చికన్‌గున్యా లక్షణాలు, నిర్ధారణ మరియు ముందు జాగ్రత్త చర్యలు

వర్షాకాలంలో ప్రజలు అధికంగా వ్యాధుల బారిన పడుతుంటారు. ప్రస్తుత కాలంలో అందరిని ఇబ్బంది పెట్టే జ్వరాలలో చికన్‌ గున్యా కూడా ఒకటి. ముఖ్యంగా వర్షాకాలంలో తెలుగు రాష్ట్రాల్లో చికన్‌గున్యా ప్రధానమైన ఆరోగ్య సమస్యగా మారింది.  చికన్‌గున్యా వ్యాధి అనేది సాధారణంగా ఒక వైరల్‌ ఇన్ఫ్‌క్షన్‌. ఇది ప్రతివాహకం (vector-borne) ఏడెస్ ఈజిప్టి, ఏడెస్ ఆల్బోపిక్టస్ దోమల ద్వారా వ్యాప్తి చెందుతుంది.  వర్షాల వల్ల నీరు ఎక్కువగా నిల్వ ఉండే సీజన్లలో ఇది సర్వసాధారణం. ఏదైనా దోమ చికెన్‌ గున్యా ఉన్న మనిషిని కుట్టి తరువాత ఆరోగ్య వంతమైన మానవునికి కుట్టినప్పుడు మాత్రమే చికన్‌గున్యా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. ఈ జ్వరంతో ఉన్న వారు కనీసం నదడవలేని పరిస్థితి నెలకొంటుంది. ఎముక, కీళ్ల ఆరోగ్యంపై దీర్ఘకాలిక ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అయితే కీళ్ల నొప్పులు కొన్నివారాలు, నెలలు లేదా సంవత్సరాల పాటు కూడా ఉంటాయి.డెంగ్యూ కేసులతో పోలిస్తే, చికన్‌గున్యా వల్ల వచ్చే శారీరక నొప్పులు చాలా తీవ్రంగా ఉంటుంది.  

1952లో టాంజానియాలో చికన్‌గున్యాను కనుగొన్నారు. ఈ తరువాత ఆఫ్రికా, ఆసియా దేశాల్లో దీన్ని గుర్తించారు. 2004 నుంచి సుమారుగా 43 దేశాల్లో 34 లక్షల మంది ఈ వ్యాధి బారిన పడ్డారు. ప్రస్తుత వర్షాకాలంలో ఈ చికన్‌గున్యా సంక్రమణ కేసుల బారిన పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు ఎక్కువ అవుతుంది. చికెన్‌ గున్యా అంటు వ్యాధి కాదు, ఇది దోమల వల్ల మాత్రమే వ్యాపిస్తుంది కావున చికన్‌ గున్యా బారిన పడిన వారికి సపర్యములు చేసిన ఇతరులకు సోకదు.

చికన్‌గున్యా యొక్క లక్షణాలు

Chicken Gunya Symptoms

చికన్‌గున్యా యొక్క అత్యంత సాధారణ లక్షణాలు :

జ్వరం మరియు కీళ్ల నొప్పులు చికున్‌గున్యా వైరస్ యొక్క అత్యంత సాధారణ లక్షణాలు వీటితో పాటుగా,

  • అకస్మాత్తుగా తీవ్ర జ్వరం (సాధారణంగా 102 డిగ్రీల F కంటే ఎక్కువ)
  • వీపరీతమైన కీళ్లు మరియు ఒళ్ళు నొప్పులు
  • ఆర్థరైటిస్ 
  • వికారం & వాంతులు
  • తలనొప్పి
  • నీరసం మరియు అలసట
  • లింఫ్‌ నోడ్స్‌ (శోషరస గ్రంధులు) వాపుకు గురవ్వడం
  • వెన్ను నొప్పి
  • నోటిలో పూత
  • చర్మంపై దురదలు మరియు దదుర్లు రావడం

మరి కొంతమందిలో కంటి నుంచి నీరు కారడం, కండ్ల నొప్పి లాంటి లక్షణాలు సైతం  కనిపిస్తాయి.

ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా?

చికన్‌ గున్యా నిర్ధారణ పరీక్షలు

వైరస్ వ్యాప్తి ఉన్న ప్రాంతం నుంచి మీరు మీ ప్రదేశానికి తిరిగి వచ్చాక అధిక జ్వరం మరియు కీళ్ల నొప్పులను ఎదుర్కొంటుంటే, చికన్‌గున్యా వైరస్ లేదా ప్రతిరోధకాలను గుర్తించడానికి  వైద్యులు రక్త పరీక్షలకు మిమ్మల్ని సిఫారసు చేయవచ్చు. 

చికన్‌గున్యా వైరస్ ఇన్‌ఫెక్షన్ నిర్ధారణకు అనేక పద్ధతులు ఉన్నాయి.

RT-PCR టెస్ట్: CHIKV ఇన్ఫెక్షన్ యొక్క నిర్ధారణ కోసం ముఖ్యంగా సెరోలాజిక్ పద్ధతులు, వైరస్ ఐసోలేషన్ మరియు రివర్స్ ట్రాన్స్క్రిప్షన్-పాలిమరేస్ చైన్ రియాక్షన్ (RT-PCR) ద్వారా వైరల్ RNA గుర్తింపబడుతుంది. సాధారణంగా జ్వరం ప్రారంభమైన 6 రోజుల తర్వాత సేకరించిన నమూనాలను మొదట CHIKV రియల్ టైమ్ RT-PCR టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు.

ఎంజైమ్-లింక్డ్ ఇమ్యునోసోర్బెంట్ అస్సేస్ (ELISA) వంటి సెరోలాజికల్ పరీక్షలు IgM మరియు IgG యాంటీ-చికున్‌గున్యా యాంటీబాడీస్ తెలుసుకుని ఈ వ్యాధి ఉనికిని నిర్ధారించడం జరుగుతుంది. 

చికన్‌గున్యా వైరస్ ప్రతిరోధకాలు సాధారణంగా జ్వరం మొదలైన మొదటి వారం చివరిలో అభివృద్ధి చెందుతాయి. IgM యాంటీబాడీ స్థాయిలు మీరు అనారోగ్యానికి గురైన 3 నుంచి 5 వారాల తర్వాత అత్యధికంగా పెరుగుతాయి మరియు 2 నుంచి 3 నెలల వరకు కనిపిస్తాయి. IgG ప్రతిరోధకాలు లక్షణాలు ప్రారంభమైన 2 వారాల తర్వాత నిర్ధరింప బడతాయి.

చికన్‌గున్యా సోకిన మొదటి కొన్ని రోజులలో రక్తంలో వైరస్ నేరుగా గుర్తించబడవచ్చు. అనారోగ్యం యొక్క మొదటి వారంలో సేకరించిన నమూనాలు సెరోలాజికల్ మరియు వైరోలాజికల్ పద్ధతుల ద్వారా పరీక్షించబడతాయి.

పై రక్త పరీక్షల చేసి డెంగ్యూ మరియు జికా వంటి సారూప్య వైరస్‌లను కూడా నిర్ధారించవచ్చు, ఇవి ఒకే విధమైన లక్షణాలను కలిగి ఉంటాయి.

చికన్‌గున్యాకు అందుబాటులో ఉన్న చికిత్సలు

ఈ వైరస్‌ను ప్రస్తుత వ్యాక్సిన్ లేదా నిర్దిష్ట మందుల ద్వారా తగ్గించలేం. WHO ప్రకారం, వైరస్‌ను ఎదుర్కోవడానికి టీకా లేదా ప్రత్యేకమైన మందులు లేవు, అందువల్ల చికిత్స వ్యాధి లక్షణాలను తగ్గించడం పైనే ఉంటుంది. అయితే వ్యాధి తీవ్రతను బట్టి చికన్ గున్యా చికిత్సలో వైద్యులు ఈ క్రింది మందులు మరియు స్వీయ నియంత్రణలను సిఫార్సు చేస్తారు.

