Select Page

థైరాయిడ్ గురించి తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు

థైరాయిడ్ గ్రంధి మన మీద ముందు భాగంలో ఉంటుంది. థైరాయిడ్ గ్రంధి మన దేహంలో గల ముఖ్యమైనటువంటి ఎండోక్రైన్ గ్రంధులలో ఒకటి. థైరాయిడ్ గ్రంధి నుండి థైరాయిడ్ హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. మన రోజువారీ జీవన విధానానికి సాధారణ స్థాయిలో థైరాయిడ్ హార్మోన్ ఉండాల్సిన అవసరం ఉంది అని మనం గమనించాలి.

థైరాయిడ్ ప్రాముఖ్యత :

తల్లి గర్భంలో గల దశ నుండి చివరికి సమాధి దశ వరకు మన జీవన విధానం సాఫిగా సాగడానికి థైరాయిడ్ హార్మోన్లు చాల ముఖ్యమైనవి. మన దేహంలో గల ముఖ్యమైన అవయవాలు వాటి పనితనం సక్రమంగా ఉండటానికి థైరాయిడ్ హార్మోన్లు చాలా ఆవశ్యకమైనవి.

పెరిగే వయసులో గల పిల్లలకు వాళ్ళ వారి శారీరక ఎదుగుదలకు థైరాయిడ్ హార్మోన్లు చాలా దోహదపడతాయి. ముఖ్యంగా 4 సవంత్సరాల లోపు వయస్సు గల పిల్లలకు వారి మెదడు ఎదుగుదల మరియు పరిపక్వతకు థైరాయిడ్ హార్మోన్లు ముఖ్యమైనవి సరైన మొత్తంలో ఈ హార్మోన్లు ఉన్నపుడు పిల్లలో మెదడు చురుకుదనం పెంపొందుతుంది.గర్భధారణ సమయంలో నిర్ణీత స్థాయిలో గల థైరాయిడ్ హార్మోన్ల వల్ల తల్లి మరియు గర్భంలో ఎదుగుతున్న శిశువు ఆరోగ్యంగా ఉంటారు. థైరాయిడ్ సక్రమంగా పనిచేయడం ద్వారా శిశువు ఆరోగ్యవంతమైన వాతావరణంలో ఎదుగుదల అనేది జరుగుతుంది. తద్వారా దాల్చిన గర్భం ఫలప్రదంగా ముగుస్తుంది. ఎప్పుడైతే థైరాయిడ్ పనితనంలో మార్పులు ఒక స్థాయికి మించినపుడు గర్భం పూర్తిగా నెలలు నిండకుండా ముందుగానే వెళ్లిపోయే ప్రమాదం మరియు గర్భం నిలిచిన వాళ్లలో అరుదుగా జన్మించిన పిల్లలకు జన్మతా లోపాలు ఉండవచ్చు.

