ఇది తీవ్రమైన ఊబకాయంతో బాధపడుతున్న వారి శరీర బరువును తగ్గించేందుకు చేసే శస్త్రచికిత్స. అధిక శరీర బరువును వదిలించుకునేందుకు ఈ వైద్యపరమైన పరిష్కారం ఇటీవల బాగా ప్రాచుర్యం పొందింది. దీనిలో జీర్ణాశయంలో కొంత భాగాన్ని తొలగించటమో, లేదా ఆహారం చేరకుండా నియంత్రించటమో లేదా ఆహారం దానిని(జీర్ణాశయం)దాటి నేరుగా చిన్నపేవులోకి వెళ్లేట్లు మార్చటమో చేస్తారు.
అదుపు తప్పిన శరీర బరువు వివిధ అవయవాలపైన ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. తీవ్ర అనారోగ్యానికి దారితీస్తుంది. ఆయుప్రమాణాన్ని తగ్గించివేస్తున్నది.మితిమీరిన శరీర బరువు వల్ల టైప్ -2 డయాబెటిస్(మధుమేహం), గుండెవ్యాధులు, నిద్రలో శ్వాససమస్యలు, ఆస్టియో ఆర్థరైటిస్, కొన్నిరకాల కాన్సర్లు వస్తున్నాయి. మనదేశంలో ఊబకాయం, దాని వల్ల తలెత్తుతున్న సమస్యల కారణంగా ఏటా 30 నుంచి 40 లక్షల మంది మరణిస్తున్నారు. అధిక బరువు తెచ్చిపేడుతున్న ఈ ప్రమాదాలను గూర్చిసాధారణ ప్రజలలో అవగాహన , చైతన్యం పెరుగుతుండటంతో ఈ బరువు తగ్గించే(బేరియాట్రిక్) సర్జరీని ఎంచుకునే వారి సంఖ్యపెరుగుతున్నది. అందుకు అనుగుణంగా బేరియాట్రిక్ సర్జన్లు సురక్థితమైన, మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీతో మంచి ఫలితాలు సాధిస్తున్నారు.
ఊబకాయాన్నుంచి విముక్తి నాలుగు రకాల శస్త్రచికిత్సల అందుబాటులో ఉన్నాయి. అవి:
లాప్రోస్కోపిక్ గాస్ట్రిక్ స్లీవ్ రీసెక్షన్ (ఎల్.జి.ఎస్.ఆర్.): ఇది శస్త్రచికిత్స ద్వారా జీర్ణాశయంలో కొంత భాగాన్ని తొలగించి వేయటం ద్వారా దాని పరిమాణాన్ని కుదించే ప్రక్రియ. దీనిలో జీర్ణాశయం ప్రధాన వంపు నుంచి కొంత భాగాన్ని కోసి తీయటం ద్వారా మొత్తం మీద పొట్ట పరిమాణాన్ని 20-30 శాతం తగ్గిస్తారు. ఈ ఆపరేషన్ తరువాత జీర్ణాశయం అరటి పండు ఆకారంలో ఉండే ఓ గొట్టం లాగా కనిపిస్తుంది. అంటే అడ్జెస్టబుల్ గాస్ట్రిక్ బాండింగ్ కి భిన్నంగా ఇది పొట్టసైజును శాశ్వతంగా తగ్గించివేసే శస్త్రచికిత్స అన్నమాట.
రౌక్స్ – ఎన్ – వై గాస్ట్రిక్ బైపాస్: గాస్ట్రిక్ బైపాస్ లో జీర్ణాశయం పరిమాణాన్ని తగ్గించటంతోపాటు ఆహారం 3-5 అడుగుల మేరకు ప్రేవును వదిలి ముందుకు వెళ్లేట్లు చేస్తారు. ఈ శస్త్రచికిత్స తరువాత పేషంట్ ఇదివరకంత మొత్తంలో ఆహారం తీసుకోలేరు. మరోవైపు బైపాస్ (ప్రేవులో కొంత భాగాన్ని వదిలి ముందుకు వెళ్లటం) వల్ల శరీరం ఆహారంలోంచి కాలరీలను మొత్తంగా స్వీకరించలేదు.
