కొత్త ఆశలు కలిగిస్తున్నలైవ్‌ కాలేయ మార్పిడి

కొత్త ఆశలు కలిగిస్తున్నలైవ్‌ కాలేయ మార్పిడి

దీర్ఘకాలం అంటే నాలుగైదేళ్లకంటే ఎక్కువ కాలం మద్యపానం తీసుకోవడం, హెపటైటిస్‌ బి, సి. వైరస్‌ ఇన్‌ ఫెక్షన్‌(Virus Infections) వల్ల ఎక్కువ మందికి కాలేయ వ్యాధులు(Liver Diseases) వస్తున్నాయి. ఈ కారణాల వల్ల మొదట కామెర్ల వ్యాధి(Jaundice) సోకుతుంది. వ్యాధిని గుర్తించి వెంటనే చికిత్స చేయించుకోని పక్షంలో అది కాస్తా ముదిరి కాలేయం పనితీరు తీవ్రంగా దెబ్బతింటుంది. వీటిలో హెపటైటిస్‌ ఎ(Hepatitis A,E), ఇ వైరస్‌ల వల్ల వచ్చే కామెర్లు చాలా ప్రమాదకరం. దీనిలో హఠాత్తుగా కామెర్ల వ్యాధి సోకి ప్రాణాపాయం ముంచుకువస్తుంది. కలుషితమైన నీళ్లు, తిండి వల్ల ఈ తీవ్రమైన హైపటైటిస్‌ ఎ, ఇ వైరస్‌లు శరీరంలోకి చేరుతుంటాయి. చాలా కాలం పాటు మితిమీరి మద్యపానం చేయటం వల్ల కాలేయం తీవ్రంగా దెబ్బతింటుంది. లివర్‌ సిర్రోసిస్‌ (liver cirrhosis) వ్యాధి వస్తుంది. ఊబకాయం(obesity) కూడా కాలేయ వ్యాధులకు కారణం అవుతున్నది. ఫాట్‌ సిర్రోసిస్‌(fatty liver cirrhosis) లేదా నాన్‌ ఆల్కహాలిక్‌ స్టియటోనాష్‌ ఏర్పడుతుంది. ప్రస్తుతం కాలేయ సమస్యలతో వస్తున్న వారిలో దాదాపు సగం మందిలో ఈ ఫాట్‌ స్లిర్రోసిస్‌ వ్యాధే కనిపిస్తోంది. ఫాట్‌ సిర్రోసిస్‌ బి(చివరి), సి, ఛైల్డ్‌ స్టేజ్‌ లలో కాలేయ కణాలు చాలా వరకు పనిచేయలేని స్థితికి చేరుకుంటాయి. పిల్లల్లో కనిపిస్తున్న కాలేయ వ్యాధులు చాలా వరకు పుట్టుకతో వస్తున్నవే. శరీరధర్మక్రియలకు సంబంధించినవే. విల్సన్‌ డిసీజ్‌(wilson disease), బైల్‌ డక్ట్స్‌(bile duct) లేకపోవటం, కురుపులు వంటి సమస్యలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ రకమైన సమస్యలు ఉన్న పిల్లలకు భవిష్యత్తులో కాలేయం పూర్తిగా పనిచేయలేని స్థితికి చేరుకుంటుంది.

