హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఏమిటి మరియు లక్షణాలు ఎలా ఉంటాయి

హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఏమిటి మరియు లక్షణాలు ఎలా ఉంటాయి

హార్ట్ ఫెయిల్యూర్ అనగానే గుండె పనిచేయడం నిలిచిపోతుందన్న  అభిప్రాయం చాలా మందిలో ఉంది కానీ అది నిజం కాదు. గుండె ఆరోగ్యంగా ఉన్నపుడు వ్యక్తి శరీర భాగాలకు రక్తాన్ని పంప్ చేసిన దాని శక్తి బాగా తగ్గిపోతుంది. అందుకోసం సంకోచావ్యకోచాలు జరిపే సామర్ద్యం క్షినిస్తుంది హార్ట్ ఫెయిల్యూర్ వల్ల గుండె చాంబర్లలో రక్తం కదలిక మందగిస్తుంది. మరోవైపు గుండెలో వత్తిడి పెరుగుతుంది. శరీర బాగాలకు ఆక్సిజన్, పోషకాలు ఉన్న రక్తాన్ని సరఫరచేయడం సాధ్యపడదు. తగ్గిన పంపింగ్ సామర్ద్యాన్ని పుడ్చుకోవడానికి ప్రయత్నిస్తూ గుండె గదులు వ్యాకోచించి మరింత రక్తాన్ని నింపుకోవటం ప్రారంభిస్తుంది మొదట్లో ఇది గుండెలో రక్తం కదలికను పెంచుతుంది. కానీ కొద్దీ రోజులకు గుండె కండరాల గోడలు బలహినపడుతయి. వత్తిడితో రక్తాన్ని పంపింగ్ చేయలేవు ముత్ర పిండాలు శరీరంలో సోడియంతో కూడిన ద్రవాలను విడుదలచేయడం ప్రారంభిస్తాయి. ఫలితంగా చేతులు, కాళ్ళు, చిలమండాలు, ఉపిరితిత్తులు తదితర అంగాలలో నిరు నిలువచేరుతయి. ఇది హార్ట్ ఫెయిల్యూర్కు దారితీస్తుంది. మారో విదంగా చెప్పాలంటే హార్ట్ ఫెయిల్యూర్ అనేది ప్రాదమికంగా అవసరాల మేరకు గుండె శరీర కణజాలానికి రక్తాన్ని సరఫరచేయలేక పోవటం వల్ల పోషకాలు అందకపోవటం, రక్తనాలాలలో నిదిపో యి రద్దీ ఏర్పడటం. ఈ స్థితి వ్యక్తి శరీరం ఆ లోటును ఎదుర్కొనేందుకు ప్రతిస్పందిస్తుంది. దీనిని న్యూరోహర్మోనల్ అక్ట్టివేషణ్ అంటారు. చివరకు ఇది ఆరోగ్యానికి తీవ్రహాని కలిగిస్తుంది. 

హార్ట్ ఫెయిల్యూర్ లక్షణాలు:

  • శ్యాస తగ్గుతుంది, కష్టంగా మారుతుంది.
  • కళ్ళు, చిలమండలు, పొట్ట వాచుతుంది.
  • పడక పైన పడుకోవడం కష్టమవుతుంది.
  • నాడి స్పందన అస్థవ్యస్తంగా తయారవుతుంది.
  • విపరీతమైన ఆలసట అనిపిస్తుంది.
  • రాత్రివేళా తరచూ మూత్రానికి వెళ్ళవలసి వస్తుంది.

హార్ట్ ఫెయిల్యూర్ ను గుర్తించటం ఎలా ?