లాప్రోస్కోపిక్ అడ్జెస్టబుల్ గాస్ట్రిక్ బాండింగ్ (ఎల్.ఎ.జి.బి): ఈ శస్త్రచికిత్సలో జీర్ణాశం పై భాగన సర్జన్ ఓ చిన్న (సిలికాన్)బాండ్ వేస్తారు. దీంతో పొట్ట పరిమాణం తగ్గి కొద్ది మొత్తంలో ఆహారం తీసుకోగానే నిండిపోతుంది. బాండ్ వల్ల ఆ వ్యక్తి తినే ఆహారం పరిమాణం తక్కువగా ఉండగానే పొట్ట నిండిన భావన కలుగుతుంది. ఆ విధంగా తక్కువ ఆహారం రూపంలో శరీరానికి అందేకాలరీలు తగ్గిపోతాయి.
డుయోడినల్ స్విచ్: దీనినే బైలోపాంక్రియాటిక్ డైవర్షన్ విత్ డుయోడినల్ స్విచ్ అని కూడా అంటున్నారు. ఇది తక్కి బేరియాట్రిక్ సర్జరీలకంటే కిష్టమైనది. దీనిలో రెండు వేర్వేరు శస్త్రచికిత్సలు చేస్తారు. వీటిలో మొదటి గాస్ట్రిక్ స్లీవ్ సర్జరీ లాగే ఉంటుంది. ఇక రెండవది వ్యక్తి తీసుకున్న ఆహారం చిన్నపేవులోని చాలా బాగాన్ని దాటేసి నేరుగా వెళ్లేట్లు చేస్తుంది. అయితే ఈ విధంగా వచ్చిన ఆహారం చిన్నపేవు చివరి భాగంలో జీర్ణరసాలు కలిసే ప్రాంతానికి చేరేట్లు జాగ్రత్త పడతారు. తక్కిన మూడు రకాల శస్త్రచికిత్సలతో పోలిస్తే ఇది అధికంగా శరీర బరువును తగ్గించుకునేందుకు సాయపడతుంది. అయితే ఈ శస్త్రచికిత్సలో సమస్యలు కూడా అధికమే. బేరియాట్రక్ సర్జరీ చేయించుకున్న వారిలో విటమిన్లు, మినరల్స్, ప్రొటీన్ల కొరత ఏర్పడినట్లు గుర్తించారు. అందువల్ల సర్జన్లు ఈ ఆపరేషన్ న అంతగా సిఫార్సుచేయరు.
లేదు. బేరియాట్రిక్ సర్జరీలు ఎవరంటే వారు చేయించుకోవటం సరికాదు. వ్యక్తి శరీరం బరువు తగ్గించే ఆపరేషనుకు అనుకూలంగా ఉందన్న అంశాన్ని నిర్ధారించు కోవటంతో సహా కొన్నిఖచ్చిమైన నిబంధనలకు లోబడి మాత్రమే శరీరం బరువును తగ్గించే శస్త్రచికిత్సలను సిఫార్సుచేస్తారు. ఇందుకుగాను సర్జన్లు బేరియాట్రిక్ సర్జరీ కోసం వచ్చిన వ్యక్తి ఊబకాయంతో బాధపడతున్నరా ముందుగా నిర్ధారించుకుంటారు. వ్యక్తి పొడవు, శరీరపు బరువు ఆధారంగా లెక్కించే బి.ఎం.ఐ.(బాడీ మాస్ ఇండెక్స్)ను బట్టి ఊబకాయాన్ని, దాని తీవ్రతను అంచనా వేస్తారు. ఈ బి.ఎం.ఐ. 25 కి.గ్రా/ఎం2 నుంచి 30కి.గ్రా /ఎం2 వరకూ ఉంటే అధిక బరువు(ఓవర్ వెయిట్)గా పేర్కొంటారు. అది 30కి.గ్రా /ఎం2 దాటితే ఊబకాయం(ఒబెసిటీ)గా పరిగణిస్తారు. బి.ఎం.ఐ. 35- 40కి.గ్రా./ఎం2 కి చేరుకుని, వ్యాయామం, ఆహారనియమాలు పాటించినా ప్రయోజనం కనిపించని, టైప్-2 డయాబెటిస్, అధిక కొలెస్ట్రాల్, నిద్రలో శ్వాస సమస్యల వంటి ఊబకాయం వల్ల వచ్చే ఇతర ఇబ్బందులను ఎదుర్కొంటున్న వారు నిస్సంకోచంగా బేరియాట్రిక్ సర్జరీని ఎంచుకోవచ్చు.
