ఆహారం తీసుకునేటప్పుడు నీళ్ళు తాగితే జీర్ణక్రియ పై ప్రభావం చూపుతుందా!
మంచి ఆరోగ్యానికి మంచి నీరు చాలా అవసరం, మరియు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది . అయినప్పటికీ మనలో చాలా మ౦ది భోజన౦ తర్వాత లేదా భోజనానికి ము౦దు కూడా నీరు తాగడం వల్ల మీ శరీరానికి ఇబ్బంది కలిగిస్తుంది అని , ఆహార౦ జీర్ణం కాకు౦డా ఉ౦టు౦దని విన్నారు. మీరు భోజనం చేసిన కనీసం ౩౦ నిమిషాల తర్వాత మీరు నీరు తాగాలని చాలా మంది సలహా ఇస్తారు. తినేటప్పుడు నీరు తాగడం మంచిదా కదా అని తెలుసుకోవడానికి నిపుణులు ఏమి చెప్పారో తెలుసుకుందాం…
భోజనంతో లేదా భోజనానికి ముందు నీరు తాగటం జీర్ణ సమస్యలను కలిగిస్తుందా?
ఏ సమస్యను కలిగించదు, భోజనానికి ముందు, భోజనంతోపాటుగా లేదా భోజనం తరువాత కూడా నీటిని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ ప్రక్రియకు అంతరాయం కలగదు. అందువల్ల, భోజనంతో నీరు తాగడం మంచిదా ,కదా అని ఆశ్చర్యపోనవసరం లేదు. నిజానికి భోజనం తర్వాత లేదా భోజనం సమయంలో నీరు త్రాగడం జీర్ణక్రియకు సహాయపడుతుంది.
జీర్ణక్రియకు నీరు ఏవిధంగా సహాయపడుతుంది?
మయో క్లినిక్ ప్రకారం, నీరు పెద్ద మొత్తంలో ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడానికి సహాయపడుతుంది, తద్వారా మన శరీరం పోషకాలను గ్రహించటానికి ఉపయోగపడుతుంది . ఇది మీ జీర్ణాశయం ద్వారా ఆహారాన్ని సజావుగా తరలించడానికి కూడా సహాయపడుతుంది. కాబట్టి నీరు తీసుకోవడం వల్ల వాస్తవానికి మలబద్ధకం నివారించవచ్చు.
ఆహారం తీసుకునేటప్పుడు నీరు తాగటం ఆకలికి అంతరాయం కలిగిస్తుందా ?
ఇది వ్యక్తికి వ్యక్తికి భిన్నంగా ఉంటుంది. నీరు తాగడం లేదా ఆహారం తినడం వల్ల కడుపు నిండుతుంది, మరియు ఎక్కువ నీరు తాగడం వల్ల ఆకలి తొలగిపోతుంది. పర్యవసానంగా, నీటికి కేలరీలు లేవు మరియు ప్రజలు తక్కువ తినడానికి ఎక్కువ నీటిని తీసుకోవచ్చు.
పెద్ద మొత్తంలో నీరు త్రాగడం జీర్ణక్రియపై ప్రభావం చూపుతుందా?
భోజనం సమయంలో లేదా ఏ పరిమాణంలో నైనా నీరు తాగడం వ్యక్తిగత అంశములపై ఆధారపడి ఉంటుంది . నీరు ఏ రోజు అయినా ఆరోగ్యకరమైన అలవాటు మరియు ఎక్కువ నీరు తాగిన మీ జీర్ణక్రియకు అంతరాయం కలిగించదు. ఒకరు భారీ భోజనం చేసిన తరువాత కూడా, ఎక్కువ మొత్తంలో నీరు తాగిన ఎలాంటి హాని చేయదు.
భోజనం తర్వాత నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు:
- కడుపులోని ఆహారాన్ని ద్రవీకృతం చేస్తుంది
- ఇది పోషకాలను గ్రహించటానికి సహాయపడుతుంది
- మలబద్ధకం నివారించవచ్చు
- ఉబ్బరం తగ్గుతుంది
- ఇది కేలరీలు తీసుకోవడం తగ్గించడంలో సహాయపడుతుంది
- జీర్ణాశయం లూబ్రికేషన్ ని ధృవీకరిస్తుంది
- ఆప్టిమల్ హైడ్రేషన్
ముగింపు
భోజనం తర్వాత మరియు భోజనం సమయంలో నీరు తాగడం సురక్షితం అని చెప్పవచ్చు. త్రాగునీటికి పరిమితులు లేవు, ఎప్పుడయిన
ఎంత పరిణామంలోనయినా మంచినీటిని తాగటం మంచిఆరోగ్యకరమైన అలవాటు.
Reference:
- Mayo Clinic, https://www.mayoclinic.org/healthy-lifestyle/nutrition-and-healthy-eating/expert-answers/digestion/faq-20058348. Last accessed on 14.2.2020
- Healthline, https://www.healthline.com/nutrition/drinking-with-meals#bottom-line. Last accessed on 14.2.2020
- Lybrate, https://www.lybrate.com/topic/should-you-drink-water-while-you-eat-know-the-facts-343a/3619ce11be3ec5db4ee62f2394ab2227. Last accessed on 14.2.2020
- Lybrate, https://www.lybrate.com/topic/should-you-drink-water-in-between-your-meal/de821a74694995d8cfff2c7285a1306f. Last accessed on 14.2.2020