తల్లిపాల వలన శిశువుకు, తల్లికి కలిగే ప్రయోజనాలు

తల్లిపాల వలన శిశువుకు, తల్లికి కలిగే ప్రయోజనాలు

ప్రతి సంవత్సరం చిన్నపిల్లలకు తల్లి పాల వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించాలని ప్రపంచ దేశాలు నిర్ణయించాయి. ఆగస్ట్ మొదటి వారాన్ని బ్రెస్ట్ ఫీడింగ్ వీక్‌ గా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 

తల్లీ, బిడ్డ మధ్య అనుబంధాన్ని పెంచేవి తల్లి పాలు. పోషకాహారం పిల్లలకు చాలా మంచిది. తల్లి పాలు వాళ్లకు సమతుల్య పోషకాలు అందిస్తాయి. కావాల్సిన విటమిన్స్, ప్రోటీన్స్, ఫ్యాట్ వంటివి తల్లిపాల వల్లే పిల్లలకు లభిస్తాయి.

  • తల్లిపాలు శిశువులకు ఆరోగ్యం.
  • తల్లిపాలు శిశువుకు అత్యంత సురక్షితం.
  • శిశువుకు సంపూర్ణ పౌష్టికాహారం.
  • బిడ్డకు ముఖ్యంగా తల్లిపాలు ఇవ్వాలి. అందువల్ల బిడ్డకు కావాల్సిన అన్ని పోషకాలూ-విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ లభిస్తాయి. పసిపిల్లలకు అవి ఎంతో శ్రేష్ఠమైనవి.
  • తల్లి పాలు తాగితే పిల్లలు ఎంత బరువు ఉండాలో అంతే ఉంటారు. అధిక బరువు, అసలు బరువు లేకపోవడం వంటి సమస్యలు ఎక్కువగా రావు.
  • తల్లిపాలు తాగుతూ పెరిగే పిల్లలకు భవిష్యత్తులో డయాబెటిస్, ఒబెసిటీ సమస్యలు రాకుండా ఉంటాయి. అందువల్ల ప్రతి తల్లీ, బిడ్డ పుట్టిన ఏడాదిన్నర పాటూ తన పాలు పట్టించడం ఎంతో మేలు.
  • రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
  • సంపూర్ణ ఆరోగ్యంతో, చురుకుగా ఉంటారు.
  • తల్లి బిడ్డల మధ్య అనుబంధం పెరుగుతుంది.
  • బిడ్డకు పాలు ఇచ్చే తల్లి కూడా బలమైన ఆహారం తీసుకోవాలి. ఆమె ఒత్తిడి లేకుండా సంతోషంగా ఉన్నప్పుడే, బిడ్డకు సరైన పాలు ఇవ్వగలదు. అందువల్ల తల్లి పోషకాలు ఉండే ఆహారం తీసుకోవాలి.

 

Breast feeding benefits

తల్లిపాలు శిశువుకు ఎన్ని నెలల వరకు ఇవ్వాలి?

ముఖ్యంగా బిడ్డ పుట్టిన మొదటి ఆరు నెలలూ తల్లిపాలు తప్పనిసరి. ఇవి శిశువుకు తేలికగా జీర్ణం అవుతాయి. ఆ తర్వాత మరో సంవత్సరం పాటూ పట్టిస్తే మంచిది అని పీడియాట్రిషియన్స్, అబ్స్‌టెట్రిషియన్స్ మరియు గైనకాలజిస్ట్స్ నిపుణులు తెలిపారు. ఆరు నెలల నుంచి శిశువుకు తల్లిపాలతో పాటు ఇతర ఆహారాలను కూడా అలవాటు చేయాలి. ఇది శిశువు ఆరోగ్యకరమైన ఎదుగుదలకు తోడ్పడుతుంది.

తల్లికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు:

  • బిడ్డకు పాలు ఇవ్వడం వల్ల తల్లికి కూడా మంచిదే. ప్రధానంగా ఆమెలో అధిక కేలరీలు తగ్గేందుకు వీలవుతుంది. ప్రెగ్నెన్సీ సమయంలో లావుగా అయ్యే తల్లులు, ఆ తర్వాత సన్నబడేందుకు బిడ్డకు పాలు ఇవ్వడం ఎంతో మేలు చేస్తుంది. వ్యాయామాలు చేస్తూ, సమతుల ఆహారం తీసుకుంటే తల్లి అధిక బరువు తగ్గించుకునేందుకు వీలవుతుంది.
  • తల్లి బిడ్డకు పాలు ఇవ్వడం వల్ల ఆక్సిటోసిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. అది తల్లి ఆరోగ్యానికి మంచిది.
  • బిడ్డకు పాలు ఇవ్వటం ద్వారా తల్లి ఆరోగ్యానికి చాలా మంచిది. బ్రెస్ట్ క్యాన్సర్ వంటి  ఇతర వ్యాధులు రాకుండా చేస్తుంది.
  • పసిపిల్లల తల్లులు పోషకాహారం తీసుకుంటూ ఆరోగ్యంగా ఆనందంగా ఉంటూ పసిపిల్లలకు పాలు ఇవ్వడం తల్లి బిడ్డల ఇద్దరి ఆరోగ్యానికి చాలా మంచిది. చిన్నపిల్లలు ఉన్నప్పుడు పని ఒత్తిడి తగ్గించుకోవడానికి కుటుంబ సభ్యుల సహకారం తీసుకుంటూ ఉండాలి. అవసరం అయినప్పుడు వైద్య నిపుణులను సంప్రదించాలి, వారి సలహాలను తీసుకోవాలి.

About Author –

Dr. Sarada M,

Consultant Obstetrician & Gynaecologist, Yashoda Hospitals – Hyderabad
DGO, DNB (Obs & Gyn), FRCOG (UK)

About Author

Dr. Sarada M | yashoda hospitals

Dr. Sarada M

DGO, DNB (Obs & Gyn), FRCOG (UK)

Consultant Obstetrician & Gynaecologist