Select Page

బరువు తగ్గించే ఆహారాలు మూత్రపిండాల పనితీరును దెబ్బతీస్తాయా ?

దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధులు ఉన్న వారు ఎక్కువ కాలం పాటు కార్బోహైడ్రేట్ నియంత్రణతో కూడిన ఎక్కువ-ప్రోటీన్ ఆహారం తీసుకోవడం వల్ల అవి మూత్రపిండాల పనితీరుపై మరింత నష్టాన్ని కలిగిస్తాయి.

బరువు తగ్గడం చాలా కష్టం కానీ, అదే పనిగా, కష్టంగా బరువు తగ్గవలసిన అవసరం లేదు. అధిక ప్రోటీన్ ఆహారంలో ఉన్నప్పుడు కడుపు నిండుగా చేయడం ద్వారా అందులో ఉన్న ప్రోటీన్లు బరువు తగ్గడానికి సహాయపడతాయి.

అధిక ప్రొటీన్‌లు ఉన్న ఆహారం తక్కువ వ్యవధిలో అనుసరించినప్పుడు సాధారణంగా హానికరం కాదు. కానీ దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి ఉన్నవారికి ఎక్కువ కాలం పాటు కార్బోహైడ్రేట్ పరిమితితో కూడిన అధిక-ప్రోటీన్ ఆహారం సిఫార్సు చేస్తే వారి కిడ్నీలు మరింత దెబ్బతినే ప్రమాదం ఉంది.

దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి కల్గిన రోగులు రోజుకు కిలో శరీర బరువుకు 0.6 నుండి 0.75 గ్రాముల ప్రోటీన్ మాత్రమే తీసుకోవాలి. అయితే బరువు తగ్గేందుకు కొందరు వ్యక్తులు రకరకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. అందులో భాగంగానే అధిక ప్రోటీన్ లు కలిగిన ఆహారం, అనగా ఒక కీలో శరీర బరువు కు 1.9 గ్రాముల ప్రోటీన్ ను ఆహారంలో తీసుకుంటున్నారు. ఈ మొత్తం అనేది నేషనల్‌ కిడ్నీ ఫౌండేషన్‌ సిపార్సు చేసిన దానికంటే చాలా ఎక్కువ.

కిడ్నీలు మరియు వాటి పనితీరు

మూత్రపిండాల ప్రధాన విధి మూత్రాన్ని ఉత్పత్తి చేయడం. అలాగే వ్యర్థాలు మరియు ఇతర రసాయనాలను విసర్జించడం ద్వారా రక్తాన్ని శుద్ధి చేస్తాయి. అంతే కాకుండా శరీరంలోని హానికరమైన మరియు విషపూరిత వ్యర్థ పదార్థాలను బయటకు పంపివేస్తాయి. నీరు, ద్రవాలు, ఖనిజాలు మరియు సోడియం మరియు పొటాషియం వంటి ఎలక్ట్రోలైట్‌ల వంటి రసాయనాల సమతుల్యతను కాపాడే మానవ శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాలలో కిడ్నీలది ప్రత్యేక స్దానం అని చెప్పవచ్చు.

పై పనులను నిర్వహించడమే కాక ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఇవి ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మరియు హిమోగ్లోబిన్ ఉత్పత్తిలో సహాయం చేస్తాయి. ప్రతి మూత్రపిండం ఒక మిలియన్ నెఫ్రాన్‌ల సమ్మేళనం. ఈ నెఫ్రాన్ లు పునరుత్పత్తి చేయగల పరిమిత సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.

నెఫ్రాన్ యొక్క గొట్టపు కణాలు మాత్రమే క్రింది నష్టాన్ని పునరుత్పత్తి చేయగలవు. నెఫ్రాన్‌తో కూడిన మిగిలిన కణాలు పునరుత్పత్తి చేయలేవు కనుకే వాటికి నష్టం శాశ్వతంగా ఉంటుంది.

మూత్రపిండాల పనితీరు సరిగా లేకపోవడం దేనికి దారితీస్తుంది?

ప్రతి మూత్రపిండం ఒక ప్రత్యేకమైన నిర్మాణం మరియు పనితీరును కలిగి ఉంటుంది. అందువల్ల మూత్రపిండాల వైఫల్యం తీవ్రమైన అనారోగ్యం లేదా మరణానికి కూడా దారి తీస్తుంది.

మన జీవనశైలిలో మార్పుల కారణంగా కిడ్నీ వ్యాధుల సంభవం మరియు ప్రాబల్యం రోజురోజుకు పెరుగుతోంది. నేటి తరంలోని వారు పాటిస్తున్న జీవనశైలి విధానం,అంతేకాక, పలు మార్పుల కారణంగా జంక్ పుడ్‌ వినిమోగిస్తున్న వారి సంఖ్య పెరగడం, రకరకాలైన ఖాళీ కేలరీలను అందించే అల్కహాలిక్‌ పానీయాలు అధికంగా తీసుకోవడం వల్ల కూడా ఈ కిడ్నీలకు సంబంధించిన వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయి. 

కిడ్నీ వ్యాధులు రావడానికి రెండు ముఖ్య కారణాలు, మధుమేహం మరియు రక్తపోటు. ఇవేకాక కీటో మరియు అట్కిన్స్‌ డైట్ (అధిక కొవ్వుతో కూడిన అధిక ప్రోటీన్ మరియు తక్కువ కార్బోహైడ్రేట్ ఆహారాలు) వల్ల కూడా ఈ కిడ్నీ వ్యాధులు మరింత ఎక్కువవుతున్నాయి. ఈ మధ్య కాలం లో ఈ రకమైన బరువు తగ్గించే ఆహారపు అలవాట్లు  చాలా దృష్టిని ఆకర్షించాయి.