కాలేయ మార్పిడి చికిత్స ఇదివరకు ఎన్నడూ లేని స్థాయిలో ప్రభావవంతంగా రూపొందింది. అధునాత వైద్యపరికరాలు-చికిత్సా విధానాలు అందుబాటులోకి రావటంతో ఇదివరలో అరుదైనదిగా ఉండిన ఈ లైవ్‌ లివర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ సర్జరీ(live liver transplant surgery) ఇపుడు 90-95% వరకు విజయవంతం అవుతూ దాదాపు ప్రమాదరహితంగా మారింది. అంతర్జాతీయ వైద్యసంస్థలు, అభివ ద్ధి చెందిన దేశాలలోని వైద్యకేంద్రాలలో పనిచేసిన అనుభవంతో స్వదేశానికి తిరిగి వచ్చిన సూపర్‌ స్పెషలిస్టులతో కూడిన వైద్య బృందం సహకారంతో యశోద ఆస్పత్రులలో(Yashoda Hospitals) ఈ శస్త్రచికిత్స హైదరాబాదులోనే అందుబాటులోకి వచ్చింది. దక్షిణభారత దేశంలో కాలేయ మార్పిడి ఆపరేషన్ల నిర్వహణకు సంబంధించి యశోద ఆస్పత్రులు కొత్త ఒరవడిని ప్రవేశపెట్టాయి. వయోజనులు, పిల్లలకు ‘లైవ్‌ డోనార్‌, కెడావరిక్‌ డోనార్‌(Live donor, cadaveric donor) కాలేయాలతో విజయవంతంగా కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలు చేస్తున్నారు. వివిధ వైద్యవిభాగాల స్పెషలిస్టులతో కూడిన ‘కాలేయమార్పిడి’ నిపుణుల ప్రత్యేక వైద్య బృందం అత్యంత అధునాతనమైన హెపా-ఫిల్టర్డ్‌ ఆపరేషన్‌ థియేటర్లలో(hepa filter operation theatre) కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలు చేస్తోంది. యశోద హాస్పిటల్స్‌ లో ప్రత్యేకమైన లివర్‌ ఇంటెన్సివ్‌ కేర్‌(ఐ.సి.యు), పో స్ట్‌ ఆపరేటివ్‌ కేర్‌ యూనిట్లను ఏర్పాటు చేశారు. దాదాపు రెండు వేల ఏడు వందలకు పైగా కాలేయ మార్పిడి సర్జరీలు చేసిన అనుభవం గల సర్జన్లు స్థానికంగా అందుబాటులో ఉంటున్నారు. దీనివల్ల ఈ శస్త్రచికిత్సకు అయ్యే ఖర్చు దేశంలోని ఇతర వైద్య సంస్థలు, ఆస్పత్రులతో పోల్చినపుడు దాదాపు సగానికి తగ్గుతున్నది. ఈ కారణంగా దేశవిదేశాల నుంచి వ్యాధిగ్రస్తులు కాలేయమార్పిడి ఆపరేషన్లకు ఈ ఆస్పత్రులకు వస్తున్నారు.

కాలేయ వ్యాధులు సోకినపుడు ముందుగానే గుర్తించగలిగితే కాన్సరుతో సహా కాలేయ వ్యాధులను సర్జరీల అవసరం లేకుండా కేవలం మందులతో చికిత్సచేసి నయం చేయటానికి వీలవుతుంది. కానీ దీర్ఘకాలం నిర్లక్ష్యం చేస్తే మాత్రం పరిస్థితి చేజారిపోయే ప్రమాదం ఉంటుంది. అయితే కాలేయపు అసాధారణ పని సామర్థ్యం కారణంగా వ్యాధులు సోకినా లక్షణాలు వెల్లడి కావటానికి పది నుంచి ఇరవై సంవత్సరాల వరకు కూడా సమయం పడుతుంది. సుదీర్ఘమైన ఈ సమయంలో కాలేయ కణాలు క్రమంగా మృతి చెందుతూ ఉంటాయి. దీంతో లివర్‌ స్కార్‌(liver scarring) ఏర్పడుతుంటుంది. ఈ స్కార్‌ పూర్తిగా కాలేయాన్ని కప్పివేసేటప్పటికి రోగలక్షణాలు స్ఫష్టంగా బయటపడతాయి. అప్పటికే వ్యాధి ముదిరిపోతుంది. ఈ పరిస్థితికి చేరేలోగా కాలేయానికి తీవ్రమైన వ్యాధులు సోకాయని సూచించే లక్షణాలు కొన్ని కనిపిస్తాయి. అవి: -కళ్లు పచ్చగా మారతాయి. -విడువని దురదలు బాధపెడుతుంటాయి. -ఆకలి మందగిస్తుంది. -నీరసంగా ఉండి ఎప్పుడూ నిద్రపోతుంటారు. -కడుపులో వికారంగా అనిపిస్తుంటుంది. -ఏకాగ్రత కుదరదు. -జ్ఞాపకశక్తి మందస్తుంది. -చివరకు కోమాలోకి జారిపోతారు.