కొన్ని సార్లు మహిళల్లో ప్రేగ్నేస్సి సమయాల్లోనూ, డెలివరి సమయంలోను గుండె తీవ్రమైన అనారోగ్యానికి గురి అవుతారు. ఏ మాత్రం తీవ్ర అసౌకర్యనికి గురైన ముందుగా మంచి ఆసుపత్రిలో కార్దియలజిస్ట్ ను కలవడం ద్యార ముందుగా గుర్తించి, హార్ట్ ఫెయిల్యూర్ కాకుండా కాపాడుకోవచ్చు హార్ట్ ఫెయిల్యూర్ అవడానికి అనేక కారణాలు ఉంటాయి.అధిక రక్త పోటు, మధుమేహం, కరోనారి డిసీజ్ వల్ల గుండెకు చాలా నష్టం జరుగుతుంది. వల్యులార్ డిసిజేస్, జనటిక్ మజిల్ డిజర్దర్, మితిమీరిన మద్యపానం, స్థూలకాయం, వాపులు, సంక్రమణ వ్యాదుల వంటి కారణాలు కూడా గుండెను దెబ్బదీస్తాయి. వీటి వల్ల గుండె రెండు విధాల నష్టపడుతుంది. మొదటిది గుండె పంపింగ్ సామర్ద్యం క్షినిస్తుంది ( సిస్టోలిక్ హార్ట్ ఫెయిల్యూర్ ). రెండొవది దాని కండరాలు గట్టి పడటం (దయస్తోలిక్ హార్ట్ ఫెయిల్యూర్). ఈ కారణాలు వేటివల్లైన ఈ రెండు కారణాల వల్ల హార్ట్ ఫెయిల్యూర్ జరగవచ్చు.కొందరు  వ్యాదిగ్రస్తుల గుండె రెండు రకాల హార్ట్ ఫెయిల్యూర్ల ను ఎదుర్కొంటుండవచ్చు. రోగులు ఆలసిపొయినప్పుడు పడుకున్నప్పుడు శ్వాస అందకపోవటం, మితిమీరిన అలసట, ఒళ్ళు వాపు వంటి లక్షణాలు, వివిధ పరీక్షలు జరుపడం ద్యారా హార్ట్ ఫెయిల్యూర్ లను నిర్దారించవచ్చు. సాదారణంగా ఈ వ్యాదిని గుర్తించడానికి హెమో గ్రామ్ సెక్రేటినైస్, ధైరాయిడ్ పనితీరు, ఎలక్ట్రోలైట్స్ రక్తంలో చక్కర, బి. ఎస్.పి.ఇసిజి ఎలక్ట్రో కార్డియోగ్రఫీ వంటి నిర్దారణ పరీక్షలు జరుపుతారు. కొన్ని సార్లు కార్డియాక్ ఎం.ఆర్.ఐ పెట్ స్కాన్, మాయోకండ్రియాల్  బయప్సి వంటి మరింత ఆధునిక పరీక్షలు చేయించాల్సి వస్తుంది.

అన్ని వ్యాదుల విషయంలో లాగానే హార్ట్ ఫెయిల్యూర్ ను కూడా ముందు జాగ్రత్తలతో నిరోదించగల్గటమే ఉత్తమం. అధిక రక్తపోటు, మధుమేహం ఈ గుండెవ్యాది రావటానికి ప్రధాన కారణాలు. అందువల్ల ప్రాథమిక స్థాయిలోనే పోషకాలతో కూడిన పరిమిత ఆహారాన్ని తీసుకోవటం, తగినంత వ్యయమం చేయటం, స్టులకయం ఏర్పడకుండా జగ్రతపడటం హార్ట్ ఫెయిల్యూర్ వ్యాదిని అరికట్టడానికి తోడ్పడుతాయి. అధిక రక్తపోటు, మధుమేహం, డైస్లిపిడేమియా (రక్తంలో కొలెస్ట్రాల్, ట్రేగ్గిజరైడ్స్ వంటి లిపిడ్స్ శాతం విపరీతంగా పెరిగిపోవటం) వంటి వ్యాధులు ఉన్నట్లు నిర్దారణ అయితే వెంటనే చికిత్స ప్రరంభిచాలి. ఆ వ్యాదులను తగ్గించేదుకు సంభందించి నిర్దిష్ట లక్షలతో ఈ చికిత్సను కొనసాగించాలి. జనాభాలో అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ ఉన్న వారిని గుర్తించేందుకు ఎప్పటికప్పుడు నిర్దారణ పరీక్షలను నిర్వహించడం ద్యారా ఆ వ్యాధులకు చికిత్సను వెంటనే ప్రరంభించేదుకు వీలు కలుగుతుంది. మధుమేహం, అధిక రక్తపోటు వంటి పలు కారణాల వల్ల కరోనారి డిసీజ్ వస్తుంది. అది గుండెపోటుకు, గుండె బలహినపడటానికి, అంజైనాలకు దారితీస్తుంది. దీనిని ముందుగా కనిపెట్టగలిగితే గుండెకు జరుగగల తీవ్ర నష్టాన్ని నిలుపవచ్చు. వ్యాది లక్షణాలు తెలుసుకొని ముందుగానే గుండె వ్యాది నిపుణులను కలవడం ద్యారా దీనివల్ల ఏర్పడే దుష్ఫలితాలను నివారించి సాదారణ జీవితం గడపడానికి విలవతుంది.

హార్ట్ ఫెయిల్యూర్ అయితే హార్ట్ ట్రాన్స్ ప్లాంటేషన్ అవసరమా?