జ్వరం తగ్గించడానికి యాంటిపైరేటిక్స్ (Anti-pyretics)

నొప్పి నివారణకు మరియు జ్వరాన్ని తగ్గించడానికి అనాల్జెసిక్స్ వాడడం (Analgesics)

నీరు మరియు పండ్ల రసాలను ఎక్కువగా తాగడం 

ఎక్కువగా విశ్రాంతి తీసుకోవడం వంటివి చేయాలి.

చికన్‌గున్యా మరియు డెంగ్యూ వ్యాధి లక్షణాలు దాదాపు ఒకేలా ఉన్నప్పటికీ డెంగ్యూ నివారణకు వాడే మందులు (ఆస్పిరిన్ లేదా నాన్‌స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ (NSAIDలు) వాడకుడదు. రోగనిర్ధారణ అయిన తర్వాత, కీళ్లలో నొప్పి ఉన్న పేషంట్ లు వైద్యుల సూచన మేరకు నాన్‌స్టెరాయిడ్(Non-steroids) యాంటీ ఇన్ఫ్లమేటరీ(Anti-inflammatory) డ్రగ్స్ మరియు కార్టికోస్టెరాయిడ్స్‌ను(Corticosteroids) ఉపయోగించవచ్చు.ఈ రకమైన మందులు చికన్‌గున్యా లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతాయి. 

చాలా మంది పేషంట్ లు చికన్ గున్యాకు తగిన చికిత్స తీసుకున్న తరువాత పూర్తిగా కోలుకుంటారు, కానీ కొన్ని సందర్భాల్లో  కొంతమంది పేషంట్ లు తీవ్రమైన అనారోగ్యం తర్వాత నెలల్లో తీవ్ర కీళ్ళనొప్పులు (పాలీఆర్థ్రాల్జియా), కీళ్ళవాతం (పాలీ ఆర్థరైటిస్) మోకాలి వాపు (టెనోసైనోవైటిస్ ) లేదా రేనాడ్స్ సిండ్రోమ్ వంటి రుమటోలాజిక్ లక్షణాలను కలిగి ఉంటారు. ఈ విధంగా వచ్చే కీళ్ల నొప్పులు చాలా నెలలు లేదా సంవత్సరాల పాటు బాదిస్థాయి.

మీ ఆరోగ్య సమస్య గురించి ఆందోళన లో ఉన్నారా?

చికన్‌గున్యా యొక్క నివారణ చర్యలు

చికన్ గున్యా నివారణకు టీకా లేదా చికిత్స లేనందున నివారణ చర్యలు చాలా ముఖ్యమైనవి. ఈ వైరస్ వ్యాధి బారిన పడకుండా ఉండటానికి కొన్ని నివారణ చర్యలు పాటించడం తప్పనిసరి.

