కిడ్నీలో స్టోన్స్ రావడానికి కారణాలు, లక్షణాలు, అపోహలు & వాస్తవాలు
ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో కిడ్నీలో రాళ్లు అతి సాధారణమైన సమస్యగా మారుతుంది. ప్రపంచ జనాభాలో 10 నుంచి 15 శాతం మంది ఈ సమస్యతో బాధపడితే మన దేశంలో 5 నుంచి 7 మిలియన్ల ప్రజలు కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్నారు. మూత్రపిండాల్లో మినరల్స్ స్పటిక రూపంలో ఏర్పడటాన్ని కిడ్నీ స్టోన్స్ అంటారు. మొత్తంగా చెప్పాలంటే ఆరోగ్యం మరియు దాని శ్రేయస్సు అంతా కిడ్నీలపైనే ఆధారపడి ఉంటుంది.
కిడ్నీలో స్టోన్స్ ఏర్పడడానికి గల కారణాలు
కిడ్నీలో రాళ్లు ఏర్పడడానికి ఒక ప్రత్యేక కారణం అంటూ ఏమి లేదు. అనేక కారణాల ఫలితంగా శరీరంలో అవి అభివృద్ధి చెందుతాయి.
ఈ కింది కారణాల వల్ల కూడా కిడ్నీలో రాళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
- కిడ్నీలో రాళ్ళు వంశపారంపర్యంగా కూడా వస్తాయి.
- వ్యాయామం చేయకపోయినా, మధుమేహంతో బాధ పడుతున్నవారికి రాళ్లు అధికంగా వస్తాయి.
- ప్రతిరోజూ తగినంత నీరు త్రాగకపోవడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి.
- కిడ్నీలో రాళ్లు ఏర్పడడానికి మరొక ప్రధాన కారణం ఉప్పు, కాల్షియం మరియు అధిక ఫైబర్ కలిగిన ఆహారాలు తీసుకోవడం కూడా ఒకటి.
- తగినన్ని నీళ్ళు త్రాగకపోవడం (శరీరంలో వ్యర్థాలను చాలా తక్కువగా బయటకు పంపడం) వల్ల కూడా కిడ్నీ స్టోన్స్ ఏర్పడతాయి.
- మూత్రపిండాల రాళ్ళు ఏర్పడటానికి ఊబకాయం మరొక కారణం, ఇది మూత్రంలో ఆమ్ల స్థాయిలను మార్చి రాళ్ళు ఏర్పడటానికి దారితీస్తుంది.
కిడ్నీ స్టోన్ యొక్క సంకేతాలు & లక్షణాలు
కిడ్నీ స్టోన్ మీ కిడ్నీ లోపల కదిలే వరకు లేదా మీ మూత్రనాళంలోకి వెళ్లే వరకు సాధారణ లక్షణాలే అనిపిస్తాయి.ఒక వేళ కిడ్నీలో రాళ్లు మీ మూత్రనాళంలోకి వెళ్తే మాత్రం ఈ క్రింది లక్షణాలు కనిపిస్తాయి.
- పక్కటెముకల క్రింద వైపు మరియు వెనుక భాగంలో తీవ్రమైన నొప్పి వస్తుంది.
- పింక్, ఎరుపు లేదా గోధుమ రంగులో దుర్వాసనతో కూడిన మూత్రం రావడం జరుగుతుంది.
- వికారం మరియు వాంతులు, నిరంతరం మూత్ర విసర్జన వంటి లక్షణాలు కనిపిస్తాయి.
- ఇన్ఫెక్షన్ ఉన్నట్లయితే జ్వరం మరియు చలి, సాధారణం కంటే తరచుగా మూత్రవిసర్జన వస్తుంటుంది.
- రాళ్లు మూత్ర నాళంలో కదులుతున్నప్పుడు నొప్పి వేరే ప్రదేశానికి మారడం వంటి లక్షణాలు కూడా అనిపిస్తాయి.
కిడ్నీ స్టోన్స్‌కు సంబంధించిన సాధారణ అపోహలు:
అపోహ 1: నిమ్మరసంతో కిడ్నీలో రాళ్లు కరగవు
వాస్తవం: నిమ్మరసాన్ని మరి ఎక్కువ మోతాదులో కాకుండా రోజు ఒక గ్లాసు ప్రతిరోజు తాగితే కిడ్నీలో రాళ్లను నివారించుకోవచ్చు. ఎందుకంటే నిమ్మరసంలో ఉన్న సిట్రెట్స్ వల్ల శరీరంలో కిడ్నీ స్టోన్స్ రావు.
అపోహ 2: టమోట, పాలకూర తీసుకుంటే కిడ్నీ స్టోన్స్ వస్తాయి
వాస్తవంః టమోట, పాలకూర వంటివి తినడం వల్ల కిడ్నీ స్టోన్స్ వస్తాయనుకోవడం అపోహ మాత్రమే. వీటిని తగిన మోతాదులో తినడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడక పోగా, కొన్ని రకాల వ్యాధులు కూడా రాకుండా ఇవి నివారించగలుగుతాయి.