ముందస్తు పరీక్షలు ఉత్తమం కాలేయ కాన్సరుకు దారితీయగల ప్రమాదం ఉన్న (దీర్ఘకాల మద్యపానం, వైరస్‌ వ్యాధులు సోకినవారు, ఫాటీలివర్‌(fatty liver) వ్యాధి ఉన్న వారు)ఈ లక్షణాలు పూర్తిగా బయటపడే దాకా వేచి ఉండకుండా ముందస్తుగా పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. రక్తపరీక్ష, ఫైబ్రోస్కాన్‌ (ట్రాన్సియంట్‌ ఎలాస్టోగ్రఫీ) చేయించుకోవటం ద్వారా కాలేయ కాన్సరును తొలిదశలలోనే గుర్తించవచ్చు. వ్యాధుల వల్ల కాలేయానికి జరిగిన నష్టాన్ని బట్టి దానిని తీవ్రతను మూడు స్థాయిలుగా గుర్తిస్తారు. వీటిని ఎ, బి, సి. ‘ఛైల్డ్‌ పగ్‌ స్టేజెస్‌’ అంటున్నారు. ‘ఎ’ ఛైల్డ్‌ స్థాయిలోనే డాక్టర్‌ వద్దకు రాగలిగితే మందులతో, అలవాట్లలో మార్పులతో చికిత్సచేసి పూర్తి సాధారణ పరిస్థితిని పునరుద్ధరించవచ్చు. మొదటి రెండు (ఎ.బి. ఛైల్డ్‌ స్టేజెస్‌)స్థాయిల్లోనూ కాలేయం చాలా వరకు తిరిగి కోలుకోవటానికి అవకాశం ఉంటుంది. కాలేయం పరిస్థితి పూర్తిగా దిగజారిన దశతో పోలిస్తే ఈ మొదటి దశలో చికిత్సకు అయ్యే ఖర్చు కేవలం పది శాతాన్ని మించదని అంచనా. దురదృష్టవశాత్తు మనదేశంలో కాలేయ వ్యాధిగ్రస్తులలో అత్యధికులు ‘బి’ నుంచి ‘సి‘ ఛైల్డ్‌ స్టేజికి మారేదశలో, ‘సి‘ చివరి దశలో ఆస్పత్రులకు వస్తున్నారు. 

అందుబాటులో ఆధునిక చికిత్సలు

కాలేయ కాన్సర్‌ అంటే ఇదివరకు డాక్టర్లలో కూడా దాదాపు 90 శాతం మందికి మరణమే అనే భావన ఉండేది. కానీ ఇపుడు పరిస్థితి మారింది. ఇందుకు అవసరమైన అత్యాధునిక శస్త్ర చికిత్స, సర్జరీలతో కాన్సర్‌ కణుతులను విజయవంతంగా తొలగించటం సాధ్యమవుతున్నది. కాన్సర్‌ కణితి 3 నుంచి 5 సెంటీమీటర్ల వరకూ ఉంటే ఆర్‌.ఎఫ్‌.ఎ., టిఎసిఇ వంటి సర్జరీయేతర చికిత్స చేస్తారు. వీరిలో 90శాతం మంది కోలుకుంటారు. అయితే వీరిలో 2,3 సంవత్సరాలలో మళ్లీ కాన్సర్‌ వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల క్రమం తప్పకుండా డాక్టరుకు చూపించుకుంటూ ఉండాలి. అవసరమైనపుడు ఆ చికిత్సలను కొనసాగించి కాన్సర్‌ కణుతులను అదుపుచేస్తారు. ‘బి’ నుంచి తరువాతి స్థాయికి మారుతున్న స్థితిలో వచ్చిన వారికి, ‘సి‘ ఛైల్డ్‌ స్థాయి పూర్తిగా ముదరని దశలో వచ్చిన వారికి కాలేయ మార్పిడి చేసి రక్షించవచ్చు. ఇటువంటి కేసులలో తొంబై అయిదు శాతం వరకు కూడా కాలేయమార్పిడి సర్జరీలు విజయవంతం అవుతున్నాయి. ఇటీవలి సంవత్సరాలలో కాలేయ వ్యాధుల చికిత్స అపూర్వమైన ఆధునికతను సంతరించుకుంది. వ్యాధి నిర్ధారణ పరీక్షలు, శక్తివంతమైన మందులు, ఖచ్చితమైన శస్త్రచికిత్సలు, కాలేయ మార్పిడి సర్జరీలు అత్యధిక శాతం విజయవంతం అవుతుండటం కాలేయ వ్యాధుల నుంచి నమ్మకమైన ఉపశమనం కలిగిస్తున్నాయి. ఇప్పుడున్న అత్యాధునిక సౌకర్యాలతో కాలేయమార్పిడి అవసరమైనప్పుడు ఏమాత్రం ఆలస్యం లేకుండా సర్జరీలు నిర్వహించేందుకు వీలు కలుగుతున్నది. అదే సమయంలో ఈ శస్త్రచికిత్సకు అయ్యే ఖర్చు దేశంలోని ఇతర వైద్య సంస్థలు, ఆస్పత్రులతో పోల్చినపుడు ఏభై శాతానికి తగ్గుతున్నది. 