అయితే అప్పుడు కూడా వ్యక్తి వయస్సు, సాధారణ ఆరోగ్య పరిస్థి శస్త్రచికిత్సకు అనుకూలమేనా చూస్తారు. ఇందుకోసం యశోద హాస్పిటల్స్ కు చెందిన బేరియాట్రిక్ క్లినిక్ లో పేషంట్లకు ఉచితంగా కౌన్సిలింగ్ చేస్తున్నారు. సందేహాలకు సమాధానాలు ఇవ్వటంతోపాటు అదనపు బరువును వదిలించుకునే ప్రయత్నం విజయవంతం కావటానికి పేషంటుకు అవసరమైనమైన పట్టుదల ఉందా తెలుసుకుంటారు. ఈ అంశాలు సరిచూసుకున్న తరువాత పేషంటు ఆరోగ్యస్థితి, జీవనశైలి, ఊబకాయపు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని వారికి అనువైన శస్త్రచికిత్సను సిఫార్సుచేస్తారు.
ఇటీవలిప్రముఖులు కొద్దిమంది ఈ సర్జరీ చేయించుకున్న కొద్ది రోజుల్లోనే మరణించటంతో దీనికి సంబంధించి పలువురిలో అనుమానాలు,భయాలు వ్యక్తం వ్యక్తమవుతున్నాయి. కానీ బేరియాట్రిక్ సర్జరీలు సురక్షితమైన ఆపరేషన్లు. ఇతర సర్జరీలకు సంబంధించి పాటించాల్సిన జాగ్రత్తలే వీటికి వర్తిస్తాయి. శస్త్రచికిత్స తరువాత శరీరంపైన గాటుపెట్టిన చోట ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోవాలి. ఇందుకుగాను డాక్టరు సిఫార్సుచేసిన ఆంటీబయోటిక్స్ తప్పని సరిగా వాడాలి. సర్జరీ తరువాత శారీరక శ్రమ ప్రారంభం గూర్చి డాక్టరు సలహా తీసుకుని పాటించాలి. బేరియాట్రిక్ సర్జరీ వల్ల బరువు తగ్గటంతో అంతకు ముందు లావుగా ఉన్నప్పడు సాగి ఉన్న చర్మం వేళాడుతుండవచ్చు. దానిని సరిచేయటానికి సర్జరీ చేయాల్సి రావచ్చు. తిండి విషయంలో కొన్ని జాగ్రత్తలు అవసరం. ఏదైనా, ఎప్పుడైనా తినే పద్దతిని వదిలి జాగ్రత్తగా పోషకాహారాన్ని ఎంపికచేసుకోవాలి. ఆహారాన్ని బాగా నమిలి నెమ్మదిగా తినాలి. మలబద్దకం ఏర్పడకుండా చూసోకవాలి.
About Author –
Dr. M. Manisegaran, Consultant Surgical Gastroenterologist, Yashoda Hospital, Hyderabad
MS, M.Ch (GI Surgery)
Heart failure, also called congestive heart failure, is a condition that arises when the muscles…
Percutaneous Transluminal Coronary Angioplasty, or PTCA, is a minimally invasive surgery that opens blocked or…
Ankle ligaments are crucial cords that link foot bones to lower leg bones, ensuring stability…
Supermarkets today are flooded with a variety of cooking oils, each with different characteristics, such…
మాట్లాడటానికి, తినటానికి మరియు ముఖం అందంగా కనిపించటానికి నోరే కీలకం. శరీర పోషణకు అవసరమైన ఆహారం, పానీయాలు లోపలికి చేరేది…
అండాశయ తిత్తులు అనేవి అండాశయాల లోపల లేదా వాటి ఉపరితలంపై ద్రవంతో నిండిన సంచి లాంటి నిర్మాణాలు. ఆడవారికి రెండు…