అపోహ 3: కిడ్నీ స్టోన్స్ కి ఒక్కసారి చికిత్స తీసుకుంటే మళ్లీ రావు
వాస్తవంః కిడ్నీలో ఒక్క సారి రాళ్లు ఏర్పడితే ఎన్ని సార్లు చికిత్స చేయించుకున్న మళ్లీ మళ్లీ తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
అపోహ 4: కిడ్నీ స్టోన్స్ ఉన్న వారిలో కరోనా వచ్చే అవకాశం ఎక్కువ
వాస్తవంః కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడేవారికి కరోనా రావడమనేది ఒక అపోహ మాత్రమే. కిడ్నీలో రాళ్లు ఉన్నవారికి కరోనా త్వరగా దాడి చేయడానికి అసలు ఆస్కారం లేదని ప్రముఖ కిడ్నీ నిపుణులు చెబుతున్నారు.
అపోహ 5: ఈ సమస్య అన్ని వయస్సు గల వారిలో వస్తుంది
వాస్తవం: ఈ సమస్య అన్ని వయస్సు గల వారిలో వస్తుందనుకోవడం అపోహ మాత్రమే. కిడ్నీ స్టోన్స్ ముఖ్యంగా 20 – 55 సంవత్సరాల మధ్య వయస్సు వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. చిన్న పిల్లలలో చాలా అరుదుగా కనిపిస్తుంది.
అపోహ 6: నొప్పిరాకపోతే శరీరం నుంచి రాయి తొలగిపోయినట్టేనా
వాస్తవంః శరీరంలోని వెనుక భాగంలో నొప్పి తగ్గడం వల్ల వచ్చే ఉపశమనం తప్పనిసరిగా రాయి దాటిపోయిందని అనుకోవడం అపోహ మాత్రమే. కిడ్నీలో రాయి పరిమాణం పెరుగుతున్న మరియు ఒక స్దానం నుంచి మరొక స్దానానికి కదిలేటప్పుడు కూడా నొప్పి స్థాయి మారుతుంది.
కిడ్నీ స్టోన్స్ ను ఎలా నిర్ధారణ చేస్తారు
రక్త పరీక్ష: మీ రక్తంలో ఎక్కువ కాల్షియం లేదా యూరిక్ యాసిడ్ లను తెలిపే పరీక్ష.
మూత్ర పరీక్ష: ఈ పరీక్షలో మీరు చాలా ఎక్కువ రాళ్లను ఏర్పరుచుకునే ఖనిజాలను లేదా చాలా తక్కువ రాళ్లను నిరోధించే పదార్థాలను తెలుసుకునే పరీక్ష.
ఇమేజింగ్ టెస్ట్: ఇది మీ మూత్ర నాళంలో మూత్రపిండాల్లో రాళ్లను చూపే పరీక్ష. పేషంట్‌లో ఈ రకమైన అన్ని పరీక్షలు చేసి కిడ్నీల్లో రాళ్లు ఉన్నాయని నిర్దారించిన తరువాతే ఆ పేషంట్ లో సంబంధిత చికిత్సకై సిపార్సు చేస్తారు.
కిడ్నీలో రాళ్లు రాకుండా నివారించుకోవడం ఎలా.?
కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా జీవనశైలిలో అనేక మార్పులు చేసుకోవాలి.
- అందులో ముఖ్యంగా ఎక్కువగా నీళ్ళు తాగాలి. (రోజుకు కనీసం 2 నుండి 2.8 లీటర్ల నీళ్లు తాగాల్సి ఉంటుంది)
- ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి, అలాగే సాల్ట్ ఫుడ్స్ & జంక్ పుడ్స్‌ను ఎక్కువ తీసుకోకూడదు.
- తినే ఆహారంలో ఉప్పు పరిమాణం తక్కువగా తీసుకోవడం మంచిది.
- క్యాల్షియం సప్లిమెంట్ లను తీసుకోవడానికి ముందు డాక్టర్ ను సంప్రదించి తగు సలహాలు, సూచలనలను పొందడం ఉత్తమం.
కిడ్నీలో రాళ్లు ఉన్నాయనగానే కొందరు రకరకాల ప్రయత్నాలు మొదలుపెడతారు. ఆహారంలో మార్పులు చేసుకోవడం, అతిగా మంచినీళ్లు తాగడానికి సిద్ధమవవ్వడం వంటి వాటివి చేస్తుంటారు. అంతేకాక కిడ్నీలో రాళ్లు ఉన్నాయి అనగానే ఏం తినాలన్నా సంకోచిస్తారు.
అయితే ఆరోగ్యానికి సహకరించే ఆహారం తీసుకోవడం, తగు వ్యాయమాలు చేయడం వల్ల శరీర బరువును అదుపులో ఉంచుకోవడమే కాక, కిడ్నీలను కూడా పలు రకాల వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవచ్చు. అయితే కిడ్నీలు శరీరంలో ముఖ్యమైన విధులను నిర్వర్తిసాయి కావున వీటి సంరక్షణకు అందరూ తగు జాగ్రత్తలు పాటించడం ఎంతో ఉత్తమమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
References:
- https://telugu.boldsky.com/health/disorders-n-cure/kidney-stones-types-symptoms-causes-treatment-prevention/articlecontent-pf127283-021875.html
- https://telugu.samayam.com/lifestyle/health/kidney-stones-symptoms-and-natural-remedies-to-cure-at-home/articleshow/82055033.cms
- https://telugu.news18.com/news/life-style/drinking-lemon-juice-daily-will-help-to-remove-stones-in-kidney-here-is-the-details-hsn-gh-743524.html
About Author –