Consult Our Experts Now

అందువల్ల థైరాయిడ్ సాధారణ స్థాయిలో పనిచేయడం గర్భధారణ సమయంలో కూడా చాలా ఆవశ్యకం. ప్రసవం అయిన తర్వాత బయటి ప్రపంచాన్ని సరిగ్గా తట్టుకునేందుకు దేహంలో ఉష్ణోగ్రత సమతుల్యతకు థైరాయిడ్ గ్రంధి దోహదం చేస్తుంది. మొదటి నాలుగు సవంత్సరాలలో మెదడు చురుకుతనం మరియు పరిపక్వతకు థైరాయిడ్ గ్రంధి సరిగ్గా పనిచేయడం చాలా అవసరం. ఏ కారణం చేతనైనా థైరాయిడ్ గ్రంధి సరిగ్గా పనిచేయక పోయివుండి, దానిని మనం ఆ విలువైన సమయంలో గుర్తించనట్లైతే వారి మానసిక ఎదుగుదలకు ఆటంకం కలిగించిన వారిమి ఆవుతాము. తర్వాత మనం మేలుకొని చికిత్స అందించిన పూర్తి మొత్తంలో న్యాయం చేయలేము. అప్పుడే జన్మించిన శిశువుకు ప్రతిరోజు ముఖ్యమే అని చెప్పాలి. ఎందుకంటే ఈ దశలో చికిత్స అందించే క్రమంలో ఈ కొంచెం ఆలస్యమైనా ఆ శిశువు తెలివి తేటలకు ఆటంకం జరుగుతుంది. తర్వాత మనం చికిత్స అందించిన కూడా పూర్తి స్థాయిలో ఆ తెలివితేటలను తిరిగి తీసుకురాలేము.అందువల్ల పుట్టిన ప్రతి శిశువుకు ఖచ్చితంగా మొదటి మూడు రోజులు గడిచిన తర్వాత థైరాయిడ్ పరీక్ష చేయించి ఏమైనా మార్పులు ఉనట్లుయితే మీ సమీపంలో గల ఎండోక్రైనాలజీ వైద్యునితో సంప్రదించి తదుపరి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. పిల్లలో మానసిక ఎదుగుదల మాత్రమే కాకుండా వారి శారీరక ఎదుగుదలకు మరియు లైంగిక పరిపక్వతకు థైరాయిడ్ గ్రంధి ఎంతో సహాయపడుతుంది ఎప్పుడైతే థైరాయిడ్ సరిగ్గా పనిచేయదో దాని వల్ల పిల్లలో ఎత్తు ఎదుగుదలలకు మరియు లైంగిక పరిపక్వతకు విఘాతం కలుగుతుంది . దాని ద్వారా పిల్లలు పొట్టిగా ఉండిపోవటం మరియు వారికీ 15 సవంత్సరాలు నిండినకూడా పెద్ద వయస్సులో గల లైంగిక మార్పులు రాకపోవచ్చు. ఆడపిల్లల్లో 14 సవంత్సరాలు నిండినకూడా వారికీ నెలసరులు మొదలు కావు. వారికీ ఆలస్యం చేయకుండా మనం చికిత్స అందిస్తే వారికీ మిగతా పిల్లల మాదిరిగా మార్పులు వస్తాయి.

పెద్దవాళ్ళకు వారి రోజువారీ పని సక్రమంగా చేసుకోవడానికి సరైన శక్తీ మరియు ఆసక్తి కలగడానికి మరియు లైంగిక వాంఛ కలగడానికికూడా థైరాయిడ్ సక్రమంగా పనిచేయటం చాలా అవసరం. స్త్రీలలో థైరాయిడ్ సరిగ్గా పనిచేయకపోతే నెలసరులు సరిగ్గా సమయానికి రాకుండా క్రమం తప్పే అవకాశం ఉంది . తద్వారా గర్భం దాల్చే అవకాశం తగ్గిపోతుంది. మన థైరాయిడ్ సమస్యలకు తగిన చికిత్స చేయించుకున్నట్లైతే ఈ సమస్యలనుండి దూరంగా ఉండవచ్చు. అంతేకాక గుండె సరిగ్గా పనిచేయడం , ప్రేగులలో సరైన కదలికలు ఉండడం మరియు కండరాలలో శక్తివంతమైన కదలికలు థైరాయిడ్ సరిగ్గా పనిచేయం ద్వారా సాధ్యమైతాయి.

 

థైరాయిడ్ సమస్యల లక్షణాలు

  • మెడ ముందు వాపు లేదా గడ్డ మాదిరిగా ఉండటం
  • తొందరగా అలసట రావటం
  • తొందరగా నిరసించి పోవటం
  • లైంగిక పరంగా సమస్యలు 
  • చర్మం పొడిగా ఉండటం మరియు మలబద్దకం 
  • ముఖం మరియు కాళ్లు వాపు రావటం
  • ఉన్నట్లుండి బరువు పెరగడం లేదా తగ్గటం
  • నెలసరులు క్రమంగ రాకపోవటం
  • పిల్లలో ఎదుగుదల మరియు మానసిక ఎదుగుదల లేకపోవటం
  • అప్పుడే జన్మించిన శిశువులో పసిరికలు/జాండిస్ ఎక్కువ రోజులపాటు ఉండటం
  • చేతులు వణకడం , విపరీతమైన చెమటలు పదే పదే మలవిసర్జనకు వెళ్ళటం మరియు గుండె దడగా ఉండటం

Consult Our Experts Now