కాలేయ మార్పిడి

వ్యాధిగ్రస్థమై పనిచేయలేని స్థితిలో ఉన్న కాలేయాన్ని తొలగించి దాని స్థానంలో ఆరోగ్యకరమైన మరో కాలేయాన్ని అమర్చటానికి చేసే సర్జరీనే కాలేయ మార్పిడి మార్పిడి (లివర్‌ ట్లాన్స్‌ ప్లాంటేషన్‌) శస్త్రచికిత్స. కాలేయ మార్పిడిలో రెండు పద్ధతులు ఉన్నాయి. మొదటిది, మరణించిన దాత(కెడావరిక్‌ డోనార్‌) దేహం నుంచి సేకరించిన దానిని అవసరమైన వారికి అమర్చటం. ఇక రెండో పద్ధతి ఆరోగ్యకరమైన కాలేయం ఉన్న వ్యక్తి ఎవరైనా తన కాలేయంలోని కొంత భాగాన్ని దానం చేయటం. మరణించిన దాత నుంచి కాలేయం పొందటానికి కాలేయ మార్పిడి అవసరమైన వ్యక్తులు రాష్ర్ట ప్రభుత్వ నిర్వహణలో ఉన్న జీవన్‌ దాన్‌ సంస్థలో పేరునమోదుచేసుకోవాలి. తమ వంతు వచ్చేంత వరకూ వేచి చూడాల్సి ఉంటుంది. అయితే అవయవదానం చేసే కుటుంబాల సంఖ్య తగినంతగా ఉండటం లేదు. ఫలితంగా మరణించిన దాత నుంచి కాలేయం పొందటానికి ఎక్కువ వ్యవధి అవసరం అవుతుంటుంది. కానీ సజీవ దాత నుంచి కాలేయం పొందే విధానం ఇందుకు పూర్తిగా భిన్నమైనది. పూర్తి ఆరోగ్యంతో ఉన్న కుటుంబసభ్యులు, రక్తసంబంధీకులు ఎవరైనా తమ కాలేయంలో నాలుగోవంతు భాగాన్ని దానం చేయవచ్చు. ఈ విధానంలో కాలేయాన్ని పంచుకున్న వ్యక్తికి దానివల్ల భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు తలెత్తే అవకాశంలేదు. అందువల్ల బంధువులు ఎవరైనా ముందుకు రావటానికి అవకాశం ఏర్పడుతుంది. జీవన్‌ దాన్‌ కింద కాలేయం కేటాయింపు కోసం ఎదురుచూడకుండా కాలేయమార్పిడి సర్జరీ చేయించుకొని సాధారణ జీవితం గడిపేందుకు అవకాశం కలుగుతుంది. దీంతో లైవ్‌ డోనార్‌ ట్రాన్స్‌ ప్లాంట్‌ సంఖ్య వేగంగా పేరుగుతున్నది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో జరుగుతున్న కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలలో దాదాపు అరవై శాతం సజీవ దాతల కాలేయ దానం ఆధారంగా జరుగుతున్నవే. 

ఎవరు దానం చేయొచ్చు?

మన శరీరంలో పునరుత్పత్తి చేసుకుని పూర్తిగా పూర్వపు పరిమాణం పొందగశక్తి గల అవయవం కాలేయం మాత్రమే. అందువల్ల రక్తసంబంధీకులతో సహా ఏ వ్యక్తి అయినా కాలేయాన్నిదానంచేయవచ్చు. అయితే ఆ వ్యక్తి రక్తపు గ్రూపు, ఆరోగ్య పరిస్థతిని పరిశీలించిన తరువాత అది స్వీకర్తకు సరిపడుతుందన్న అంశాన్ని వైద్యనిపుణులు నిర్ధారిస్తారు. మద్యపానానికి – మత్తుమందుల(డ్రగ్స్‌)కు అలవాటు పడిన వారు, సంక్రమణవ్యాధుల(infections) సోకిన, గుండె – ఊపిరితిత్తులు- నాడీ సంబంధిత వ్యాధులు ఉన్న వారి నుంచి కాలేయాన్ని దానంగా స్వీకరించటాన్ని వైద్యులు అనుమతించరు. ఈ రకమైన ఆరోగ్య సమస్యలు లేని, ఏభై సంవత్సరాలకు లోపు వయస్సు ఉన్న రక్త సంబంధీకులు ఎవరైనా ఈ విధంగా కాలేయ దానం చేయవచ్చు. ఆప్తులు – బంధువుతో కాలేయం పంచుకున్నందు వల్ల దీర్ఘకాలంలో ప్రత్యేకంగా ఎటువంటి మందులు వాడాల్సిన అవసరం రాదు. ఈ కారణంగా ఇతర ఆరోగ్యసమస్యలు ఏమీ తలెత్తవు. పైగా దాత, స్వీకర్త ఇద్దరిలోనూ 6-8 వారాలలో కాలేయం పూర్తిస్థాయికి అభివృద్ధి చెందుతుంది. 