  • చికెన్‌గున్యా ఎక్కువగా దోమల వల్ల వస్తుంది కాబట్టి ముందుగా వాటిని నివారించుకోవడం చాలా అవసరం.
  • కాయిల్స్, ఏరోసోల్స్, లిక్విడ్ వేపరైజర్లు మరియు ఇతర ఉత్పత్తుల రూపంలో ఉన్న దోమల వికర్షకాలను వాడడం.
  • ఇంట్లో, ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడం
  • నీటిని నిల్వ చేసే తొట్టెలు, ట్యాంకులు, పాత్రలను మూసి ఉంచడం
  • ఇంట్లోకి దోమలు రాకుండా సాయంత్ర సమయాల్లో తలుపులు, కిటికీలు వేసుకోవడం
  • ప్రతి వారం కూలర్లు, నీరు నిల్వ ఉన్న ఇతర ప్రదేశాలలో శుభ్రం చేయడం లేదా  మార్చడం 
  • క్రమం తప్పకుండా మన పరిసరాలను శుభ్రం చేసుకుంటూ ఉండాలి అలాగే దోమల వృద్ధిని నివారించడానికి ప్రయత్నించాలి
  • దోమల నుంచి రక్షణ పొందటానికి పొడవాటి చేతుల చొక్కాలు, ఫ్యాంట్లు మరియు సాక్స్‌లు వంటి వాటిని ఉపయోగించడం
  • పడుకునేపటప్పుడు కాళ్లు, చేతులు, శరీరాన్ని కవర్ చేసుకోవడం
  • ఎట్టి పరిస్థితుల్లోనూ డ్రైనీజీల నుంచి నీటిని బయటికి రానీయకుండ తగు జాగ్రత్తలు పాటించడం
  • ఏసీలేని గదుల్లో దోమతెరలను వాడడం
  • పూలకుండీలు, డ్రమ్ములు, డబ్బాల్లో నీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం.
  • చికున్ గున్యా వల్ల శరీరం డీహైడ్రేషన్ కు గురవుతుంది కావున శరీరాన్ని ఎల్లప్పుడు హైడ్రెట్ గా ఉంచుకోవడం కోసం నీటిని, పండ్ల రసాలను ఎక్కువగా  తీసుకోవడం
  • డాక్టర్ సలహా లేనిదే పెయిన్ కిల్లర్లను వాడకాన్ని దూరంగా ఉండాలి
  • విటమిన్ సి అధికముగా ఉండే పండ్లు రోగనిరోధక  వ్యవస్థ యొక్క పనితీరును మెరుగుపరుస్తాయి. కావున నారింజపండ్లు, జామపండ్లు, చిలగడ దుంపలు, నిమ్మపండు మరియు బొప్పాయిపండ్లు  వంటి వాటిని ఎక్కువగా తీసుకోవడం
  • చికెన్ గున్యా నుంచి కోలుకునే వరకు నిర్జలీకరణ కారకమైన ద్రవాలైన మద్యపానం, కాఫీ లేక టీ వంటి వాటిరి దూరంగా ఉండాలి
  • డెంగ్యూ వచ్చిన వారు సమతుల్య ఆహారం మరియు తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారాలను మాత్రమే తీసుకోవడం ఉత్తమం
  • నూనె, కొవ్వు పదార్ధాలు, కార్బోనేటేడ్ పానీయాలు మరియు కెఫిన్ ను తీసుకోకూడదు. వీటితో పాటు కారంగా ఉండే ఆహారాలు మరియు మాంసాహారాలను మానుకోవడం ఉత్తమం.

నవజాత శిశువులు, 65 ఏళ్లు దాటిన వృద్ధులు మరియు గర్భిణీలు, మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బు దీర్ఘకాలక వ్యాధులకు చికిత్స పొందుతున్న వారు, రక్తహీనతతో బాధపడుతున్న వారిలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కావున ఇలాంటి వారు వ్యక్తులు వైరస్ నుంచి మరింత తీవ్రమైన సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉంది. చికన్ గున్యాతో బాధపడుతున్న వారు ఏ ఇతర రకాలైన నొప్పి నివారణ మాత్రలను ఎట్టి పరిస్థితూల్లోనూ వాడకూడదు. చికన్ గున్యా సోకిన వారు పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా 3 రోజులకు మించి జ్వరం ఉంటే మాత్రం వెంటనే వైద్యులను సంప్రదించి తగు చికిత్స చేయించుకుని మందులు వాడితే త్వరగా తగ్గిపోతుంది. అంతే కాకుండా ఎవరికి వారు స్వీయ జాగ్రత్తలు పాటించడం ద్వారా చాలా వరకు చికెన్ గున్యా జ్వరంను బారిన పడకుండా జాగ్రత్త పడొచ్చు.

మీ ఆరోగ్య సంరక్షణ గురించి ఏవైనా సందేహాలు ఉన్నాయా? సహాయం చేయడానికి మేము సిద్దంగా ఉన్నాము! మా అనుభవంతులైన నిపుణుల సలహా కొరకు +919513262681 మాకు కాల్ చేయగలరు.

About Author –

Dr. Hari Kishan Boorugu, Consultant Physician & Diabetologist, Yashoda Hospitals, Hyderabad

About Author

Dr. Hari Kishan Boorugu | yashoda hospitals

Dr. Hari Kishan Boorugu

MD, DNB (Internal Medicine), CMC, Vellore

Consultant Physician & Diabetologist