కరోనరీ యాంజియోప్లాస్టీ: రకాలు, ప్రయోజనాలు & సర్జరీ తరువాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఇటీవల కాలంలో గుండె జబ్బుల బారిన పడుతున్న వారి సంఖ్య బాగా పెరుగుతోంది. అయితే గుండె సమస్యలకు ఎప్పటికప్పుడు అధునాతన చికిత్స పద్దతులు అందుబాటులోకి వచ్చాయి. అందులో యాంజియోప్లాస్టీ ఒకటి. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే కరోనరీ ధమనుల్లో ఏధైనా అవరోధం ఏర్పడినప్పుడు రక్త ప్రహావానికి అంటంకం కలుగుతుంది. బ్లాక్స్‌ అని మనం పిలవబడే ఈ అడ్డంకులు లేత పసుపు రంగులో ఉండే ఒక జిగురైన పదార్థం (చెడు కొవ్వు) వల్ల ఏర్పడతాయి. దీనినే వైద్య పరిభాషలో ప్లేక్ (ఫలకం) అని అంటారు. ఈ బ్లాక్స్ లు ప్లేక్ లోపలి వైపు అంచుకు అతుక్కుని నెమ్మదిగా పెరుకుపోతూ రక్తసరఫరాకి అంటంకంగా మారడమే కాక పాక్షికంగా లేదా పూర్తిగా రక్తనాళాల్లో రక్త ప్రసరణ జరగకుండా అడ్డుపడతాయి, అప్పుడు యాంజినా లేదా ఛాతీ నొప్పి మరియు గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సమస్యను నివారించేందుకు మరియు రక్త సరఫరా నిరంతరంగా జరిగేందుకు ఉపయోగించే ప్రక్రియనే యాంజియోప్లాస్టీ అంటారు. యాంజియోప్లాస్టీని,  పెర్క్యుటేనియస్ ట్రాన్స్‌లూమినల్ కరోనరీ యాంజియోప్లాస్టీ (PTCA) లేదా పెర్క్యుటేనియస్ కరోనరీ ఇంటర్వెన్షన్ (PCI) అని కూడా పిలుస్తారు.

అకస్మాత్తుగా గుండె నొప్పి వచ్చినప్పుడు, తగిన పరిశోధనల తర్వాత, వైద్యులు తరచుగా యాంజియోప్లాస్టీ విధానాన్ని నిర్వహిస్తారు. గుండెపోటు వచ్చిన మొదటి కొన్ని గంటల్లోనే ఈ ప్రక్రియ చేయడం వల్ల గుండె ఆగిపోవడం వంటి ప్రమాదాన్ని నివారించుకోవచ్చు. ఎందుకంటే యాంజియోప్లాస్టీ సర్జరీ పూర్తి కావడానికి 1-2 గంటలు సమయం మాత్రమే పడుతుంది. గుండె యొక్క ఎడమ వైపుకు రక్తాన్ని తీసుకువచ్చే ప్రధాన ధమని ఇరుకైనపుడు, మీ గుండె కండరం బలహీనంగా ఉండి రక్త నాళాలకు అడ్డంకులు ఏర్పడినప్పుడు మాత్రమే ఈ పక్రియ నిర్వహించడం జరుగుతుంది.

కరోనరీ యాంజియోప్లాస్టీ చికిత్సను ఎవరికి చేస్తారు

సాధారణంగా కరోనరీ యాంజియోప్లాస్టీ చికిత్సను కార్డియాలజిస్ట్ లు చేస్తారు. ఇతర యాంజియోప్లాస్టీ విధానాలను అనుభవంతులైన ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ లు నిర్వహిస్తారు. అయితే గుండె సంబంధిత కరోనరీ ఆర్టరీ వ్యాధి చికిత్సలో భాగంగా యాంజియోప్లాస్టీ సర్జరీ చేస్తారు. ప్రధానంగా శరీరంలో ఈ క్రింది జరిగే కొన్ని లక్షణాలను బట్టి ఈ ప్రక్రియను చేయవచ్చు.

