాని ఫ్రీక్వెన్సీ వద్ద పనిచేస్తాయి. మైక్రోవేవ్ ఓవెన్ స్విచ్ ఆఫ్ చేయబడినప్పుడు, అది ఎలాంటి శక్తిని విడుదల చేయదు లేదా cavity లో ఎలాంటి శక్తి ఉండదు.
మైక్రోవేవ్ ఓవెన్ల వలన కొంతమంది గాయపడినప్పటికీ, చాలా తరచుగా ఈ గాయాలు ఆవిరి లేదా వేడి ఆహారాన్ని నేరుగా తాకడం వల్ల కాలిన గాయాలు మాత్రమే.
మైక్రోవేవ్ లో వండిన ఆహారం సురక్షితమేనా?
మైక్రోవేవ్ ఓవెన్ లో వండిన ఆహారం ఎంత సురక్షితమైనదో మరియు సంప్రదాయ ఓవెన్ లో వండిన ఆహారం వలెనే పోషక విలువను కలిగి ఉంటుంది. మైక్రోవేవ్-వేడి చేసిన ఆహారం రేడియోధార్మికంగా మారదు మరియు అందువల్ల, సురక్షితంగా ఉంటుంది. అయినప్పటికీ, మైక్రోవేవ్ ఆహారాన్నిఅసమానంగా వేడి చేస్తుంది. అందువల్ల, వేడి చేసిన తరువాత ఆహారాన్ని మైక్రోవేవ్ లోపల కొన్ని నిమిషాలు ఉంచితే మంచిది, తద్వారా ఆహారం అంతటా వేడి సమానంగా పంపిణీ చేయబడుతుంది.
మైక్రోవేవ్ ఓవెన్ లో ద్రవాలను వేడి చేయడం ప్రమాదకరం మరియు గాయాలకు కూడా కారణం కావచ్చు. ద్రవాన్ని ఎక్కువగా వేడి చేసి, వెంటనే ఓవెన్ నుండి తొలగించినప్పుడు ఇది సంభవిస్తుంది. అలా చేయడం వల్ల ద్రవం లోపల వేడిని విడుదల చేస్తుంది మరియు ఆకస్మిక బబ్లింగ్ కు కారణమవుతుంది, ఇది ద్రవం వ్యక్తిపై చిందటానికి కారణం అవుతుంది . మైక్రోవేవ్ లో ద్రవాన్ని వేడి చేసేటప్పుడు, కంటైనర్ ని సగం నిండుగా ఉంచాలని మరియు దానిని బయటకు తీయడానికి ముందు చల్లబరచడానికి కొంత సమయం ఉంచాలని సిఫారసు చేయబడుతోంది.
మైక్రోవేవ్ ఓవెన్లు క్యాన్సర్ కు కారణమవుతాయా?
అమెరికన్ క్యాన్సర్ సొసైటీ ప్రకారం, మైక్రోవేవ్ x- rays లేదా గామా కిరణాలను ఉపయోగించవు. మైక్రోవేవ్ లు ఆహారాన్ని రేడియోధార్మికమైనవిగా చేయవు. మైక్రోవేవ్ లు ఆహారాన్ని వండగలవు, అయితే, ఆహారం యొక్క రసాయనిక స్వభావం మారదు మరియు క్యాన్సర్ కు దారితీసే ప్రభావాల నుండి దూరంగా ఉంటుంది.
“మైక్రోవేవ్ ఓవెన్ క్యాన్సర్ కు కారణమవుతుందని శాస్త్రీయ ఆధారాలు ఇంకా లేవు, అయినప్పటికీ, ‘ఎల్లప్పుడూ అదనపు వాడకం ఏదైనా హానికరం’ అని ముందు జాగ్రత్తగా – డాక్టర్ సచిన్ సుభాష్ మర్దా, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, యశోద హాస్పిటల్, సోమాజిగూడ. గారు హెచ్చరించారు
(Dr. Sachin Subash Marda, Consultant Surgical Oncologist, Yashoda Hospital, Somajiguda)
అపోహలు – వాస్తవాలు
అపోహ: మైక్రోవేవ్ ఓవెన్ ఆహారాన్ని రేడియోధార్మికంగా చేస్తుంది మరియు క్యాన్సర్ కు కారణమవుతుంది.
వాస్తవం: మైక్రోవేవ్ రేడియేషన్ ద్వారా ఆహారాన్ని వేడి చేస్తుంది, ఇది ఆహారంలోని నీటి కణాల ద్వారా శోషించుకోబడుతుంది మరియు ఇది ఆహారాన్ని వండడానికి సహాయపడుతుంది. మైక్రోవేవ్ లు ఆహారాన్ని రేడియోధార్మికమైనవిగా చేయవు.
అపోహ: మైక్రోవేవ్ ఆహారం యొక్క పోషకాలను చంపి, ఆహారాన్ని పూర్తిగా మారుస్తుంది.
వాస్తవం: లేదు, మైక్రోవేవ్ లు ఆహారాన్ని వేడి చేస్తాయి. ఇది పోషకాలను అదేవిధంగా ఉంచుతుంది .
అపోహ: మైక్రోవేవ్ లో వండిన ఆహారం ఎముకలను బలహీనపరుస్తుంది.
వాస్తవం: లేదు, మైక్రోవేవ్డ్-ఫుడ్ ఎముకలను బలహీనంగా చేయదు. అయితే, ఏదైనా హానికరమైన రేడియేషన్ మోతాదుకు మించి గురికావడం ప్రమాదకరం.
అపోహ: మైక్రోవేవ్-వేడి చేసిన ఆహారాన్ని తినడం ద్వారా డిఎన్ఎ తీవ్రంగా దెబ్బతింటుంది.
వాస్తవం: లేదు, డిఎన్ఎ మీద గణనీయమైన ప్రభావాలు లేవు.
అపోహ: మైక్రోవేవ్ యొక్క గోడలు ఉపయోగంలో లేనప్పుడు కూడా రేడియోధార్మిక తరంగాలను విడుదల చేస్తాయి.
వాస్తవం: లేదు. మైక్రోవేవ్ ఓవెన్ స్విచ్ ఆఫ్ చేయబడినప్పుడు రేడియోధార్మికత చూపించదు.