ప్రస్తుతం ఆసుపత్రులలోని ఐ.సి.యు (ఇంటెన్సివ్ కేర్ యూనిట్) లలో చేరుతున్న వారిలో అత్యదికులు హార్ట్ ఫెయిల్యూర్ వ్యాదిగ్రాస్తులే నన్నారు.హార్ట్ ఫెయిల్యూర్ వ్యాదిగ్రస్తులకు హార్ట్ ట్రాన్స్ ప్లాంటేషన్  శాశ్వత చికిత్స. గుండె మార్పిడి చేయటం ద్యారా వీరి జీవితకాల పరిమితిని గణనీయంగా పెంచవచ్చు. జీవన్ ధాన్ క్రింద పేరు నమోదు చేసుకోవడం అవసరం హార్ట్ ట్రాన్స్ ప్లాంటేషన్ తర్వాత జాగ్రత్తలు తీసుకుంటూ మాత్రలు వాడటం ద్యారా హార్ట్ ఫెయిల్యూర్ వ్యాదిగ్రస్తుల తదుపరి జీవిత పరిమితులను తగ్గించి జీవితకాలన్ని పెంచవచ్చు. గుండె మార్పిడి సురక్షితం. శస్త్రచికిత్స తర్వాత మందులు మీ జీవితానికి సంపూర్ణ రక్షణ లభిస్తుంది.

హార్ట్ ట్రాన్స్ ప్లాంటేషన్ (గుండె మార్పిడి శస్త్రచికిత్స) అంటే ఏమిటి ?

గుండె మార్పిడి శస్త్రచికిత్స అంటే వ్యాధిగ్రస్థమై పనిచేయలేని స్థితిలో ఉన్న గుండెను తొలగించి దాని స్థానంలో ఆరోగ్యకరమైన మరో గుండెను అమర్చటానికి చేసే సర్జరీనే. అవయవదానానికి అంగీకరించిన వ్యక్తి మృతిచెందిన(బ్రెయిన్ డెడ్) వెంటనే సేకరించిన గుండె మార్పిడి సర్జరీలు చేస్తారు. కొత్తగా అమర్చిన గుండె రిజెక్షన్(కొత్తగా అమర్చిన అవయవాన్ని శరీరం తిరస్కరించి రోగనిరోధక వ్యవస్థ దానిపైన దాడిచేయటం) నుంచి కాపాడి, కొత్త వ్యక్తి శరీరంతో సర్దుకుపోవటం ద్వారా సాధారణంగా పనిచేసేందుకు ఇంజక్షన్లు, ఇతర మందులు  ఇస్తారు. రక్తస్రావం, సంక్రమ వ్యాధుల నుంచి కాపాడతారు. అదే సమయంలో మార్చిన గుండెను కాపాడుకుంటూ అది సరిగ్గా పనిచేసేట్లు చూసుకోవటానికి తీసుకోవలసిన జాగ్రత్తలను హార్ట్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకున్న వ్యక్తికి, కుటుంబానికి తెలియజెబుతారు. గుండె మార్పిడి ఆపరేషన్ చేయించుకున్న వ్యక్తులు సర్జరీ తరువాత ఇరవై నుంచి  ముప్పయ్ సంవత్సరాలకు పైగా ఆరోగ్యంగా జీవిస్తున్నారు. గుండె మార్పిడి సర్జరీ గూర్చి మీరు ఆందోళన పడాల్సిన పనిలేదు. గుండె వ్యాధుల చికిత్స, ట్లాన్స్ ప్లాంటేషన్ ఆపరేషన్ ఇపుడు మన రాష్ట్రంలో  బాగా అభివృద్ధి చెందింది. దేశవిదేశాలలోని అత్యాధునిక వైద్యకేంద్రాలలో హార్ట్ ట్రాన్స్ ప్లాంటేషన్ సర్జరీలు చేసిన అనుభవంగల సర్జన్లు హైదరాబాదులో అందుబాటులో ఉంటున్నారు. వ్యాధి నిర్ధారణ పరీక్షలు, శక్తివంతమైన మందులు, ఖచ్చితమైన శస్త్రచికిత్సలు గుండె వ్యాధుల నుంచి నమ్మకమైన ఉపశమనం కలిగిస్తున్నాయి.

About Author –

Dr. N Nageswara Rao, Consultant Cardiothoracic Surgeon, Yashoda Hospitals – Hyderabad
M.S, M.Ch. (Cardio – Thoracic & Vascular Surgery) FIACS

About Author

Dr. N. Nageswara Rao | yashoda hospitals

Dr. N. Nageswara Rao

M.S, M.Ch. (Cardio-Thoracic & Vascular Surgery) FIACS

Consultant Cardiothoracic Surgeon