పూర్తిగా రక్తనాళాలలో బ్లాక్‌ (పూడికలు) కలిగి ఉన్నపుడు

  • ఛాతీ నొప్పి (యాంజినా)
  • క్రమరహిత హృదయ స్పందన (అరిథ్మియా)
  • శ్వాసకోశ ఇబ్బందులతో బాధపడడం
  • రక్తపోటు అదుపులో లేకపోవడం
  • ఆకస్మిక మైకము లేదా త్వరగా బలహీనమవ్వడం మరియు నడుస్తున్నప్పుడు లేదా పడుకున్నప్పుడు ఛాతీలో బరువుగా ఉండడం వంటి గుండెకు సంబంధించిన అసాధారణ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించినట్లు అయితే వారు ECG, 2D ECHO, TMT టెస్ట్ లు చేసి ధమనుల్లో అడ్డంకులు ఏర్పడితే, వైద్యులు వెంటనే యాంజియోప్లాస్టీ చికిత్సకు సిఫార్సు చేస్తారు.

కరోనరీ యాంజియోప్లాస్టీ సర్జరీ రకాలు

కరోనరీ యాంజియోప్లాస్టీ అనే పక్రియలో ఉపయోగించే స్టంట్‌ మరియు బెలూన్‌ బట్టి వివిధ రకాలుగా వర్గీకరించవచ్చు.

బెలూన్ యాంజియోప్లాస్టీ: యాంజియోప్లాస్టీ చికిత్సలో  బెలూన్ యాంజియోస్టీ అత్యంత సాధారణ రకం. బెలూన్ యాంజియోప్లాస్టీ అనేది రక్త ప్రవాహాన్ని మెరుగుపరిచి సంకుచితం అయిన ధమనులను తెరవడానికి ఉపయోగించే చిన్నపాటి ఇన్వాసివ్ పక్రియ. 

స్టెంట్ యాంజియోప్లాస్టీ: స్టెంట్ యాంజియోప్లాస్టీ చికిత్స విధానంలో ధమనులను వెడల్పు చేయడానికి ఒక చిన్న మెటల్ మెష్ ట్యూబ్ (స్టెంట్) చొప్పించబడుతుంది.

మీ ఆరోగ్య సమస్య గురించి ఆందోళన లో ఉన్నారా?

కరోనరీ యాంజియోప్లాస్టీ చికిత్స విధానం

Coronary Angioplasty Types, Benefits & Precautions After Surgery_telugu

ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ లు ఈ క్రింది విధముగా యాంజియోప్లాస్టీ ప్రక్రియను నిర్వహిస్తారు:

  • చేయి, మణికట్టు లేదా గజ్జలో ఒక చిన్న కట్ (ఇన్‌సిసన్‌) చేయబడుతుంది.
  • కట్ (ఇన్‌సిసన్‌)  చేసిన తరువాత కాథెటర్ అని పిలువబడే సన్నని ట్యూబ్ ను, ఆ కోత చేసిన ప్రాంతంలోకి చొప్పించడం ద్వారా మూసుకుపోయిన ధమని గోడల్లో ఉన్నప్లేక్ (ఫలకం) తెలుసుకోని ధమని గోడల్లో ఉన్న అడ్డంకులను గుర్తించడానికి కాంట్రాస్ట్ డై ఇంజెక్ట్ చేయబడుతుంది.
  • కాథెటర్ యొక్క కొనపై ఉన్న ఒక బెలూన్ ధమని గోడకు వ్యతిరేకంగా ఫలకాన్ని నెట్టడానికి మరియు ధమని గోడను తెరవడానికి ఆ ప్రదేశంలో ఉంచబడుతుంది.
  • స్టెంట్ అని పిలువబడే వైర్ మెష్ ట్యూబ్ తరచుగా ధమనిని తెరిచి రక్త ప్రవాహం సాఫీగా జరిగేలా అక్కడ దానిని ఉంచబడుతుంది.
  • రక్త ప్రవాహం సాఫీగా జరుగుతున్న క్రమంలో ఆ ప్రదేశంలో ఉన్న బెలూన్ ను తీసివేయడం జరుగుతుంది.
  • ఈ యాంజియోప్లాస్టీ ప్రక్రియ , తుంటి, పొత్తికడుపు, తొడ, మోకాలి వెనుక లేదా దిగువ కాలులోని ధమనులపై కూడా చేయవచ్చు.