 

improper kidney functions

ప్రొటీన్లు ఎక్కువ కాలం ఆహారంగా తీసుకోవడం ఆరోగ్యమేనా.?

ప్రొటీన్లు ఎక్కువగా కల్గిన ఆహారం ఎక్కువ కాలం పాటు తింటే మూత్రపిండాల పనితీరు మరింత దిగజారుతుంది. మనం తీసుకునే ఆహారంలో ప్రోటీన్‌ల శాతం ఎంత ఉందో తెలుసుకోవాలి. కొన్ని అధిక-ప్రోటీన్ ఆహారాలు కార్బోహైడ్రేట్ తీసుకోవడం నియంత్రిస్తాయి, ఇది ప్రోటీన్ జీవక్రియ యొక్క వ్యర్థ ఉత్పత్తులన్నింటినీ తొలగించడం శరీరానికి కష్టతరం అవుతుంది.

శరీర బరువు గురించి ఆందోళన చెందుతున్న ఆధునిక యువత అధిక ప్రోటీన్, అధిక కొవ్వు మరియు తక్కువ కార్బోహైడ్రేట్ ఆహారాన్ని తీసుకుంటారు. ఇలా చేయడం వల్ల మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదాన్ని కలిగి ఉంటాయి. కార్బోహైడ్రేట్‌లను ఇంధనం యొక్క తక్షణ వనరుగా, కొవ్వులను నిల్వ రూపంగా మరియు ప్రోటీన్‌లను ఇంధనం యొక్క చివరి వనరుగా ఉపయోగించేలా మన శరీరం రుపాతరం చెంది ఉంటుంది. కొవ్వులు మరియు ప్రోటీన్లు అంతర్గతంగా శక్తి యొక్క అసమర్థ వనరులు. మన కార్బోహైడ్రేట్ల నుండి శక్తిని ఉత్పత్తి చేయడం సులభం అయినప్పటికీ, కొవ్వులు మరియు ప్రోటీన్ల నుండి సమానమైన శక్తిని ఉత్పత్తి చేయడానికి శరీరంలో అనేక జీవక్రియ మార్గాలు పనిచేయాల్సి ఉంటుంది.

high-protein diets

నేటి తరం యువత బరువు తగ్గడానికి అనేక రకమైన ఆహార విధానాలను అలవర్చుకోవడమే  కాకుండా అదే విధానాన్ని ప్రస్తుత్తం అనుసరిస్తున్నారు. ఎవరైనా బరువు తగ్గాలనుకుంటే సరైన మోతాదులో కొవ్వులు మరియు మాంసకృత్తులు తీసుకుంటే వారు ఖచ్చితంగా బరువు తగ్గే అవకాశాలు ఉంటాయి. ఈ అధిక ప్రోటీన్లు మరియు తక్కువ కార్బోహైడ్రేట్ ఆహారాలు పెద్ద మొత్తంలో నత్రజని వ్యర్థాలు మరియు యాసిడ్ లోడ్‌ను ఉత్పత్తి చేస్తాయి. వాటిని తొలగించడానికి మూత్రపిండాలు కష్టపడి పనిచేయవలసి ఉంటుంది. కిడ్నీలు అలా చేస్తూ ఉండడంతో ఒక్క సారిగా వాటిపై ఒత్తిడి పెరిగి హైపర్‌ఫిల్ట్రేషన్ గాయానికి గురవుతాయి. ఈ తరహా విధానం అనేది చివరికి కిడ్నీలు వైఫల్యం చెందడానికి దారితీస్తుంది.

“మీ కిడ్నీలను జాగ్రత్తగా చూసుకోండి ఇలా’’

సహజంగా కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే సమతుల్యమైన ఆహారం తీసుకోవడం చాలా అవసరం. అలాగే పండ్లు, మరియు కూరగాయలు, తృణధాన్యాలు, తక్కువ కొవ్వు పాల ఉత్పత్తులు, చేపలు, పౌల్ట్రీ, బీన్స్ మరియు గింజలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల కిడ్నీలు మరింత ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. వీటితో పాటు సోడియం, చక్కెరలు, కొవ్వులు, ఎరుపు మాంసాలలో కూడా తక్కువగా ఉండేలా చూసుకోవాలి.

కిడ్నీకి సంబంధించిన వ్యాధులను మొదట్లో గుర్తించడం చాలా కష్టం. ఎప్పుడైతే మూత్రపిండాలు పనిచేయడం మానేస్తాయో అప్పుడు కిడ్నీ వ్యాధి లక్షణాలు ఒక్కొక్కటిగా బయటపడతాయి. అందుకనే కిడ్నీ వ్యాధి అని అనుమానించినట్లు అయితే వారు తప్పక డాక్టర్లను సంప్రదించి తగు పరీక్షలు చేయించుకుని చికిత్స చేయించుకోవడం ఉత్తమం. అప్పుడప్పుడు ఎంటువంటి కిడ్నీ వ్యాధులు లేని వ్యక్తులు కూడా మూత్రపిండాల పనితీరుకు సంబంధించిన పరీక్షలు చేయించుకుంటూ ఉండడం చాలా ముఖ్యమని డాక్లర్లు  సూచిస్తున్నారు.

 

About Author –

Dr. Sashi Kiran A, Consultant Nephrologist, Yashoda Hospitals – Hyderabad
MD (Pediatrics), DM (Nephrology)

About Author

Yashoda Doctors

Dr. Sashi Kiran A

MD (Pediatrics), DM (Nephrology)

Consultant Nephrologist