ఆధునిక సౌకర్యాలతో విజయవంతమవుతున్న చికిత్సలుఎవరికి చేస్తారు?

లైవ్‌ కాలేయ మార్పిడి సర్జరీ చేయటానికి నిర్ణయం జరిగిన తరువాత వైద్య నిపుణులు ఆ వ్యక్తి శారీరకంగా, మానసికంగా కాలేయ మార్పిడి శస్త్రచికిత్సను తట్టుకోగలడా నిర్ధారించుకునేందుకు అవసరమైన పరీక్షలు చేయిస్తారు. తగిన కాలేయ దాతను ఎంపికచేసుకోవటానికి ముందుగా దాతకు కూడా పరీక్షలు అవసరం అవుతాయి. సాధారణ ఆరోగ్య పరిస్థితిని పరిశీలించేందుకు ఎక్స్‌ రే, అల్ట్రాసౌండ్‌, లివర్‌ బయాప్సీ, గుండె-శ్వాసకోశాల పరీక్షలు, కొలనోస్కోపీ, దంతపరీక్షలు చేయిస్తారు. మహిళల విషయంలో పాప్‌ టెస్ట్‌, గైనకాలజీ – మామ్మోగ్రామ్‌ పరీక్షలు చేయిస్తారు. అయితే చికిత్సకు లొంగని సంక్రమణ వ్యాధులతో బాధపడుతున్నా, శరీరంలోని ఒక అవయవం దగ్గర మొదలైన కాన్సర్‌ ఇతర భాగాలకు వ్యాపిస్తున్నట్లు (మెటాస్టాటిక్‌ కాన్సర్‌) గుర్తించినపుడు, తీవ్రమైన గుండెవ్యాధులు ఉన్నప్పుడు, మద్యం అలవాటు మానలేని స్థితిలో ఉన్నప్పుడు కాలేయ మార్పిడి సర్జరీ చేయించుకోవటానికి అనుమతించరు. 

ఎలా చేస్తారు?

వ్యాధిగ్రస్థమై పనిచేయలేని స్థితిలో ఉన్న కాలేయాన్ని తొలగించి దాని స్థానంలో సజీవదాత నుంచి సేకరించిన ఆరోగ్యకరమైన మరో కాలేయాన్ని అమర్చటమే లైవ్‌ లివర్‌ ట్రాన్స్‌ ప్లాంట్‌ సర్జరీ. దీనిలో దాత నుంచి కాలేయంలో కొంతభాగం(దాదాపు 25 శాతం) సేకరించి అమరుస్తారు. వ్యాధిగ్రస్థ వ్యక్తి, కాలేయం దానం చేయటానికి ముందుకు వచ్చిన బంధువు (లైవ్‌ డోనార్‌) ఇద్దరికీ వేర్వేరు ఆపరేషన్‌ థియేటర్లలో ఒకేసారి సర్జరీ చేస్తారు. కాలేయ మార్పిడి ఆపరేషను పూర్తికావటానికి నాలుగు నుంచి పద్నాలుగు గంటల వరకూ సమయం పడుతుంది. డాక్టర్ల బృందం ఒకటి వ్యాధిగ్రస్థుడి శరీరం నుంచి పనిచేయని కాలేయాన్ని తీసివేస్తుంటే మరో వైద్యుల బృందం మంచి కాలేయాన్ని మార్పిడికి సిద్ధం చేస్తుంటుంది. ఇవి పూర్తికాగానే ఆరోగ్యవంతమైన కాలేయాన్ని వ్యాధిగ్రస్థుడిలో అమర్చే సర్జరీ జరుగుతుంది. తీసివేసిన కాలేయం స్థానంలో ఆరోగ్యవంతమైనదానిని అమర్చి రక్తనాళాలు, బైల్‌ డక్ట్స్‌ ను కలుపుతారు. మార్చిన కాలేయంలోకి రక్తప్రవాహం ప్రారంభమవుతుంది. ఈ విధంగా కాలేయంలో కొంత భాగాన్ని పంచుకున్నప్పటికీ దాతలు తక్కిన కాలేయ భాగంతో ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపగలుగుతారు. కొద్ది వారాలలోనే దాత కాలేయం పూర్వపు పరిమాణానికి పెరుగుతుంది. అదే సమయంలో స్వీకర్తలో కూడా కాలేయం పూర్తిస్థాయికి ఎదుగుతుంది.

Originally published: https://m.ntnews.com/article/news-detail/429283