కరోనరీ యాంజియోప్లాస్టీ సర్జరీ వల్ల కలిగే ప్రయోజనాలు

  • గుండెకు రక్త ప్రసరణను మెరుగుపరచడంలోనూ మరియు భవిష్యత్తులో స్ట్రోక్ ప్రమాదాన్ని నివారిస్తుంది.
  • హార్ట్ ఎటాక్‌ వల్ల గుండె ఆగిపోవడం కానీ లేదా గుండెకు రక్త ప్రసరణ తగ్గడం వల్ల ప్రాణానికి వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
  • మూసుకుపోయిన గుండె ధమనుల వలన వచ్చే ఛాతీ నొప్పిని మరియు శ్వాస ఆడకపోవడం వంటి  సమస్యలను అధిగమించవచ్చు

 గుండెపోటు సంభవించే  ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

యాంజియోప్లాస్టీ మరియు స్టెంట్ ప్లేస్‌మెంట్ మధ్య తేడా

యాంజియోప్లాస్టీ అనేది గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్త నాళాల అడ్డంకులను తొలగించడానికి చేసే ప్రక్రియ. 

యాంజియోప్లాస్టీ చేయించుకొన్న చాలా మందికి ధమనిలో స్టెంట్ కూడా ఉంచబడుతుంది. స్టెంట్ సాధారణంగా ధమనిలోకి చొప్పించబడుతుంది, ఎందుకంటే గాలి ద్వారా సాగిన బెలూన్ వలన దమని వెడల్పు అవుతుంది. యాంజియోప్లాస్టీ చేసిన తర్వాత రక్తకణాలు మళ్ళీ మూసుకు పోకుండా, వెడల్పుగా ఉండేలా రక్షణ కవచంలా ఉపయోగపడుతుంది.

మీ ఆరోగ్య సమస్య గురించి ఆందోళన లో ఉన్నారా?

యాంజియోప్లాస్టీ సర్జరీ తరువాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు

యాంజియోప్లాస్టీ మరియు స్టెంటింగ్ చేయించుకోవటం వల్ల గుండె జబ్బులు పూర్తిగా తొలగిపోతాయని కాదు, అయితే సర్జరీ తరువాత ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరిస్తూ డాక్టర్ సూచించిన ప్రకారం మందులు తీసుకోవడం చాలా అవసరం.

  • పండ్లు, ఆకుకూరలు, కూరగాయలను తీసుకోవడం ద్వారా ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ బి, సి, ఇ, మెగ్నీషియం, రాగి, ఫోలేట్, కాల్షియం వంటివి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.
  • క్రమం తప్పకుండా వ్యాయామం (వారంలో 5 రోజులు కనీసం 30 నిమిషాలు పాటు వ్యాయామం) చేయాలి
  • శరీర బరువును అదుపులో ఉంచుకోవడం (అధిక బరువు లేదా ఊబకాయం గుండె జబ్బులు మరియు ఇతర ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది)
  • అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించుకోవాలి (బ్లడ్‌ షుగర్‌ కంట్రోల్‌ (HbA1c) అనే పరీక్ష చేయించుకుని అది 7 శాతం కంటే తక్కువ ఉండేలా చూసుకోవాలి)

గుండె జబ్బులు, మధుమేహం లేదా కుటుంబ చరిత్రలో అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు వారి కొలెస్ట్రాల్‌ రక్త పరీక్షలను తరచుగా చెయ్యించుకోవాలి

  • మధుమేహం, అధిక రక్తపోటులను అదుపులో ఉంచుకోవాలి
  • ఎట్టి పరిస్థితుల్లోనూ దూమపానం మరియు మద్యపానం జోలికి వెళ్లకూడదు

రక్తనాళాలు మళ్లీ బ్లాక్ అవ్వకుండా, రక్తాన్ని పలుచన చేసే మందులు వాడుకుంటూ డాక్టర్ పర్యవేక్షణలో జాగ్రత్తలు పాటిస్తూ ఉండడం వల్ల యాంజియోప్లాస్టీ సర్జరీ తరువాత ఆరోగ్యకరమైన మరియు సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చు.       

మీ ఆరోగ్య సంరక్షణ గురించి ఏవైనా సందేహాలు ఉన్నాయా? సహాయం చేయడానికి మేము సిద్దంగా ఉన్నాము! మా అనుభవంతులైన నిపుణుల సలహా కొరకు +919513262681 కి కాల్ చేయగలరు.

About Author –

Dr. G. Ramesh , Sr. Consultant Interventional Cardiologist, Proctor for Complex Coronary Interventions , Yashoda Hospitals – Hyderabad
MMD, DM, FACC, FSCAI, FESC

About Author

Dr. G. Ramesh | yashoda hospitals

Dr. G. Ramesh

MD, DM, FACC, FSCAI, FESC

Sr. Consultant Interventional Cardiologist, Proctor for Complex Coronary Interventions